తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బీఆర్‌ఎస్ పార్టీ కేడర్‌లో నమ్మకం పోతోందంటూ ఆ పార్టీకి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
లైవ్ కవరేజీ
బిగ్‌బాస్ సీజన్ 6: విజేత రేవంత్ కన్నా ఎక్కువ డబ్బుతో వెనుదిరిగిన శ్రీహాన్
ఫొటో సోర్స్, Disney+ Hotstar Telugu
బిగ్‌బాస్ సీజన్ 6లో సింగర్ రేవంత్ విజేతగా నిలిచారు. 21 మంది పాల్గొన్న ఈ పోటీలో రేవంత్, శ్రీహాన్ ఫైనల్స్‌కు వచ్చారు.
బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున గోల్డెన్ బాక్స్‌తో వచ్చి ఇద్దరికీ ఒక ఆఫర్ ఇచ్చారు.
ప్రైజ్‌మనీలో సగం తీసుకుని బిగ్‌బాస్ వదిలి వెళ్లిపోవచ్చని చెప్పారు.
అందుకు రేవంత్, శ్రీహాన్ ఇద్దరూ ఒప్పుకోలేదు.
ఆ బహుమతిని రూ. 30 లక్షలకు పెంచారు. అప్పటికీ ఇద్దరూ "ఊహూ" అన్నారు.
ఆ మొత్తాన్ని రూ. 40 లక్షలకు పెంచారు నాగార్జున. శ్రీహాన్ అందుకు సిద్ధపడ్డారు. రూ. 40 లక్షలు తీసుకుని వెనుదిరిగారు.
దాంతో, రేవంత్ విజేతగా నిలిచారు. బిగ్‌బాస్ ట్రోఫీతో పాటు రూ. 10 లక్షల నగదు బహుమతి గెలుచుకున్నారు.
విన్నర్ కన్నా రన్నర్‌కే ఎక్కువ డబ్బులు వచ్చాయి.
ఎంబాపెను ఓదార్చేందుకు స్వయంగా మైదానంలోకి వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, ఎంబాపెను ఓదారుస్తున్న మేక్రాన్
ఆదివారం రాత్రి ఖతార్‌లోని లూసెయిల్ స్టేడియంలో జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది.
పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-2తో విజయం సాధించింది.
మ్యాచ్ ప్రారంభంలో 80 నిమిషాల పాటు ఏకపక్షంగా సాగింది. అర్జెంటీనా 2 గోల్స్ చేసింది. ఫ్రాన్స్ ఒక్క గోల్ కూడా చేయలేదు.
అప్పుడు ఫ్రెంచ్ స్టార్ స్ట్రైకర్ కైలియన్ ఎంబాపె రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
80వ నిమిషంలో తొలి గోల్ పెనాల్టీ షూట్ కాగా, 81వ నిమిషంలో రెండో గోల్ నమోదైంది. ఆ తరువాత 118వ నిమిషంలో ఎంబాపె మూడో గోల్ చేసి స్కోరు సమం చేశాడు.
ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్ కొట్టాడు. అయినా, ఫ్రాన్స్‌కు నిరాశే ఎదురైంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను కోల్పోయింది.
మ్యాచ్ గెలిచిన అర్జెంటీనా జట్టు గ్రౌండ్ అంతా పరిగెడుతుంటే, ఎంబాపే విషాదంలో మునిగిపోయాడు. మైదానంలో ఒకచోట కూలబడిపోయాడు.
అతడిని ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ స్వయంగా మైదానంలోకి వచ్చారు.
ఎంబాపేను కౌగలించుకుని, తలను నిమురుతూ చాలాసేపు మాట్లాడారు. ఆ తరువాతే ఎంబాపే లేచి నిలబడ్డాడు.
మేక్రాన్ ఎంబాపేను ఓదారుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశాధ్యక్షుడు, ఆటగాడిపై చూపించిన అక్కరకు జనం ప్రశంసలు కురిపిస్తున్నారు.
మేక్రాన్ మైదానంలోకి రాకముందే, అర్జెంటీనా కీపర్ ఎమిలియానో మార్టినెజ్ ఎంబాపే చేయి పట్టుకుని ఓదార్చడం కనిపించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
మ్యాచ్‌లో 120 నిమిషాల తరువాత 3-3తో స్కోరు సమం అయింది. అర్జెంటీనా తరఫున లియోనెల్ మెస్సీ రెండు గోల్స్, ఏంజెల్ డి మారియా ఒక గోల్ చేశారు.