You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

విజయవాడ వద్ద కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు

కృష్ణా నదిలో మరోసారి ప్రమాదం జరిగింది. ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు మొదలయ్యాయి.

లైవ్ కవరేజీ

  1. హాకీ వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్

    కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్, దిల్లీలోని ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో హాకీ వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు.

    వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 29 వరకు ఒడిశాలో హాకీ వరల్డ్ కప్-2023 జరగనుంది.

  2. నితీశ్ కుమార్: ‘మద్యం తాగి చనిపోతే పరిహారం ఇవ్వరు’

    మద్యం తాగి మరణించే వారికి తాము పరిహారం ఇవ్వమని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు.

    తాజాగా ఆ రాష్ట్రంలో కల్తీ సారా తాగి సుమారు 50 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు నిరసనలకు దిగిన నేపథ్యంలో నితీశ్ కుమార్ అసెంబ్లీలో మాట్లాడారు.

    ‘తాగి చనిపోయే వాళ్లకు పరిహారం ఇవ్వరు. మీరు తాగితే చనిపోతారు అని మేం విన్నవిస్తున్నాం.

    మద్యపానానికి మద్దతుగా మాట్లాడే వాళ్లకు దానివల్ల ఎటువంటి మంచి జరగదు’ అని నితీశ్ కుమార్ అన్నారు.

  3. మలేసియా: కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 16కు పెరిగిన మృతులు

    మలేసియాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది.

    సెలంగర్ రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతమైన జెంటింగ్ హైల్యాండ్స్‌లో ఒక పొలం వద్ద 90 మందికి పైగా క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు.

    ఇప్పటి వరకు 53 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఇంకా పదుల సంఖ్యలో బాధితులు మట్టి కింద ఉన్నట్లు వెల్లడించారు.

  4. టీటీడీ ఈవో ధర్మారెడ్డి జైలు శిక్ష మీద స్టే

    కోర్టు ధిక్కరణ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి విధించిన జైలు శిక్ష, జరిమానా మీద ఏపీ హై కోర్టు స్టే విధించింది.

    ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనే కేసులో సింగిల్ జడ్జితో కూడిన ధర్మాసనం ధర్మారెడ్డికి జైలు శిక్ష విధించింది.

    ఈ నిర్ణయాన్ని హై కోర్టులో సవాలుగా చేయగా సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కోర్టు నిలిపివేసింది.

  5. 100 రోజుల భారత్ జోడో యాత్ర: రాహుల్ గాంధీపై జోకులు తగ్గడానికి ఈ యాత్రే కారణమా? ప్రజలు మారిపోతున్నారా?

  6. శవంగా తేలిన దమ్మాయిగూడలో కనిపించకుండా పోయిన చిన్నారి ఇందు, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి

    దమ్మాయిగూడలో కనిపించకుండా పోయిన చిన్నారి ఇందు శవంగా తేలింది.

    మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక ఇందు అదృశ్యమైనట్టుగా నిన్న పోలీసులకు ఫిర్యాదు అందింది.

    నిన్న ఉదయం ఆమెని దగ్గర్లోని బడిలో వదిలిపెట్టిన తండ్రి, పాప ఇంటికి చేరక పోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు.

    పోలీసులు సీసీటీవీలో ఆమె నడుస్తూ వెళ్తున్న దృశ్యాలను గుర్తించారు. ఈరోజు ఆమె గురించి వెతుకులాట కొనసాగుతున్న నేపథ్యంలోనేచెరువులో శవంగా కనిపించింది.

  7. సౌత్ కొరియాలో జెండర్ ఈక్వాలిటీ మంత్రిత్వ శాఖను రద్దు.. అధ్యక్షుడి నిర్ణయంపై మహిళల ఆగ్రహం

  8. సిగరెట్ల రిటైల్ అమ్మకాలపై నిషేధం విధించడం సాధ్యమేనా.. అలా చేస్తే ఏం జరుగుతుంది?

  9. లెఫ్టినెంట్ జనరల్ కలితా: ‘తవాంగ్ సెక్టార్‌‌లో పరిస్థితి అదుపులో ఉంది’

    చైనా సరిహద్దులోని తవాంగ్ సెక్టార్‌లో ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉన్నట్లు లెఫ్టినెంట్ జనరల్ ఆర్పీ కలితా తెలిపారు.

    ‘వాస్తవ నియంత్రణ రేఖను దాటి చైనా బలగాలు వచ్చాయి. వారిని అడ్డుకునే ప్రయత్నంలో చైనా, భారత సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుని గాయాలు అయ్యాయి.

    పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రెండు దేశాల సైనిక ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉంది’ అని ఆయన అన్నారు.

    సైనికులుగా దేశాన్ని రక్షించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని లెఫ్టినెంట్ జనరల్ తెలిపారు.

    విజయ్ దివస్ సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ ఆర్పీ కలితా మాట్లాడారు.

    1971 యుద్ధంలో పాకిస్తాన్ మీద భారత్ సాధించిన విజయగానికి గుర్తుగా ‘విజయ్ దివస్’ను జరుపుతున్నారు. ఈ యుద్ధం తరువాత బంగ్లాదేశ్ దేశం ఏర్పడింది.

  10. భారత్Xబంగ్లాదేశ్: తొలి టెస్టులో 150 పరుగులకే బంగ్లాదేశ్ ఆలవుట్

    భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజున బంగ్లాదేశ్ 150 పరుగులకు ఆలవుట్ అయింది.

    తొలి ఇన్నింగ్స్‌లో ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 404 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచింది. అయితే బంగ్లాదేశ్ 150 పరుగులు మాత్రమే చేసింది.

    భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, 49 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.

    బంగ్లాదేశ్ ప్లేయర్స్‌లో ఒక్కరు కూడా 30 పరుగులు చేయలేక పోయారు.

    రెండో ఇన్నింగ్స్ ఆరభించిన భారత్ 15 ఓవర్లలో 36 పరుగులు చేసింది.

  11. ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఏంటి?

    ఇప్పటికే ఇరవైకి పైగా సంస్థలకు సంబంధించిన ఫిలిం అవార్డులకు నామినేట్ అయిన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' కొన్ని అవార్డులను గెలుచుకుంది కూడా.

    ఈ మూవీ నామినేట్ అయిన వాటిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ కూడా ఒకటి. అసలు ఏంటీ అవార్డ్?

  12. నిర్భయ అత్యాచారానికి పదేళ్లు: దిల్లీ సామూహిక అత్యాచారం తర్వాత వీరి జీవితాలు పూర్తిగా మారిపోయాయి

  13. బ్రేకింగ్ న్యూస్, మలేసియా: కొండ చరియలు విరిగిపడి 8 మంది మృతి

    మలేసియాలో కొండ చరియలు విరిగిపడటం వల్ల సుమారు 8 మంది చనిపోయారు.

    సెలంగర్ రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతమైన జెంటింగ్ హైల్యాండ్స్‌లో ఒక పొలం వద్ద సుమారు 90 మంది క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు.

    ఇప్పటి వరకు 53 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఇంకా పదుల సంఖ్యలో బాధితులు మట్టి కింద ఉన్నట్లు వెల్లడించారు.

  14. బిహార్: 50కి చేరిన ‘కల్తీ సారా’ మరణాలు

    బిహార్‌లోని చాప్రాలో ‘కల్తీ సారా’ తాగిన ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 50కి పెరిగినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    సరణ్ జిల్లాలోని చాప్రా ప్రాంతంలోగల ఇసాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ‘కల్తీ సారా’ తాగిన కొందరి ఆరోగ్యం విషమించింది. వారిని చాప్రాలోని సదర్ ఆసుపత్రికి తరలించారు.

    చికిత్స పొందుతూ మంగళవారమే సుమారు 26 మంది చనిపోయారు. ఆ తరువాత కూడా మృతుల సంఖ్య పెరిగింది.

  15. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.