You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయిన ఆర్‌ఆర్ఆర్
ఎస్ఎస్ రాజమౌళి సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’ రెండు గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయ్యింది. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ కేటగిరీతోపాటు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో నాటునాటు సాంగ్ నామినేట్ అయ్యింది.
లైవ్ కవరేజీ
అశ్వినీ వైష్ణవ్: రూ.1.25 లక్షల కోట్ల నల్లధనాన్ని వెలికితీశాం
ఇప్పటి వరకు కేంద్రప్రభుత్వం రూ.1.25 లక్షల కోట్ల నల్లధనాన్ని రికవరీ చేసినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
రూ.4,600 కోట్ల అక్రమాస్తులను అటాచ్ చేసినట్లు చెప్పారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా పారదర్శకంగా పని చేస్తోందని, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నేడు ప్రతి రూపాయిలో వందశాతం లబ్ధిదారులకు చేరుతోందని మంత్రి అన్నారు.
వెనక్కి నడవడం వల్ల ఆరోగ్యం బాగుంటుందా?
ముందుకు నడవటం కన్నా, వెనక్కి నడవటానికి మన శరీరం ఖర్చు చేసే శక్తి 40 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది.
ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్
వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతబాబుకు, తన డ్రైవర్ హత్య కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అయితే కొన్ని షరతులు విధించింది. ఆ షరతులను ట్రయిల్ కోర్టు నిర్దేశిస్తుందని సుప్రీం కోర్టు తెలిపింది.
తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది.
తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశారనే ఆరోపణలతో సత్య ఉదయ భాస్కర్ (అనంత బాబు) 200 రోజులుగా రిమాండ్‌లో ఉన్నారు.
తన దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తిని హత్య చేసినట్టు ఆయన అంగీకరించారని కాకినాడ జిల్లా ఎస్పీ నాడు ప్రకటించారు.
ఇటలీ: కాల్పుల్లో ఆ దేశ ప్రధాని స్నేహితురాలితో సహా ముగ్గురు మృతి
ఇటలీలో జరిగిన కాల్పుల్లో ఆ దేశ ప్రధాని ఫ్రెండ్‌తోపాటు మరో ఇద్దరు మహిళలు చనిపోయారు.
రోమ్‌లోని ఒక కేఫ్‌లో ఒక సాయుధుడు కాల్పులు జరపడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 57ఏళ్ల ఆ వ్యక్తి ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు.
చనిపోయిన వారిలో నికోలెట్టా గొలిశానో తన స్నేహితురాలని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తెలిపారు. ఆమె మృతికి మెలోనీ సంతాపం ప్రకటించారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా నేడు భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం
నేడు గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గుజరాత్‌లో బీజేపీ గెలిచింది. 182 సీట్లకు గాను 156 సీట్లను బీజేపీ గెలుచుకుంది. దీంతో వరుసగా ఏడోసారి గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.
కాంగ్రెస్‌కు 17 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 5 సీట్లు వచ్చాయి.
హలో ఆల్! గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.