You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్ X బంగ్లాదేశ్: 227 పరుగుల తేడాతో టీం ఇండియా గెలుపు
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్... ఇషాన్ కిషన్ 210, విరాట్ కోహ్లీ 113 పరుగులు చేయడంతో భారీ స్కోరు(409) చేయగలిగింది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టును ముందు నుంచే భారత బౌలర్లు దెబ్బ తీస్తూ వచ్చారు.
లైవ్ కవరేజీ
హైదరాబాద్‌లో యువతి కిడ్నాప్.. 100 ఇంట్లోకి చొరబడి భీభత్సం సృష్టించారు
హైదరాబాద్ శివారులోని మన్నెగూడలో శుక్రవారం యువతి కిడ్నాప్ ఘటన సంచలనం రేపింది.
దాదాపు 100 మంది ఇంట్లోకి చొరబడి 24 ఏళ్ల తమ కూతుర్ని బలవంతంగా ఎత్తుకెళ్లారని యువతి కుటుంబ సభ్యులు చెప్పారు. అడ్డుకోబోయిన తమను దుండగులు కొట్టారని, ఇంటిని ధ్వంసం చేశారని ఆరోపించారు.
ఆ యువతిని పోలీసులు రక్షించారు. 8 మందిని అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో సహా మరికొందరు పరారీలో ఉన్నారని రాచకొండ అదనపు సీపీ సుధీర్ బాబు చెప్పారు.
ఆ అమ్మాయి తనను ప్రేమించి మరొకరితో పెళ్లికి సిద్ధమయిందన్న కారణంతోనే ఆమెను నవీన్ రెడ్డి అపహరించారని స్థానికులు అంటున్నారు.
యువతి నిశ్చితార్థం రోజునే ఈ కిడ్నాప్ జరిగింది.
రెండోరోజు కొనసాగుతున్న వైఎస్ షర్మిల ఆమరణ నిరహార దీక్ష..
వైఎస్ షర్మిల హైదరాబాదులో తన పార్టీ కార్యాలయం ముందు ఆమరణ నిరహార దీక్ష కొనసాగిస్తున్నారు.
లోటస్ పాండ్ వద్ద పోలీసులు చుట్టుముట్టారని, పార్టీ కార్యకర్తలను కూడా లోపలకు రానివ్వట్లేదని సమాచారం.
నిన్న బొల్లారం పోలీస్ స్టేషన్‌లోనే 40 మంది పార్టీ ముఖ్య నేతలను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఫీఎస్‌లో ఏడుగురు పార్టీ నేతలను అరెస్ట్ చేశారు.
పాదయాత్రకి అనుమతి ఇచ్చి, అరెస్ట్ అయిన పార్టీ నేతలను విడుదల చేసే వరకు దీక్ష ఆపనని వైఎస్ షర్మిల చెబుతున్నారు.
పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదంటూ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
"ఒక మహిళ 3500 కిమీ పాదయాత్ర చేస్తూ, ప్రజలకున్న సమస్యలు ఎత్తిచూపుతూ.. మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదు, ఇంటికో ఉద్యోగం ఎందుకివ్వలేదు, మైనారిటీలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు, పోడు పట్టాలు ఎందుకు ఇవ్వలేదు, అని మేం అడగడం తప్పా? ఇన్ని కిలోమీటర్ల పాదయాత్రలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిందా? నర్సంపేటలో మేం ప్రశాంతంగా పాదయాత్ర చేసుకుంటూ పోతుంటే టీఆర్ఎస్ గూండాలే లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేశారు. మేం బాధితులం. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? మా పాదయాత్ర ఎందుకు ఆపుతున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలి.
"కేసీఆర్ మరోసారి నియంత అని నిరూపించుకున్నారు. గౌరవ హైకోర్టు పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చినా కేసీఆర్ అనుమతి ఇవ్వడం లేదు. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. న్యాయస్థానం అంటే కేసీఆర్‌కు గౌరవం లేదు. పాదయాత్రలో ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను బయటపెడితే, మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.
వైెెఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకుల్ని విడుదల చేయండి. పాదయాత్రకు అనుమతి ఇవ్వండి. లేదంటే ఆమరణ నిరాహార దీక్ష ఆగదు. పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోదు ఈ షర్మిల" అని ఆమె మీడియాతో అన్నారు.
షర్మిలకు అపోలో డాక్టర్ చంద్ర శేఖర్ వైద్య పరీక్షలు జరిపారు.
ఆమె మంచి నీళ్ళు కూడా తాగట్లేదని, శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతోందని, ఇదిలా కొనసాగితే కిడ్నీలకు ప్రమాదం పొంచి ఉందని డాక్టర్ చంద్ర శేఖర్ చెప్పారు.
షర్మిలకు రక్తపరీక్షలు నివహించారని, సాయంత్రం మరో సారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
హ్యూమన్ రైట్స్ డే: మనిషిగా మీకున్న హక్కులు ఇవి...
ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా?
మధ్యప్రదేశ్: బోరుబావిలో 80 గంటలపాటు చిక్కుకున్న ఎనిమిదేళ్ల బాలుడి మృతి..
బోరుబావిలో 80 గంటలపాటు చిక్కుకున్న ఎనిమిదేళ్ల తన్మయ్ సాహు ప్రాణాలు విడిచాడు. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో అద్నైర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇన్‌స్పెక్టర్ అజయ కుమార్ సోనీ బాలుడు చనిపోయాడన్న విషయాన్ని ధృవీకరించారు.
"మాండ్వి ప్రాంతంలో బాలుడు బోరుబావిలో పడిన దగ్గర నుంచి, అతడిని రక్షించడానికి స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ అధికారులు, సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. బోరుబావికి సమాంతరంగా గుంట తవ్వి తెల్లవారు జామున 5.30 గంటలకి మా బృందాలు బాలుడిని చేరుకోగలిగాయి" అని ఇన్‌స్పెక్టర్ అజయ కుమార్ బీబీసీతో చెప్పారు.
రెస్క్యూ బృందాలు బాలుడి వద్దకు చేరుకునే సమయానికి, బాబు స్పృహ కోల్పోయి ఉన్నాడని, వెంటనే బేతుల్ ఆస్పత్రికి తరలించారని చెప్పారు. అక్కడకు తీసుకెళ్లేసరికే బాబు చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
గత నాలుగు రోజులుగా రెస్క్యూ సిబ్బంది బోరుబావికి సమాంతరంగా గుంట తవ్వి బాబును చేరుకోవడానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఆలస్యమైపోయింది.
ఆ ప్రాంతంలో భూమి అడుగున బాగా రాళ్లు ఉండడంతో గుంట తవ్వడం ఆలస్యమైందని హోమ్ గార్డ్స్ కమాండంట్ ఎస్ ఆర్ అజ్మి మీడియాతో చెప్పారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.