కేసీఆర్- బీఆర్ఎస్: ‘ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం’

‘‘రాబోయే కాలంలో ప్రజలంతా పిడికిలి బిగించి బీఆర్ఎస్‌ జెండాలు ఎత్తుతారు. ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఈ విషయంలో నాకు 100 శాతం నమ్మకం ఉంది.’’

లైవ్ కవరేజీ

गैरी लिनेकर

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. విక్టర్ అక్సెల్‌సన్‌పై హెచ్‌ఎస్ ప్రణయ్ గెలుపు

    ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత క్రీడాకారుడు హెచ్‌ఎస్ ప్రణయ్‌కి ఊరటనిచ్చే విజయం లభించింది.

    పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ఒలింపిక్ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ ప్లేయర్ విక్టర్ అక్సెల్‌సన్‌పై ప్రణయ్ గెలుపొందాడు.

    శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 14-21, 21-17, 21-18తో విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు.

    అయితే, గ్రూప్ ‘ఎ’లో వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ప్రణయ్‌కి సెమీస్ చేరే అవకాశం చేజారింది.

  3. గంగిరెద్దులను ఆడించేవారి జీవితాలు ఎలా ఉంటాయో చూడండి...

  4. పేగు క్యాన్సర్ గుర్తించడమెలా, దీని లక్షణాలు ఎలా ఉంటాయి?

  5. వేలమంది మహిళలకు గర్భ నిరోధక సాధనాలను అమర్చారు, అయితే వాళ్లకు తెలియకుండా...

  6. బండి సంజయ్: ‘బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ సభలా లేదు, సంతాప సభలా ఉంది’

    బండి సంజయ్

    ఫొటో సోర్స్, Bandi Sanjay Kumar/fb

    భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ కార్యక్రమం ఒక సంతాప సభను తలపించిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

    ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీని ప్రకటించి, తర్వాత సమావేశం నిర్వహిస్తే ఒక్కరి మొహంలో కూడా నవ్వు కనిపించలేదని అన్నారు.

    ‘‘అది ఆవిర్భావ సభలా లేదు, సంతాప సభలా ఉంది. పార్టీ పేరు నుంచి, జెండా నుంచి తెలంగాణను తీసేశారు. బెంగళూరులో డిపాజిట్ రాని వాళ్ళను తెచ్చుకున్నారు. కేసీఆర్ తెలంగాణ మీద మాట్లాడే అర్హత కోల్పోయారు.

    బీఆర్‌ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారు. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని నేరవేర్చారో చెప్పాలి.

    కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ వ్యవహారం నుంచి, గుజరాత్‌లో బీజేపీ సాధించిన ఘన విజయం గురించి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ బీఆర్‌ఎస్ పార్టీ అంటూ నాటకాలు ఆడుతున్నారు.

    జాతీయ పార్టీ పెడితే విధివిధానాలు ఉండాలి. కేవలం తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు’’ అని బండి సంజయ్ అన్నారు.

  7. గుజరాత్‌లో బీజేపీని ఎవరూ ఎందుకు ఓడించలేకపోతున్నారు?

  8. కేసీఆర్- బీఆర్ఎస్: ‘ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం’

    బీఆర్‌ఎస్

    ఫొటో సోర్స్, TRS Party/fb

    తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరుఅధికారికంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారింది. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌సంతకం చేశారు.

    జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జేడీఎస్ చీఫ్ కుమార‌స్వామి, న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ పాల్గొని కేసీఆర్‌కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు.

    అనంతరం పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, రైతు సంఘాల నాయ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

    బీఆర్‌ఎస్

    ఫొటో సోర్స్, TRS Party/fb

    ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఏమన్నారంటే...

    ‘‘రాబోయే కాలంలో ప్రజలంతా పిడికిలి బిగించి బీఆర్ఎస్‌ జెండాలు ఎత్తుతారు. ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఈ విషయంలో నాకు 100 శాతం నమ్మకం ఉంది.

    బీఆర్ఎస్ తొలి నినాదం ‘అబ్ కీ బార్ కిసాన్ కా సర్కార్ (వచ్చేది రైతు రాజ్యం)’. ఇదే నినాదంతో మేం పోరాటం చేస్తాం.

    బీఆర్‌ఎస్ తరఫున కర్ణాటకలో ప్రచారం నిర్వహిస్తాం. కుమారస్వామి మళ్లీ కర్నాటక ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా.

    కర్ణాటకలో జేడీఎస్‌కు బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుంది. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు, రాజకీయ పార్టీలు కాదు.

    త్వరలోనే బీఆర్‌ఎస్ జాతీయ పాలసీని రూపొందిస్తాం.

    ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తాం. అదే రోజు బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మరో రెండు మూడు నెలల్లో మన సొంత బీఆర్ఎస్ భవన నిర్మాణం పూర్తవుతుంది. అక్కడి నుంచే పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభిస్తాం’’ అని కేసీఆర్ అన్నారు.

    బీఆర్‌ఎస్

    ఫొటో సోర్స్, TRS Party/fb

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. గుర్తుందా శీతాకాలం మూవీ రివ్యూ: ప్రేమ జ్ఞాపకాల్ని తట్టి లేపే సినిమా

  10. ఆమరణ దీక్షకు దిగిన వైఎస్ షర్మిల అరెస్ట్

    వైఎస్ షర్మిల

    వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్సాఆర్‌టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసనగా హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద షర్మిల ఆమరణ దీక్షకు దిగారు.

    దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

    దీనికంటే ముందు ప్రజా ప్రస్థానం పేరిట షర్మిల చేయనున్న పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

  11. మహిళల్లో ఆవేశం బాగా పెరిగిందంటున్న సర్వేలు...ఏంటి కారణం?

  12. ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు: చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, కుర్దులే - బీబీసీ పరిశోధన

  13. టీఆర్ఎస్-బీఆర్ఎస్:తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్పు కోసం లేఖపై కేసీఆర్ సంతకం

    భారత రాష్ట్ర సమితి

    ఫొటో సోర్స్, TRS Office

    తెలంగాణ రాష్ట్రసమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడానికి ఆమోదం తెలుపుతూ ఎన్నికల కమిషన్ పంపిన లేఖపై సంతకం చేయడం ద్వారా భారత రాష్ట్ర సమితి పేరును అధికారికంగా మార్చేందుకు కేసీఆర్ ఆమోదం తెలిపారు.

    ఈసీ నుంచి తనకు అందిన అధికారిక లేఖపై తెలంగాణ భవన్‌లో శుక్రవారం 1.20 నిమిషాలకు కేసీఆర్ సంతకం చేశారు.

    ఆ తర్వాత సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.

    పార్టీ పేరు మార్పు కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్(ఎస్) నేత కుమారస్వామి, నటుడు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు.

    ఈ కార్యక్రమంలో ఇంకా పలువురు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

    కవిత

    ఫొటో సోర్స్, @RaoKavitha/twitter

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2

    పోస్ట్ of X ముగిసింది, 2

  14. బోరుబావిలో చిన్నారి, 65 గంటలుగా కొనసాగుతున్న ఆపరేషన్

    బోరు బావిలో చిన్నారి

    ఫొటో సోర్స్, ANI

    మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లాలో 400 అడుగుల లోతైన బోరుబావిలో 55 అడుగుల లోతున చిక్కుకుపోయిన ఎనిమిదేళ్ల చిన్నారి తన్మయ్ రక్షించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

    రెండు రోజులు దాటినా కూడా చిన్నారిని వెలికి తీయడంలో రెస్క్యూ టీమ్‌లు విజయం సాధించలేకపోయాయి.

    సహాయ కార్యక్రమాలు జరుగుతున్న తీరుపై చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ అధికారి కొడుకో, నేత కుమారుడో అయితే ఇలాగే ఆలస్యం చేసేవారా అని వారు ప్రశ్నిస్తున్నారు.

    గంటలు గడుస్తున్నా సిబ్బంది ఏమీ చెప్పలేకపోతున్నారని తన్మయ్ తల్లి జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు.

    అయితే, బోరుబావికి సమాంతరంగా టన్నెల్ తవ్వడానికి రాళ్లు అడ్డుగా నిలుస్తున్నాయని, అందుకే సహాయ కార్యక్రమాల్లో ఆలస్యమవుతోందని జిల్లా అదనపు కలెక్టర్ శ్యామేంద్ర జైస్వాల్ అన్నారు.

    ఇప్పటికే 45 అడుగుల లోతు వరకు తవ్వామని, బాలుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు.

    డిసెంబర్ 6వ తేదీన చిన్నారి తన్మయ్ బోరుబావిలో పడిపోయాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. మహిళల్లో కోపం అతిగా పెరిగిపోతోంది.. ఎందుకు?

  16. స్వలింగ సంబంధాల రక్షణ బిల్లుపై సగర్వంగా సంతకం చేస్తా: జో బైడెన్

    జో బైడెన్

    ఫొటో సోర్స్, EPA

    స్వలింగ సంబంధాలు(Same-sex relationships), వర్ణాంతర వివాహాల రక్షణ కోసం అమెరికా పార్లమెంటులో ఒక చరిత్రాత్మక బిల్లును ప్రతినిధుల సభ ఆమోదించింది.

    గతంలో ఈ బిల్లు అమెరికా పార్లమెంట్ ఎగువ సభ సెనేట్‌లో ఆమోదం పొందింది.

    తాజాగా ప్రతినిధుల సభలో కూడా ఆమోదం పొందింది కాబట్టి, ఈ బిల్లు అధ్యక్షుడి దగ్గరికి పంపిస్తారు.

    ఈ బిల్లుపై సగర్వంగా సంతకం చేస్తానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

    ప్రతినిధుల సభలో, రిపబ్లికన్ పార్టీకి చెందిన 39 మంది సభ్యులు ఈ బిల్లుకు మద్దతుగా ఓటు వేశారు.

    అమెరికా ప్రతినిధుల సభలో ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీకి మెజారిటీ ఉంది.

    కానీ, ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాల కారణంగా, రాబోయే జనవరిలో రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఈ సభలో మెజారిటీలుగా మారతారు.

  17. హైదరాబాద్: ఎయిర్ పోర్ట్ మెట్రోలైన్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

    హైదరాబాద్: రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టు వరకు సుమారు 31 కిలోమీటర్ల మెట్రోలైన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు శంకుస్థాపన చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    సుమారు రూ. 6,250 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులో రాయదుర్గం మెట్రో స్టేషన్ సమీపంలోని మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రోలైన్ నిర్మించనున్నట్లు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇండియన్ ఎక్స్ ప్రెస్‌కు తెలిపారు.

    ఈ మెట్రో లైన్ నిర్మాణం కారణంగా కేవలం ఎయిర్ పోర్టుకు వెళ్లే వారికేకాక, ఐటీ ఉద్యోగులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన అన్నారు.

  18. మాండోస్ తుఫాను: పుదుచ్చేరి, శ్రీహరి కోట మధ్య ఈ అర్ధరాత్రి తీరం దాటే అవకాశం

    మాండోస్ తుఫాను

    ఫొటో సోర్స్, IMD

    అతి తీవ్ర తుఫాను మాండోస్ బలహీనపడి తీవ్ర తుఫానుగా మారి తమిళనాడు, పుదుచ్చేరిలను దాటుకుని పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌‌లోని శ్రీహరికోటల మధ్య ఈ అర్ధరాత్రి లేదా డిసెంబర్ 10 వ తేదీ తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

    తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ప్రస్తుతం మాండోస్ సైక్లోన్ నైరుతి బంగాళాఖాతంలో కరైకాల్ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    మాండోస్ తుఫాను నేపథ్యం లోప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

    శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం అర్ధరాత్రి వరకు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందుల్ల ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం మంచిదని కలెక్టర్ హెచ్చరించారు.

    తుఫాను నేపథ్యంలో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు శుక్రవారం మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించారు.

    స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు తుఫాన్ కదలికల పర్యవేక్షిస్తున్నట్లు, జిల్లాల యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నట్లు ఏపీ విపత్తుల నివారణ, నిర్వహణ శాఖ తెలిపింది.

    తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉన్న జిల్లాల్లోని ప్రభావం చూపే జిల్లాల్లోని 210 మండలాల్లో అధికారులను అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది.

    కామన్ అలర్ట్ ప్రోటోకాల్, ఏపీ అలర్ట్ ద్వారా ఆరు జిల్లాల్లోని సుమారు కోటిమంది సబ్‌స్క్రైబర్లకు హెచ్చరిక సందేశాలు పంపినట్లు వెల్లడించింది.

    మరోవైపు మాండస్ తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉన్న తమిళనాడులోని మూడు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

    చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం జిల్లాలలో పెనుగాలులు వీచే అవకాశం ఉందని, భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  19. తెలంగాణ: పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎప్పుడు వస్తాయి?