ధన్యవాదాలు
ఇక్కడితో నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
బీఆర్ఎస్‌గా పేరు మార్చేందుకు ఎన్నికల కమిషన్ ఆమోదం పలకడంతో శుక్రవారం(డిసెంబర్ 9) మధ్యాహ్నం 1.20 నిమిషాలకు ‘భారత రాష్ట్ర సమితి’ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.
శారద మియాపురం
ఇక్కడితో నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, trs
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌కు లేఖ అందింది.
పేరు మార్చాలంటూ కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని కమిషన్ ఆమోదించిందని, త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనుందని ఆ లేఖలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్‌గా పేరు మార్చేందుకు ఎన్నికల కమిషన్ ఆమోదం పలకడంతో శుక్రవారం(డిసెంబర్ 9) మధ్యాహ్నం 1.20 నిమిషాలకు ‘భారత రాష్ట్ర సమితి’ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు.

ఫొటో సోర్స్, twitter/trsparty

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.
ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం కాంగ్రెస్ 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 28 స్థానాల్లో ముందుంది.
మూడు నియోజకవర్గాల్లో ఇతర పార్టీలు ఆధిపత్యం ప్రదర్శించాయి.
సెరాజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ విజయం సాధించారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని 68 అసెంబ్లీ నియోజకవర్గాల కోసం నవంబర్ 12న పోలింగ్ జరిగింది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ 155 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన రికార్డును తానే బద్దలు కొట్టేలా కనిపిస్తోంది.
గుజరాత్ ఎన్నికల చరిత్రలో బీజేపీకి ఇప్పటివరకు అత్యుత్తమంగా 127 సీట్లు దక్కాయి. తాజా పరిస్థితిని చూస్తే ఈ సంఖ్య ఇప్పుడు 150 దాటేలా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
1985 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మాధవ్ సింగ్ సోలంకి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 147 సీట్లు గెలుచుకుంది.
12 గంటల వరకు జరిగిన ఓట్ల లెక్కింపు ప్రకారం ఈ సమయంలో బీజేపీ 155 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఈ 155 స్థానాలను బీజేపీ గెలిస్తే 2002 అసెంబ్లీ ఎన్నికల్లో నెలకొల్పిన తన రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా, 1985 నాటి మాధవ్ సింగ్ సోలంకి ప్రభుత్వ రికార్డును కూడా వెనక్కి నెట్టినట్లు అవుతుంది.

ఫొటో సోర్స్, ANI
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ముందంజలో ఉంది.
ఎలక్షన్ కమిషన్ అధికారిక లెక్కల ప్రకారం గుజరాత్‌లో బీజేపీ 152 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
18 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించగా, ఆమ్ ఆద్మీ పార్టీ 7 స్థానాల్లో ముందుంది. 5 స్థానాల్లో ఇతర పార్టీలు ఆధిక్యంలో ఉన్నాయి.
గుజరాత్‌లోని 182 సీట్లకు ఎన్నికలు జరిగాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, REUTERS
అణు యుద్ధం ముప్పు పెరుగుతోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అన్నారు. కానీ, ‘రష్యా పిచ్చిది కాదు, మొదటగా అణ్వాయుధాలను వినియోగించదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
వినాశనానికి దారి తీసే ఈ అణ్వాయుధాలను రష్యా, తమపై దాడి జరిగినప్పుడు ప్రతిస్పందనగా మాత్రమే ఉపయోగిస్తుందని స్పష్టం చేశారు.
రష్యా మానవ హక్కుల మండలి వార్షిక సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ యుక్రెయిన్ యుద్ధం సుదీర్ఘ కాలం పాటు కొనసాగొచ్చని అన్నారు.
‘‘అణ్వాయుధాలను ఉపయోగించే ముప్పు పెరుగుతోంది. ఈ విషయాన్ని దాచడం తప్పు. అణ్వాయుధాల ప్రయోగానికి రష్యా ఎట్టిపరిస్థితుల్లోనూ చొరవ చూపదు. అణ్వాయుధాలను చూపిస్తూ ఎవరినీ భయపెట్టం. మేం పిచ్చి వాళ్లం కాదు. అణ్వాయుధాలు అంటే ఏంటో మాకు తెలుసు’’ అని ఆయన వీడియో లింక్‌లో వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, ANI
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోన్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్యాక్టర్ సహాయంతో గుజరాత్‌లో అధికారాన్ని నిలుపుకోగలమని బీజేపీ భావిస్తుండగా, గుజరాత్‌లో బలంగా ఉనికి చాటుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆశిస్తోంది.
ఎన్నికల ప్రచారంలో తక్కువగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కూడా మంచి ఫలితాలను కోరుకుంటోంది.
ఈ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కిపునకు ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది.
పటిష్ట భద్రత నడుమ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కిస్తారు.
గత 27 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో అయిదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతోంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.