You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

పాకిస్తాన్‌పై ఒకే రోజు నలుగురు సెంచరీలు

టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. పాకిస్తాన్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజే ఏకంగా 506 పరుగులు చేసింది.

లైవ్ కవరేజీ

  1. నేడు పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్

    షెడ్యూల్ ప్రకారం నేడు ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.

    పాకిస్తాన్‌లో జరిగే ఈ సిరీస్ కోసం రావల్పిండి చేరుకున్న ఇంగ్లండ్‌ జట్టులో 14 మంది ప్లేయర్లు వైరల్ ఇన్ఫెక్షన్‌కు లోను కావడంతో తొలి టెస్ట్ మీద అనిశ్చితి నెలకొంది.

    అయితే నేడు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ మొదలవుతుంది.

    దాదాపు 17ఏళ్ల తరువాత పాకిస్తాన్‌ గడ్డ మీద టెస్ట్ సిరీస్ జరుగుతోంది.

  2. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌: ఆమె ఒక్కతే, కానీ ఆమెలో 2,500 మంది ఉన్నారు, కోర్టులో సాక్ష్యం కూడా చెబుతున్నారు.

  3. గుజరాత్ ఎన్నికలు: ప్రారంభమైన తొలి దశ పోలింగ్

    గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

    నేడు తొలి దశ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 89 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

    ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది.

    క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా జామ్‌నగర్ నార్త్ నుంచి బరిలో ఉన్నారు.

  4. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.