‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను ‘వల్గర్’ అనడం మీద కశ్మీర్ పండితుల నిరసన
‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా మీద ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జూరీ చైర్మన్ నడవ్ లపిడ్ చేసిన వివాదాస్పద కామెంట్స్‌కు నిరసనగా జమ్మూలో కశ్మీరీ పండితులు ఆందోళనకు దిగారు.
‘కశ్మీర్ ఫైల్స్‌లో చూపించింది 5శాతం మాత్రమే. 95శాతం చూపించలేదు. ఇజ్రాయెల్ రాయబారి ఆ వ్యాఖ్యలను ఖండించడాన్ని ఆహ్వానిస్తున్నాం’ అని యోగేశ్ పండిట్ అనే వ్యక్తి అన్నారు.
‘ఆయన వ్యాఖ్యలతో మా గాయాలకు మరింత కారం పూసినట్లు అయింది’ అని రంజన్ అనే వ్యక్తి చెప్పారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.