ఎయిరిండియా: బట్టతల ఉంటే గుండు చేయించుకోవాలి

ఫొటో సోర్స్, Facebook/AirIndia
ఎయిరిండియా విమానాల్లో ప్రయాణికులకు సేవలు అందించే సిబ్బంది ఎలా ఉండాలో మార్గదర్శకాలను ఆ సంస్థ విడుదల చేసింది.
మెడలో, చేతులకు, కాళ్లకు... మతపరమైన తాయత్తులు, దారాలు వంటివి ధరించ కూడదని సంస్థ ఆదేశాలు జారీ చేసింది.
మతపరమైన చెవి రింగులు, ముక్కుపుడకలు, ఆభరణాలు కూడా ధరించకూడదని తెలిపింది.
అలాగే బట్టతల ఉండే వాళ్లు తప్పనిసరిగా గుండు చేయించుకోవాలని, తెల్లజుట్టు ఉండకూడదని కూడా వెల్లడించింది.
ఒకనాడు ప్రభుత్వరంగ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది.

