You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

భారత్ X న్యూజీలాండ్: తొలి వన్డేలో ఓడిపోయిన టీం ఇండియా

న్యూజీలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడిపోయింది. భారత్ విధించిన 307 పరుగుల లక్ష్యాన్ని 17 బంతులు మిగిలి ఉండగానే న్యూజీలాండ్ చేధించింది.

లైవ్ కవరేజీ

  1. ఎయిరిండియా: బట్టతల ఉంటే గుండు చేయించుకోవాలి

    ఎయిరిండియా విమానాల్లో ప్రయాణికులకు సేవలు అందించే సిబ్బంది ఎలా ఉండాలో మార్గదర్శకాలను ఆ సంస్థ విడుదల చేసింది.

    మెడలో, చేతులకు, కాళ్లకు... మతపరమైన తాయత్తులు, దారాలు వంటివి ధరించ కూడదని సంస్థ ఆదేశాలు జారీ చేసింది.

    మతపరమైన చెవి రింగులు, ముక్కుపుడకలు, ఆభరణాలు కూడా ధరించకూడదని తెలిపింది.

    అలాగే బట్టతల ఉండే వాళ్లు తప్పనిసరిగా గుండు చేయించుకోవాలని, తెల్లజుట్టు ఉండకూడదని కూడా వెల్లడించింది.

    ఒకనాడు ప్రభుత్వరంగ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది.

  2. అమిత్‌ షా: చరిత్రను తిరగ రాయకుండా మనల్ని అడ్డుకునేది ఎవరు

    భారతదేశ చరిత్రను వక్రీకరించి రాశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.

    ‘నేను కూడా చరిత్ర విద్యార్థినే. మన చరిత్రను తప్పుగా రాశారని ఎన్నోసార్లు విన్నా.

    మన చరిత్రను వక్రీకరించారు. ఇప్పుడు ఆ చరిత్రను సరి చేసి, తిరగరాయకుండా మనల్ని అడ్డుకునేది ఎవరు? పాత చరిత్రను మనం తిరగరాయాలి. అత్యంత గొప్పగా దాన్ని ప్రపంచానికి చూపించాలి.

    దేశంలోని అనేక ప్రాంతాల్లో 150 ఏళ్లకు పైబడి పాలించిన 30 పెద్ద సామ్రాజ్యాల గురించి, దేశం స్వేచ్ఛ కోసం పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసిన 300 హీరోల గురించి పరిశోధించి రాయాలని చరిత్ర విద్యార్థులను, ప్రొఫెసర్లను కోరుతున్నా’ అని ఆయన అన్నారు.

    అస్సాంలోని ఒకనాటి అహోం సామ్రాజ్యానికి చెందిన జనరల్ లచిత్ బరఫుకన్ 400వ జయంతి సందర్భంగా అమిత్ షా మాట్లాడారు.

  3. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.