You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కీయెవ్‌పై మిస్సైల్ దాడులు.. యుక్రెయిన్ నగరాల్లో కరెంటు కోతలు

నగరంలోని మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని, ఇతర ప్రదేశాల్లోనూ పేలుళ్లు నమోదయ్యాయని కీయెవ్ మేయర్ ప్రకటించారు.

లైవ్ కవరేజీ

  1. బ్రేకింగ్ న్యూస్, అమెరికా: వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు

    అమెరికాలోని వర్జీనియాలో వాల్‌మార్ట్ స్టోర్ వద్ద ఒక సాయుధుడు కాల్పులు జరిపినట్లు వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది.

    ఈ ఘటనలో కొందరు చనిపోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన సాయుధుడు కూడా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

  2. ‘నేను ప్రపంచంలోనే బెస్ట్ క్లీనర్’

    మురికిగా ఉన్న ఇళ్లను ఉచితంగా శుభ్రం చేసే ఆరీ కటరినా క్లీనింగ్ వీడియోలు సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయ్యాయి.

    దీంతో ఎంతోమంది తమకు సాయం చేయాలంటూ ఆమెను అడుగుతున్నారు. తనకు ఇళ్లలో నిండిపోయి ఉండే బూజు, మరకలు అంటే ఇష్టం అంటారు ఆరీ.

  3. ‘ప్రతి నెలా 16 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం’

    ప్రతి నెలా కేంద్ర ప్రభుత్వం సుమారు 16లక్షల ఉద్యోగాలు ఇస్తోందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.

    మంగళవారం సీఆర్‌పీఎఫ్ నిర్వహించిన ‘రోజ్‌గార్ మేళ’లో ఆయన మాట్లాడారు.

    ‘అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ భారత్‌లో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రతి నెలా సగటున 15-16 లక్షల ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది’ అని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.

  4. ‘10వేల మంది ఉద్యోగులను తొలగించనున్న గూగుల్’

    పని తీరు సరిగ్గా లేని ఉద్యోగులను తీసేయాలని గూగుల్ నిర్ణయించినట్లు టెక్నాలజీ వెబ్‌సైట్ ది ఇన్ఫర్మేషన్ వెల్లడించింది.

    అలాంటి 10వేల మంది ఉద్యోగులను గుర్తించమని మేనేజర్లను గూగుల్ ఆదేశించినట్లు తెలిపింది. అంటే మొత్తం ఉద్యోగుల్లో సుమారు 6శాతం మందిని గూగుల్ తొలగిస్తోంది.

    ఆర్థికమాంద్యంతో ఆదాయాలు తగ్గడం వల్ల ఇటీల మెటా, అమెజాన్ వంటి కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తున్నాయి.

  5. తుర్కియే: ఆంకారా సమీపంలో భూకంపం

    తుర్కియే రాజధాని ఆంకారాకు దగ్గర్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు మీద దాని తీవ్రత 6.0గా నమోదైంది.

    ఆంకారాకు 186 కిలోమీటర్ల దూరంలో ఉన్న డజ్‌సీ ప్రావిన్స్‌లో భూమి కంపించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ తెలిపింది.

    దాంతో ఆంకారా, ఇస్తాంబుల్‌లలోనూ భూమి కంపించినట్లు తుర్కియే అధికారులు వెల్లడించారు.

    ఇంత వరకు మృతుల గురించి సమాచారం ఏమీలేదు. భూకంపం తరువాత కొన్ని చోట్ల కరెంటు పోయినట్లు తెలుస్తోంది.

  6. హలో ఆల్! గుడ్ మార్నింగ్.

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.