వరల్డ్ కప్ ఓటమి తరువాత చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మతో సహా సెలెక్షన్ కమిటీ మీద బీసీసీఐ వేటు

చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మతోపాటు నేషనల్ సెలెక్షన్ కమిటీ మొత్తాన్ని బీసీసీఐ తొలగించింది.

లైవ్ కవరేజీ

  1. సావర్కర్‌ను కించపరిచారంటూ రాహుల్ గాంధీపై కేసు నమోదు

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, Twitter/ANI

    భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై మహారాష్ట్రలో కేసు నమోదైంది.

    స్వతంత్ర్య పోరాటయోధుడు వీడీ సావర్కర్‌పై కించపరిచేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బాలాసాహెబంచి శివసేన నాయకురాలు వందన డోంగ్రే గురువారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    స్థానికుల మనోభావాలను దెబ్బతీసేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ఈ మేరకు థానే నగర్ పోలీస్ స్టేషన్‌లో రాహుల్ గాంధీపై ఐపీసీ సెక్షన్లు 500, 501 కింద నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కేసు నమోదైంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. తిరుపతి: నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు

    నవజీవన్ ఎక్స్‌ప్రెస్

    ఫొటో సోర్స్, UGC

    అహ్మదాబాద్ నుంచి చెన్నై వైపు వెళ్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్‌లో మంటలు చెలరేగాయి.

    గూడూరు జంక్షన్ సమీపంలోకి రాగానే రైలులోని కిచెన్ బోగీలో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి.

    ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు.

    వెంటనే అప్రమత్తమైన అధికారులు గూడూరు రైల్వే స్టేషన్‌లో రైలును ఆపి మంటలను అదుపులోకి తెచ్చారు.

    సుమారు గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్‌లోనే రైలు నిలిచిపోయింది.

    నవజీవన్ ఎక్స్‌ప్రెస్

    ఫొటో సోర్స్, UGC

  3. నాన్సీ పెలోసీ: డెమొక్రటిక్ పార్టీ నాయకురాలి పదవికి వీడ్కోలు

    నాన్సీ పెలోసీ

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికా పార్లమెంట్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతినిధుల సభ (హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో పార్టీ నాయకురాలి పదవికి వీడ్కోలు పలికారు.

    82 ఏళ్ల నాన్సీ పెలోసీ అమెరికా కాంగ్రెస్‌లో అత్యంత శక్తిమంతమైన డెమొక్రాట్ నేత. పార్లమెంట్‌కు స్పీకర్‌గా వ్యవహరించిన తొలి మహిళ.

    ఆమె కాంగ్రెస్ దిగువ సభలో కాలిఫోర్నియా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారు.

    మధ్యంతర ఎన్నికల తర్వాత హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ లభించింది. దీంతో స్పీకర్ పదవిని కూడా త్వరలో మరొకరు చేపట్టనున్నారు.

    రిపబ్లికన్ నాయకుడు కెవిన్ మైక్రార్థి తదుపరి స్పీకర్‌గా నామినేట్ అయ్యారు. ఆయన నాన్సీ పెలోసీ స్థానాన్ని భర్తీ చేయనున్నారు.

    నాన్సీ పెలోసీ జనవరి వరకు స్పీకర్ పదవిలో కొనసాగనున్నారు.

    డెమొక్రటిక్ పార్టీ నాయకుడిగా హకీమ్ జెఫ్రీజ్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే అమెరికా చరిత్రలో ఈ పదవిని అధిష్టించిన తొలి నల్లజాతి నేత అవుతారు.

  4. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.

  5. మగవాళ్లు ఏడవకూడదా? ఏడ్చే మగాళ్లను నమ్మకూడదా? - ఇంటర్నేషనల్ మెన్స్ డే

  6. "ఆయన నన్ను తాకినప్పుడల్లా నేను వేదనకు లోనవుతుంటాను"

  7. ఇందిరా గాంధీ: ‘గూంగీ గుడియా’ నుంచి ‘ఐరన్ లేడీ’గా ఎలా మారారు?

  8. 'సారీ! ఓ 10 రోజులు నేను మీ భార్యను కాదు!'