లైగర్ సినిమా పెట్టుబడుల మీద పూరీ జగన్నాథ్‌ను ప్రశ్నించిన ఈడీ

హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మిలను అధికారులు ప్రశ్నిస్తున్నారు. లైగర్ సినిమాలో పెట్టుబడుల మీద ఈడీ ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

లైవ్ కవరేజీ

  1. ఎలాన్ మస్క్: ‘‘ఎక్కువ గంటలు పనిచేయండి లేదా ఉద్యోగం వదిలేయండి’’

    ఎలాన్ మస్క్

    ఫొటో సోర్స్, Reuters

    ట్విట్టర్ సిబ్బంది అత్యధిక తీవ్రతతో ఎక్కువ గంటల పాటు పనిచేయడానికి కట్టుబడి ఉండాలని లేనిపక్షంలో కంపెనీ నుంచి వెళ్లిపోవాలని ఎలాన్ మస్క్ చెప్పినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

    ట్విట్టర్‌లో ఉండాలనుకుంటే ఈ ప్రతిజ్ఞకు అంగీకరించాల్సిందే అని సిబ్బందికి రాసిన ఈమెయిల్‌లో ఎలాన్ మస్క్ పేర్కొన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.

    ‘‘ట్విట్టర్‌కు కష్టించి పనిచేసే వారి అవసరం ఉంది. అంటే అత్యధిక తీవ్రతతో ఎక్కువ గంటల పాటు పని చేయాలి. అసాధారణ ప్రదర్శన కనబరిస్తేనే మీకు ఉత్తీర్ణత దక్కుతుంది. కొత్త ట్విట్టర్‌లో భాగం కావాలంటే గురువారం లోగా మీకు పంపించిన లింక్‌ను క్లిక్ చేయండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ట్విట్టర్ ఎదుగుదలకు తోడ్పడినట్లే. అందుకు ధన్యవాదాలు’’ అని ఈమెయిల్‌లో మస్క్ పేర్కొన్నట్లు ‘ది గార్డియన్’ పేర్కొంది.

    వారానికి కనీసం 40 గంటలు సిబ్బంది కార్యాలయంలోనే ఉండాలని ఈమెయిల్‌లో రాసినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది.