You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కృష్ణ: ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు

నటుడు కృష్ణ అంత్యక్రియలు ఈరోజు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో జరిగాయి. అంతకుముందు ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని పద్మాలయా స్టూడియోస్‌లో ఉంచారు. రాజకీయ, సినీ ప్రముఖులు కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

లైవ్ కవరేజీ

  1. యుక్రెయిన్ యుద్ధం: రష్యా క్షిపణి పోలాండ్‌లో పడటంతో ఇద్దరి మృతి

    తమ భాభాగంపై మంగళవారం మధ్యాహ్నం 3:40 గంటలకు రష్యాకు చెందిన ఒక క్షిపణి పడటంతో ఇద్దరు మృతి చెందారని పోలాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    అయితే, ఆ క్షిపణిని ఎవరూ ప్రయోగించారనే అంశంపై తమ వద్ద ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లేవని పోలాండ్ తెలిపింది.

    ఈ ఘటనపై ‘అత్యవసర వివరణాత్మక నివేదిక’ ఇవ్వాలని పోలాండ్‌లోని రష్యా రాయబారిని కోరినట్లు పోలాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లుకాజ్ జసినా తెలిపారు.

    క్షిపణి పడిన సెరెవోడా గ్రామం యుక్రెయిన్-పోలాండ్ సరిహద్దుల్లో ఉంది.

    అయితే, ఈ దాడిని రష్యా ఖండించింది.

    ‘‘యుక్రెయిన్-పోలాండ్’’ సరిహద్దు సమీపంలోని లక్ష్యాలపై రష్యా ఎటువంటి దాడులు నిర్వహించలేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

    ‘పరిస్థితిని మరింత దిగజార్చాలనే ఉద్దేశంతో, రెచ్చగొట్టేందుకు చేసే ప్రయత్నాలు ఇవి’ అని రష్యా పేర్కొంది.

  2. భారత్‌లోని ప్రతీ వ్యక్తి హిందువే: మోహన్ భాగవత్ పునరుద్ఘాటన

    భారత్‌లో నివసించే ప్రతీ వ్యక్తి హిందువే అని, భారతీయులందరి డీఎన్ఏ ఒకటేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం పునరుద్ఘాటించారు.

    భగవంతుడిని ప్రార్థించే విధానాన్ని ఎవరూ మార్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఎందుకంటే ఏ రకంగా ప్రార్థించినా అది ఒకే మార్గంలో భగవంతున్ని చేరుతుందని చెప్పారు.

    ఈ మాటల్నే గతంలో కూడా మోహన్ భగవత్ ఉద్ఘాటించారు.

    ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో స్వయం సేవక్ సంఘ్‌కు చెందిన ఒక కార్యక్రమంలో గతంలో పాల్గొన్న మోహన్ భగవత్ ఇలాంటి వ్యాఖ్యల్నే చేశారు.

    ‘‘భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత్ ప్రత్యేకత. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలనే భావనను హిందుత్వ విశ్వసిస్తుందని అందరి నమ్మకం. ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పడినప్పటి నుంచి అంటే 1925 నుంచి మేం ఒకటే మాట చెబుతున్నాం. అదేంటంటే.. భారత్‌లో నివసించే ప్రతీ వ్యక్తి హిందువే. భారత్‌ను తమ మాతృభూమిగా భావించేవారు, భిన్నత్వంలో ఏకత్వం అనే భారత సంస్కృతిలో నివసించాలని కోరుకునేవారంతా ఏ మతం, సంస్కృతి, భాష, భావజాలాన్ని అనుసరించినా వారంతా హిందువులే’’ అనిఆ కార్యక్రమంలో మోహన్ భగవత్ అన్నారు.