24 గంటలు గడిస్తేనే ఏ విషయమైనా చెప్పగలం - కృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు

కృష్ణ కొంతకాలంగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. ఈ రోజు ఉదయం గుండెపోటు రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు.

లైవ్ కవరేజీ

  1. సినీ నటుడు కృష్ణకు అస్వస్థత.. కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స

    సూపర్ స్టార్ కృష్ణ

    ఫొటో సోర్స్, H.E Dr Naresh VK actor/twitter

    సినీ నటుడు కృష్ణ అస్వస్థతతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు.

    కృష్ణ కొంతకాలంగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నారు.

    ఆ క్రమంలోనే ఈరోజు ఉదయం సమస్య తీవ్రమవడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.

    ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

    ఇటీవల ఆయన భార్య ఇందిరాదేవి మరణించారు.

  2. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లకు ఐసీసీ 'మోస్ట్ వాల్యుబుల్ టీం'లో చోటు

    విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌

    ఫొటో సోర్స్, Getty Images

    టీ20 వరల్డ్‌కప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 11 మంది ఆటగాళ్లతో 'మోస్ట్ వాల్యుబుల్ టీం' జాబితాను ఐసీసీ ప్రకటించింది.

    అందులో భారత్ నుంచి విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌లకు యాదవ్ చోటు దక్కింది.

    ఈ జట్టు కోసం ఆరు దేశాలకు చెందిన 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు.

    టీ20 (2022) ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్, రన్నరప్ పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఆటగాళ్లు కూడా ఈ జట్టులో ఉన్నారు.

    2022 టీ20 టోర్నీలో అత్యత్తమ ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఇందులో 12వ స్థానంలో హార్థిక్ పాండ్యా కూడా ఉన్నాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఇది కాక, 2022 టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 98.67 సగటుతో మొత్తం 296 పరుగులు చేశాడు.

    టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేయడం ఇది రెండోసారి. అంతకుముందు, 2014 టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేశాడు. 2014లో కోహ్లీ 6 మ్యాచ్‌లలో 106.33 సగటుతో 319 పరుగులు చేశాడు. అయితే, ఇందులో ఫైనల్స్‌లో భారత్ శ్రీలంక చేతిలో ఓడిపోయింది.

    ఇది కాకుండా, ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డ్ సాధించాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే 1016 పరుగుల రికార్డును అధిగమించాడు.

  3. జీ20లో సదస్సులో పాల్గొనేందుకు బాలీ చేరుకున్న ప్రధాని మోదీ

    నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, ANI

    జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇండోనేషియాలోని బాలి చేరుకున్నారు.

    "బాలీ సదస్సులో, ప్రపంచ వృద్ధిని పునరుద్ధరించడం, ఆహారం భద్రత, ఇంధన భద్రత, పర్యావరణం, ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి కీలక అంశాలపై జీ20 నాయకులతో చర్చిస్తాను" అని బాలీ పర్యటనకు బయలుదేరే ముందు మోదీ తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. టీ20లో పాకిస్తాన్ ఓడిపోవడంతో పంజాబ్‌లోని మోగాలో విద్యార్థుల మధ్య ఘర్షణలు

    పంజాబ్‌లోని మోగాలో ఒక కాలేజీలో టీ20 మ్యచ్ ఫైనల్ చూస్తున్న విద్యార్థుల మధ్య ఘర్షణలు చెలరేగాయి.

    పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ గెలిచిన తరువాత, బిహార్, కశ్మీర్ విద్యార్థులు ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారని పోలీసు అధికారులు చెప్పారు. కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు పోలీసు అధికారులు తెలిపారని పీటీఐ పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    మోగాలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ కాలేజీ విద్యార్థులు అంతా కలిసి కూర్చుని మ్యాచ్ చూస్తుండగా, పాకిస్తాన్ ఓటమితో బిహార్, కశ్మీర్ విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

    కొద్దిసేపటికే అది తోపులాటకు దారితీసిందని, ఆపై ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, ఇటుకలతో దాడి చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు.

    ప్రస్తుతం కాలేజీకి పోలీసు కాపలా పెట్టారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

    విద్యార్థుల మధ్య ఘర్షణలకు సంబంధించిన పలు వీడియోలు వైరల్‌ అయ్యాయి. వీటిలో ఒకరిపై ఒకరు ఇటుకలు, రాళ్లు రువ్వుకోవడం కనిపిస్తోంది.

    స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ జస్వీందర్ సింగ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ, “లాలా లజపత్ రాయ్ కాలేజీలో రెండు గ్రూపుల విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఎలాంటి నినాదాలు చేసినట్లు రిపోర్ట్ లేదు" అని చెప్పారు.

  5. అక్రమంగా నిర్మించిన ఫ్లాట్లను ఎలా గుర్తించాలి, ఎల్ఆర్ఎస్‌తో ఉపయోగం ఉంటుందా?

  6. సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌ల టాక్ షో - 'ది మీర్జా మాలిక్ షో'

    సానియా మీర్జా

    ఫొటో సోర్స్, Sania Mirza/ Twitter

    భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ కలిసి ఒక టాక్ షోను నిర్వహించనున్నారు.

    దీని పేరు 'ది మీర్జా మాలిక్ షో'.

    పాకిస్తానీ ఛానల్ 'ఉర్దుఫ్లిక్స్ అఫీషియల్‌'లో ఈ కార్యక్రమం ప్రసారం రానుంది. ఛానెల్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో టాక్ షో పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ కనిపిస్తున్నారు.

    'ది మిర్జా మాలిక్ షో అతి త్వరలో ఉర్దూఫ్లిక్స్‌లో మాత్రమే' అని పోస్టర్’లో రాశారు.

    పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
    Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of Instagram ముగిసింది

    ఈ జంట విడిపోతున్నట్లు గతంలో మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, కొత్త టాక్ షో ప్రకటనతో ఈ వదంతులకు తెరపడింది.

    సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 2010లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ దుబాయ్‌లో స్థిరపడ్డారు. 2018లో వారికి ఇజాన్ పుట్టాడు.

    ఈ జంట వివాహ బంధంలో కష్టాలు ఎదుర్కొంటోందని ఒక వారం క్రితం పాకిస్తాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ, షోయబ్, సానియా దీనిపై స్పందించలేదు. వారి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

  7. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంలో ఎవరి పాత్ర ఎంత?