టీ20 వరల్డ్‌కప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 11 మంది ఆటగాళ్లతో 'మోస్ట్ వాల్యుబుల్ టీం' జాబితాను ఐసీసీ ప్రకటించింది.
అందులో భారత్ నుంచి విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌లకు యాదవ్ చోటు దక్కింది.
ఈ జట్టు కోసం ఆరు దేశాలకు చెందిన 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు.
టీ20 (2022) ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్, రన్నరప్ పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఆటగాళ్లు కూడా ఈ జట్టులో ఉన్నారు.
2022 టీ20 టోర్నీలో అత్యత్తమ ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఇందులో 12వ స్థానంలో హార్థిక్ పాండ్యా కూడా ఉన్నాడు.
ఇది కాక, 2022 టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 98.67 సగటుతో మొత్తం 296 పరుగులు చేశాడు.
టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేయడం ఇది రెండోసారి. అంతకుముందు, 2014 టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేశాడు. 2014లో కోహ్లీ 6 మ్యాచ్‌లలో 106.33 సగటుతో 319 పరుగులు చేశాడు. అయితే, ఇందులో ఫైనల్స్‌లో భారత్ శ్రీలంక చేతిలో ఓడిపోయింది.
ఇది కాకుండా, ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డ్ సాధించాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే 1016 పరుగుల రికార్డును అధిగమించాడు.