You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్.. జైలు నుంచి విడుదల
రాజాసింగ్ ను విడుదల చేయాలని, పీడీయాక్ట్ కేసును సవాల్ చేస్తూ ఆయన సతీమణి ఉషాబాయి హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం కొన్ని షరతులతో రాజాసింగ్ విడుదలకు ఆదేశాలు ఇచ్చింది.
లైవ్ కవరేజీ
భారత్, నేపాల్‌లో భూకంపం... రిక్టర్ స్కేలు మీద 6.3గా నమోదు
మంగళవారం అర్ధరాత్రి భారత్, నేపాల్‌లో భూకంపం వచ్చింది.
దిల్లీ రాజధాని ప్రాంతంలో భూమి తీవ్రంగా కంపించింది. నేపాల్‌లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలు మీద 6.3గా నమోదైంది.
నేపాల్ కేంద్రంగా ఈ భూకంపం వచ్చింది.
ఈ విపత్తులో ఆరుగురు నేపాల్ ప్రజలు చనిపోయారు.
నేపాల్‌లో ఇళ్లు కూలడంతో ఆరుగురు చనిపోయినట్లు బీబీసీ నేపాలీ సర్వీస్‌కు దోతీ జిల్లా చీఫ్ డిస్ట్రిక్ ఆఫీసర్ కల్పన శ్రేష్ట తెలిపారు.
గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.