అక్టోబర్ 23వ తేదీన తెలంగాణ లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర.. సోమవారం రాత్రి మద్నూర్ మండలం మెనూరు వద్ద భారీ బహిరంగ సభతో ముగిసింది.
లైవ్ కవరేజీ
తెలంగాణలో ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
ఫొటో సోర్స్, INC
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో
ముగిసింది.
అక్టోబర్ 23వ తేదీన తెలంగాణ లోకి ప్రవేశించిన భారత్ జోడో
యాత్రకు 24 నుంచి 26 వరకు విరామం ఇచ్చారు. ఆ సమయంలో దిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లి
ఖార్జున ఖర్గే బాధ్యతల స్వీకార కార్యక్రమానికి రాహుల్ హాజరయ్యారు.
27 నుంచి
తిరిగి యాత్ర ప్రారంభం అయ్యింది. నవంబర్ 4వ
తేదీన మరోసారి యాత్ర కు విరామం ఇచ్చారు.
సోమవారం రాత్రి మద్నూర్
మండలం మెనూరు వద్ద భారీ బహిరంగ సభతో తెలంగాణలో రాహుల్ యాత్ర ముగిసింది.
మహారాష్ట్రలోకి యాత్ర ప్రవేశించింది.
తెలంగాణలో రాహుల్ గాంధీ 375 కిలోమీటర్లు
పాదయాత్ర చేశారు.
ప్రతి రోజు
ఉదయం 6 గంటల నుంచి 15 కిలోమీటర్ల యాత్ర సాయంత్రం 4 గంటల నుంచి 10 కిలోమీటర్ల యాత్ర సాగింది.
19
అసెంబ్లీ నియోజక వర్గాలు, 7 పార్లమెంట్ నియోజక వర్గాల్లో ఈ యాత్ర సాగింది.
కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్రలో రాహుల్ గాంధీ ఇప్పటి వరకూ ప్రవేశించిన మెట్రో
సిటీ హైదరాబాదే. హైదరాబాద్
లో నవంబర్ 1,2 తేదీల్లో రాహుల్ పాద యాత్ర
చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర లక్ష్యం నెరవేరలేదు – రాహుల్ గాంధీ
మోదీ, కేసీఆర్ పాలనలో ప్రజలెవవరూ
సంతోషంగా లేరని ఈ యాత్ర ద్వారా తనకు అర్థమైందని రాహుల్ గాంధీ అన్నారు.
కొంతమందికి లాభం చేయాలన్నదే కేసీఆర్ ప్రయత్నమని
రాహుల్ గాంధీ ఆరోపించారు.
శ్రీకాకుళం: స్థలం వివాదంలో మహిళలపై కంకర పోసిన ప్రత్యర్థులు, లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం
శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని హరిపురం గ్రామంలో ఇద్దరు మహిళలపై ట్రాక్టర్ తో కంకర పోసిన ఘటన కలకలం సృష్టించింది.
మహిళలు ‘చచ్చిపోతున్నాం, కాపాడండి’ అంటూ వేడుకుంటుంటే... ‘చచ్చిపో పర్లేదు’ అనే వాయిస్ కూడా ఈ వీడియోలో వినిపిస్తోంది.
వివాదం ఏంటి?
శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం గ్రామానికి చెందిన కొట్ర దాలమ్మ, ఆమె కుమార్తె మజ్జి సావిత్రికి...అదే కుటుంబానికి చెందిన కొట్రా ఆనందరావు, కొట్ర రామారావు అనే వ్యక్తుల మధ్య ఆస్తి వివాదం ఉంది.
ఈ వివాదంపై తాను కోర్టుకు కూడా వెళ్లినట్లు కొట్ర దాలమ్మ బీబీసీతో చెప్పారు. తమ స్థలం కొంత కబ్జాకు గురైందని దాలమ్మ అన్నారు.
“హరిపురంలో మాకు కొంత స్థలం ఉంది. కుటుంబ పంపకాల్లో మాకు అది వచ్చింది. అయితే మాకు పంపకాల్లో వచ్చిన స్థలంలో కొట్ర ఆనందరావు, రామారావులు పునాది తీశారు. దానిపై మేం ఆడగడానికి వెళ్లాం. వెళ్లగానే మాపై అక్కడ ఉన్న ట్రాక్టరు మట్టిని పోసేశారు. దానిలో మేం కురుకుపోయాం. కాపాడండి అని అరుస్తూంటే...పట్టించుకోలేదు. కొద్ది సేపటి తర్వాత ఊరి జనాలు వచ్చి పారలతో తవ్వి, మమ్మల్ని ఆ మట్టి నుంచి బటయకు తీశారు. మేం పోలీసులకు ఫిర్యాదు చేశాం” అని దాలమ్మ చెప్పారు.
ఏడేళ్లుగా వివాదం
గత కొన్ని సంవత్సరాలుగా ఇంటి స్థలం కోసం పోరాటం చేస్తున్నామని కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రి చెప్పారు.
2019లో ఈ స్థలం కోసం నిరాహార కూడా చేశామని చెప్పారు.
తమకి హక్కులు కలిగి ఉన్న తమ భూమి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
ఈ వివాదం మొదలై ఏడళ్లు అయ్యిందని, ప్రస్తుతం వివాదంపై కోర్టులో కేసు ఉందని చెప్పారు.
“మా స్థలంలో పునాది తీశారు. పునాది తీసిన స్థలం విషయంలోనే కోర్టులో కేసు వేశాం. ఇప్పుడు అక్కడే నిర్మాణాలు చేపట్టారు. అందుకే ఆడగడానికి వెళ్తే మాపై కంకరు పోశారు. అలాగే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి” అని మరో బాధితురాలు మజ్జి సావిత్రి చెప్పారు.
కోర్టు ఆర్డర్ కోసం చూస్తున్నాం: పోలీసులు
హరిపురంలోని ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల మధ్య ఈ స్థలవివాదం చోటు చేసుకుందని మందస పోలీస్ స్టేషన్ ఎస్ఐ వై. రవి కుమార్ బీబీసీతో చెప్పారు.
మహిళలు ఇద్దరు తమపై కంకరు పోసిన విషయంపై ఫిర్యాదు చేశారని చెప్పారు.
“దాలమ్మ, సావిత్రి ఇద్దరు కూడా వివాదమున్న స్థలంలో ఏదైనా నిర్మాణం చేపడుతన్నారనే విషయంలో చూసేందుకు వెళ్లామని, అక్కడికి వెళ్లగానే వారిపై ట్రాక్టరుతో కంకరుపోశారని ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఫిర్యాదు స్వీకరించి రీసిట్ కూడా అందించాం. అయితే ఈ కేసు కోర్టులో ఉన్నందుకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చాం. వారి ద్వారా కోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లి, కోర్టు ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటాం” అని ఎస్పై రవికుమార్ చెప్పారు.
అలాగే కొట్ర రామారావు, ఆనందరావులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ వారి అందుబాటులోకి రాలేదు.
ప్రపంచంలో తొలిసారి ల్యాబ్‌లో తయారు చేసిన రక్తాన్ని మనుషులకు ఎక్కించిన వైద్యులు.. ఈ రక్తం ఏంటి? ఎలా అభివృద్ధి చేస్తారు?
పిల్లల గురించి, పిల్లల ముందే ఎవరైనా చెడుగా మాట్లాడుతుంటే ఏం చేయాలి?
బ్రిటిష్ వలస పాలనలో భారతీయ మహిళలను టార్గెట్ చేసిన సబ్బులు, క్రీముల ప్రకటనలు ఎలా ఉండేవి?
కారు ఎంత సేఫ్ అనేది నిర్ధారించే 'క్రాష్ టెస్ట్' ఎలా చేస్తారు?
'EWS కోటా రాజ్యాంగం ప్రకారం చెల్లుతుంది' - సుప్రీంకోర్టు
ఫొటో సోర్స్, Getty Images
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
ఈ కోటా కోసం రాజ్యాంగంలో చేసిన 103వ సవరణను చెల్లుతుందని, అది రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించదని ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్, జస్టిస్ దినేష్ మహేశ్వరి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది.
"సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకే కాక ఎలాంటి వెనుబడిన వర్గాలవారికైనా రిజర్వేషన్ ఇవ్వవచ్చు. కాబట్టి, ఆర్థికంగా వెనుబడిన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం కాదు. EWS రిజర్వేషన్ల నుంచి SC/ST, OBCలను మినహాయించడం రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుంది. అందుబాటులో ఉన్న 50 శాతం రిజర్వేషన్ సీట్లకు అదనంగా EWS రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగబద్ధమే" అని జస్టిస్ దినేశ్ మహేశ్వరి అన్నారు.
అయితే, 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని మెజారిటీ అభిప్రాయాలతో బెంచ్‌లోని సీజేఐ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ విభేదించారు.
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం EWS కోటాను అమలు చేసింది. దీని కోసం రాజ్యాంగంలో 103వ సవరణను చేసింది. అయితే, దీన్ని తమిళనాడు అధికార పార్టీ డీఎంకే సహా పలువురు పిటిషనర్లు కోర్టులో సవాలు చేశారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని ఆరోపించారు.
దీనిపై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
క్రికెట్ వరల్డ్ కప్: భారత్-పాకిస్తాన్ ఆడిన 5 మరపురాని మ్యాచ్‌లు
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్స్
దక్షిణ భారతదేశంలో తొలి 'వందే భారత్' ఎక్స్‌ప్రెస్స్ ట్రయిల్ రన్ ఈరోజు ప్రారంభమైంది.
చెన్నై నుంచి మైసూర్ వెళ్లే ఈ రైలు చెన్నై ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో బయలుదేరింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ ట్రైన్‌ను అధికారికంగా నవంబర్ 11న ప్రారంభించనున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 2
టాంజానియా: విక్టోరియా లేక్‌లో కూలిపోయిన ప్యాసింజర్ విమానం.. 19 మంది మృతి
ఫొటో సోర్స్, CHARLES MWEBEYA TBC
టాంజానియా ప్యాసింజర్ విమానం విక్టోరియా లేక్‌లో కూలిపోయింది. మొత్తం 19 మంది చనిపోయారు.
పక్కనే ఉన్న బుకోబా పట్టణంలో విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా, సరస్సులో కూలిపోయింది.
విమానంలో ఉన్న 43 మందిలో 24 మంది ప్రాణాలతో బయటపడ్డారని ఆ విమాన సంస్థ ప్రెసిషన్ ఎయిర్ తెలిపింది.
పైలట్స్ ఇద్దరు కాక్‌పిట్ నుంచి స్థానిక అధికారులతో మాట్లాడగలిగారు. కానీ, ఆ తరువాత వారిద్దరూ ప్రాణాలు కోల్పోయి ఉంటారని టాంజానియా ప్రధాని అన్నారు.
బుకోబా ఎయిర్‌పోర్ట్ రన్‌వే చివర్న తీరంలో విమానం క్రాష్ అయింది.
రెస్క్యూవర్లు నీటిలో దూకి విమానంలో చిక్కుకున్న కొంతమందిని రక్షించగలిగారు.
స్థానిక సమయం 08:50 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వాతావరణం సహకరించకపోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.
అత్యవసర సిబ్బంది ATR-42 విమానాన్ని తాళ్లతో ఒడ్డుకు లాగడానికి ప్రయత్నించారు. దాంతో, విమానం కొంత పైకి తేలింది.
EWS కోటా కింద 10% రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టు తీర్పు
ఫొటో సోర్స్, Getty Images
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) 10 శాతం రిజర్వేషన్లు కేటాయించాలన్న వాదనపై సుప్రీంకోర్టు సోమవారం నిర్ణయం తీసుకోనుంది.
ఈడబ్ల్యూఎస్ కోటా చెల్లుబాటును సవాలు చేస్తూ 30కి పైగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటిపై సెప్టెంబర్ 27న సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించనుంది.
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసింది. దీని కోసం రాజ్యాంగంలో 103వ సవరణను చేసింది.
2019లో అమలు చేసిన EWS కోటాను తమిళనాడు అధికార పార్టీ డీఎంకే సహా పలువురు పిటిషనర్లు కోర్టులో సవాలు చేశారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని ఆరోపించారు.
చీఫ్ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ జేబీ పదర్వాలాలతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 13న విచారణ ప్రారంభించింది. సెప్టెంబర్ 27న తీర్పును రిజర్వ్ చేసింది.
ట్విట్టర్ యూజర్లు మాస్టోడాన్‌కు జంప్ అవుతున్నారు
ట్విట్టర్‌లో బ్లూ టిక్ కావాలంటే 8 డాలర్లు చెల్లించాలని ఆ సంస్థ కొత్త సీఈఓ ఈలాన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
దాంతో, ట్విట్టర్ యూజర్లు మాస్టోడాన్‌కు జంప్ అవుతున్నారు.
తమ సోషల్ నెట్‌వర్క్ యాప్‌కు 6,55,000 పైగా యూజర్లు ఉన్నారని, వీరిలో 2,30,000 మంది గత వారమే చేరారని మాస్టోడాన్ తెలిపింది.
చూడ్డానికి మాస్టోడాన్ అచ్చు ట్విట్టర్ లాగే ఉంటుంది. ఇందులో పోస్టులను టూట్స్ అని పిలుస్తారు.
ఈ యాప్ ప్రారంభమై ఆరేళ్లు అవుతోంది. ఇది కొంత వ్యత్యాసంగా ఉంటుంది. కొత్త యూజర్లకు కాస్త తికమకగా ఉందని చెబుతున్నారు.
ఇందులో చేరాక, సర్వర్ ఎంచుకోవాలి. దేశం, నగరం, ఆసక్తులు, టెక్నాలజీ, గేమింగ్ మొదలైన సర్వర్లు ఉంటాయి.
ఇలా ఎందుకు అంటే, మాస్టోడాన్ అన్నది ఒక సింగిల్ ప్లాట్‌ఫాం కాదు. ఇది ఒక వ్యక్తి లేదా, ఒక సంస్థ యాజమాన్యంలో లేదు.
వివిధ సర్వర్లు ఒక దానికొకటి లింక్ అయి నెట్‌వర్క్ ఫార్మ్ చేస్తాయి. ఈ సర్వర్లు వివిధ వ్యక్తుల లేదా సంస్థల యాజమాన్యంలో ఉంటాయి.
ఇదొక వికేంద్రీకరణ పద్ధతి.
మాస్టోడాన్ చాలావరకు ఫ్రీ యాప్.
ఫొటో సోర్స్, NURPHOTO
కేజ్రీవాల్: 'గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకోమని బీజేపీ ఆఫర్ ఇచ్చింది'
ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్ ఎన్నికల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వెనక్కి తగ్గితే, దిల్లీ మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లపై కేసులు కొట్టివేస్తామంటూ బీజేపీ తనకు ఆఫర్ ఇచ్చిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు.
ఎన్‌డీటీవీ టౌన్‌హాల్ షోలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, "ఆప్‌ని విడిచిపెట్టి వస్తే, దిల్లీ ముఖ్యమంత్రి కావచ్చన్న వారి (బీజేపీ) ప్రతిపాదనను మనీశ్ సిసోడియా తిరస్కరించారు. ఇప్పుడు వారు (బీజేపీ) నన్ను సంప్రదించారు.. మీరు గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే, సత్యేందర్ జైన్, సిసోడియా ఇద్దరినీ విడుదల చేస్తామని, వారిపై ఉన్న అభియోగాలను ఎత్తివేస్తామని ఆఫర్ ఇచ్చారు" అని తెలిపారు.
ఈ ప్రతిపాదన ఎవరు చేశారనే ప్రశ్నకు కేజ్రీవాల్ జవాబిస్తూ, "మాలో ఒకరి పేరును నేనెలా బయటపెట్టగలను.. వారి ద్వారానే నాకు ప్రతిపాదన వచ్చింది.. వారు (బీజేపీ) ఎప్పుడూ నేరుగా సంప్రదించరు. ఒకరి నుంచి ఒకరికి వెళుతూ, మనకు సందేశం చేర్చగల సన్నిహితుడిని చేరుకుంటారు" అని చెప్పారు.
బీజేపీ ఏమంది?
అరవింద్ కేజ్రీవాల్ వాదనలు పచ్చి అబద్ధాలని బీజేపీ పేర్కొంది.
"ఇవన్నీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, బీజేపీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు. కేజ్రీవాల్ దిల్లీ ప్రజలను, దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన అధికారంలోకి రావడానికి సామాజిక కార్యకర్త అన్నా హజారేను ఉపయోగించుకున్నారు. తరువాత ఆయనను విడిచిపెట్టారు. ఆయన అధికారం కోసం ఎవరినైనా తప్పుదోవ పట్టించగలరు" అని బీజేపీ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం అన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.