లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
మళ్లీ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీం ఇండియా 16.5 ఓవర్లకు 150 పరుగులు చేసింది. నాలుగు వికెట్లు కోల్పోయింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
మళ్లీ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
ప్రముఖ సామాజిక సేవకురాలు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఇలా భట్(89) మరణించారు.
మహిళా సాధికారత కోసం పాటుపడిన ఆమెకు రామన్ మెగససే అవార్డు కూడా లభించింది.
2016 నుంచి నుంచి సబర్మతి ఆశ్రమం అధ్యక్షురాలిగా ఉన్నారు. మహాత్మ గాంధీ ప్రారంభించిన గుజరాత్ విద్యాపీఠ్‌కు చాన్సెలర్‌గా కూడా పని చేశారు.
ఆమె మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
మహిళల అభ్యున్నతికి ఆమె ఎంతో పాటుపడ్డారని మోదీ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ తరువాత #cheating బాగా ట్రెండ్ అవుతోంది.
ఆఖరి ఓవర్లలో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో భారత్ గెలిచింది.
అయితే సోషల్ మీడియాలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు భారత్ మోసం చేసిందంటూ ఆరోపిస్తున్నారు.
బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాన వల్ల మధ్యలో కాసేపు మ్యాచ్ ఆగిపోయింది. దాంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్‌ను 16 ఓవర్లలో 151గా నిర్ణయించారు.
అయితే గ్రౌండ్ తడిగా ఉన్నప్పటికీ ఆటను మళ్లీ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల భారత్‌కు అంపైర్లు ఫేవర్ చేశారని బంగ్లాదేశ్, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు.
‘వెల్ పెయిడ్ ఇండియా’ అంటూ ఒకరు ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, UGC
నంద్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి(52) మరణించారు.
ఆయన అనారోగ్యంతో కొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
చల్లా స్వగ్రామం అవుకులో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రానున్నారు.
చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీగా ఉంటూ చనిపోవడంతో ఆయన కుమారుడు చల్లా భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించింది.
భారత్ విధించిన 185 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 7 ఓవర్లకు బంగ్లాదేశ్ 66 పరుగులు చేసింది.
వికెట్లు ఏమీ కోల్పోలేదు.

ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో విద్యుత్ తీగలు ట్రాక్టర్ మీద తెగి పడటంతో అందులో ప్రయాణిస్తున్న కూలీల్లో నలుగురు చనిపోయారు.
బొమ్మనహళ్ మండలం దర్గా హొన్నూరుకు చెందిన కూలీలు ఆముదం పంటను కోసి ట్రాక్టర్‌లో లోడ్ చేస్తుండగా విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగి కూలీలపై పడ్డాయి.
దాంతో షాక్ తగిలి నలుగురు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 20 ఓవర్లకు భారత్ 184 పరుగులు చేసింది. 6 వికెట్లు కోల్పోయింది.
విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సు, 8 ఫోర్లు ఉన్నాయి.
కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 50 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 30 పరుగులు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీం ఇండియా 16.5 ఓవర్లకు 150 పరుగులు చేసింది. నాలుగు వికెట్లు కోల్పోయింది.
విరాట్ కోహ్లీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
గతంలో ఈ రికార్డు మహేళ జయవర్ధనే (1,016 పరుగులు) పేరిట ఉంది.
ఈ రికార్డును కోహ్లీ 23 ఇన్నింగ్సుల్లో సాధించాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ(50), దినేశ్ కార్తీక్(7) క్రీజులో ఉన్నారు.
ఓపెనర్లలో కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 4 సిక్సులు 3 ఫోర్లు ఉన్నాయి.
మరొక ఓపెనర్ రోహిత్ శర్మ మరొకసారి విఫలమయ్యాడు. 8 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేశాడు.

ఫొటో సోర్స్, REUTERS
ప్రపంచంలో అతి పెద్ద యాపిల్ ఫోన్ తయారీ ఫ్యాక్టరీ ఉన్న చైనాలోని ఝాంగ్జౌ నగరంలో కోవిడ్ లాక్‌డౌన్ విధించారు.
బుధవారం ఝాంగ్జౌ నగరంలోని ఒక జిల్లాలో లాక్‌డౌన్ విధించినట్లు అధికారులు ప్రకటించారు. ఇది వారం రోజులపాటు కొనసాగనుంది. ఈ చర్య వల్ల కొత్తగా వస్తున్న ఐఫోన్ 14 తయారీపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఈ నగరంలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఐఫోన్‌లు తయారవుతాయి.
చైనా అధ్యక్షుడు ఇటీవల ప్రారంభించి జీరో కోవిడ్ విధానం కారణంగా చైనా ప్రజలు, వ్యాపారాలు దెబ్బతింటున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
లాక్‌డౌన్ కారణంగా అనేక రవాణా సదుపాయాలను నిలిపేశారు. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని ఆదేశాలు వచ్చాయి.
‘‘నిబంధనలను ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు’’ అని అధికారులు ప్రకటించారు.
ఝాంగ్జౌ నగరం హెనాన్ రాష్ట్ర రాజధాని. ఈ నగరంలో పది లక్షలమంది జనాభా ఉన్నారు. గతవారంలో ఈ నగరంలో 167 అంటువ్యాధుల కేసులు బయటపడ్డాయని, అంతకు ముందు వారం 97 కేసులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
రాబోయే క్రిస్మస్, న్యూ ఇయర్ రిలీజ్ కోసం ఐఫోన్ 14ను తయారీని ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే లాక్‌డౌన్ రావడంతో ఇప్పుడు వాటి తయారీ మీద ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.
ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో 2 లక్షలమంది ఉద్యోగులు ఐఫోన్ తయారీలో పాలు పంచుకుంటారు. ఐఫోన్‌లలో మెజారిటీ ఐఫోన్‌ల తయారీ ఈ ఫ్యాక్టరీ నుంచే జరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియాలోని ఒక జూలో 5 సింహాలు తమ బోను నుంచి బయటకు రావడంతో కాసేపు జూ పరిసర ప్రాంతాలలో భయానక పరిస్థితి ఏర్పడింది.
సిడ్నీలోని తరోంగా జూలో ఉంటున్న ఈ అయిదు సింహాలలో ఒకటి తల్లి సింహం కాగా, మిగిలిన నాలుగు దాని పిల్లలు.
స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఈ అయిదు సింహాలు జూలో వాటి ఎన్ క్లోజర్ బయట కనిపించాయి.
విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే జూలో లాక్‌డౌన్ ప్రకటించారు.
ఒక సింహం పిల్లను మత్తు ఇంజెక్షన్లతో అదుపు చేయాల్సి వచ్చిందని, మిగిలిన సింహాలను నిమిషాల వ్యవధిలోనే మళ్లీ ఎన్‌క్లోజర్‌లోకి పంపించగలిగామని అధికారులు వెల్లడించారు.
సింహాలు బయటకు వచ్చిన ఘటనలో ఎవరి మీదా ఎలాంటి దాడి జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే, అవి ఎలా బయటకు వచ్చాయన్న అంశంపై మాత్రం అధికారులు వివరణ ఇవ్వలేదు.
‘‘ఇది మామూలు విషయం కాదు’’ అని జూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సైమన్ డఫీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
సింహాలు తమ ఎన్‌క్లోజర్ పక్కనే ప్రదేశానికి చేరుకున్నాయని, ఈ ప్రాంతం రాత్రి జూలో గడిపేవారు ఉండే ప్రాంతానికి 100 మీటర్ల దూరంలో ఉందని సైమన్ డఫీ స్థానిక మీడియాతో అన్నారు. అప్పటికే మెయిన్ జూ మూసేసి ఉందని ఆయన వెల్లడించారు.
‘‘అవి ఆ ప్రదేశాన్నిగానీ, జూ ను గానీ దాటి దూరం వెళ్లలేదు’’ అని డఫీ స్పష్టం చేశారు.
సింహాలు బయటకు వచ్చిన పది నిమిషాల సమయంలోనే జూకీపర్ అలారం మోగించినట్లు సీసీకెమెరా రికార్డులలో ఉంది.
ఈ ప్రాంతంలో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేయించామని, బయటకు వచ్చిన కాసేపటికే అందులోని నాలుగు సింహాలు తిరిగి తమ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిపోయాయని సైమన్ డఫీ తెలిపారు.
ఈ ప్రాంతం నూరు శాతం సురక్షితం అని నిర్ధరణ చేసుకునే వరకు ఈ సింహాల ఎన్‌క్లోజర్లను మూసేసి ఉంచినట్లు డఫీ వెల్లడించారు.
ఆస్ట్రేలియాలో సింహాలు బోను నుంచి బయటకు రావడం చాలా అరుదుగా జరుగుతుంది.
2009లో సిడ్నీలోని మోగో జూలో ఒక ఆడ సింహం ఇలాగే ఎన్‌క్లోజర్ నుంచి బయటకు వచ్చింది. దాని నుంచి ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటుందని గ్రహించిన అధికారులు ఆ సింహాన్ని కాల్చి చంపారు.

ఫొటో సోర్స్, Reuters
బ్రెజిల్ ప్రస్తుత అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఇటీవల ముగిసిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి నిరాకరించారు. ఈ ఎన్నికల్లో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూలా డ సిల్వా విజయం సాధించారు.
ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ ఇద్దరు నేతలలో ఎవరు అధ్యక్ష పీఠం వైపు అడుగులు వేస్తారనే దానిపై స్పష్టత రాలేదు. చివరకు లూలా డ సిల్వాకు 50.9 శాతం, బోల్సోనారోకు 49.1 శాతం ఓట్లు వచ్చాయి.
కానీ బోల్సోనారో ఈ ఓటమి గురించి మొదట స్పందించ లేదు. తాజాగా ఆయన తన మౌనాన్ని వీడారు. అయితే, తన తన ఓటమిని మాత్రం అంగీకరించలేదు. అలాగని ఈ ఎన్నికల ఫలితాలను ఆయన సవాల్ చేయలేదు.
రెండు నిమిషాల పాటు సాగిన బోల్సోనారో సంక్షిప్త ప్రసంగం తర్వాత, అధికార బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రస్తుతం ఆయనకు చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పని చేస్తున్న అధికారి వెల్లడించారు.
బోల్సోనారో ప్రసంగం తర్వాత బ్రెజిల్ సుప్రీంకోర్టు కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.
అధికార బదిలీకి ఆమోదం తెలపడం ద్వారా బోల్సోనారో ఎన్నికల ఫలితాలను అంగీకరించారని పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters
ఉత్తర కొరియా కనీసం పది క్షిపణులను ఒకదాని తర్వాత ఒకటిగా ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం బుధవారం ఉదయం తెలిపింది.
ఈ బాలిస్టిక్ క్షిపణుల్లో ఒకటి దక్షిణ కొరియా సముద్రం సరిహద్దు మీదుగా మొదటిసారి పడింది. దీంతో ఉత్తర కొరియా ద్వీపంపై వైమానిక దాడులు చేస్తామని దక్షిణ కొరియా హెచ్చరించింది.
ఉత్తర కొరియా క్షిపణులు దక్షిణ కొరియా జలాల సమీపంలో పడటం ఇదే తొలిసారని దక్షిణ కొరియా పేర్కొంది. ఉత్తర కొరియా ప్రయోగం ఏమాత్రం ఆమోదనీయం కాదని దక్షిణ కొరియా అధికారులు స్పష్టం చేశారు.
ఈ క్షిపణులను ప్రయోగించే ముందు దక్షిణ కొరియా, అమెరికా మధ్య జరుగుతున్న వైమానిక దళ డ్రిల్స్ నిలిపివేయాలని ఉత్తర కొరియా కోరింది.
అయితే, దక్షిణ కొరియా-అమెరికా మధ్య సంబంధాలను విచ్ఛిన్నం చేసే ఏ ప్రయత్నమూ విజయవంతం కాదని ఆయన అన్నారు.
ఉత్తర కొరియా దూకుడుపై సత్వరమే స్పందిస్తామని దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్-యుల్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.