ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుసుకుందాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
43 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీకిరూ.1075 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని సిసోడియా ప్రశ్నించారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుసుకుందాం.
రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు.
తెలంగాణ, దిల్లీ ఎమ్మెల్యేలను వందల కోట్లతో కొనేందుకు ప్రయత్నించిన బీజేపీ విఫలమైందని ఆయన అన్నారు.
బీజేపీ రూ.100 కోట్లతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు.
కొనుగోలు వ్యవహారంలో బయటపడిన ఆడియోలలో షా అనే పేరును మధ్యవర్తులు ప్రస్తావించారని, ఆ షా అమిత్ షా అయితే, ఆయన్న అరెస్టు చేసి విచారించాలని సిసోడియా డిమాండ్ చేశారు.
‘‘దిల్లీలో 43 మంది ఎమ్మెల్యేలను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణలో ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రయత్నంలో, ₹100 కోట్లతో పట్టుబడిన వారి బ్రోకర్,దిల్లీ ఎమ్మెల్యేను 25-25 కోట్లలో కొనుగోలు చేయడానికి డబ్బు సిద్ధం చేసినట్లు స్వయంగా అంగీకరించాడు’’ అని మనీశ్ సిసోడియా అన్నారు.
43 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీకిరూ.1075 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని సిసోడియా ప్రశ్నించారు.
టి20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజీలాండ్ జట్టు ఘన విజయం సాధించింది.
శనివారం జరిగిన గ్రూప్ 1 మ్యాచ్‌లో న్యూజీలాండ్ 65 పరుగులతో గెలిచింది.
168 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 19.2 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌటైంది.
భానుక రాజపక్స (34), కెప్టెన్ దసున్ షనక (35) రాణించారు.
కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లతో చెలరేగాడు. మిచెల్ శాన్‌ట్నర్, ఇష్ సోధి తలా 2 వికెట్లు తీశారు. టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు గ్లెన్ ఫిలిఫ్స్ సెంచరీ సాధించడంతో న్యూజీలాండ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది.
ఈ గెలుపుతో న్యూజీలాండ్ ఖాతాలో 2 పాయింట్లు చేరాయి.
గ్రూప్ 1 జాబితాలో న్యూజీలాండ్ ఓవరాల్‌గా 3 పాయింట్లు, 4.450 నెట్ రన్ రేట్‌తో అగ్రస్థానానికి చేరుకుంది.
న్యూజీలాండ్ బ్యాట్స్‌మన్ గ్లెన్ ఫిలిఫ్స్ టి20 ప్రపంచకప్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్ సెంచరీతో ఆదుకోవడంతో న్యూజీలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేయగలిగింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజీలాండ్ 15 పరుగులకే టాపార్డర్ వికెట్లను కోల్పోయింది.
ఫిన్ అలెన్ (1), డేవాన్ కాన్వే (1), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (8)లు విఫలమయ్యారు.
ఈ దశలో గ్లెన్ ఫిలిఫ్స్ రాణించాడు. శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ 64 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు.
డరైల్ మిచెల్ (24 బంతుల్లో 22) కాసేపు ఫిలిప్స్‌కు అండగా నిలిచాడు.
శ్రీలంక బౌలర్లలో కసున్ రజిత 2 వికెట్లు తీశాడు. మహీశ్ తీక్షణ, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ డి సిల్వా, లహిరు కుమార తలా ఓ వికెట్ పడగొట్టారు.
శ్రీలంక విజయానికి 168 పరుగులు చేయాలి.
అయితే తొలి 2 ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయిన శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఓపెనర్లు నిశంక (0), కుశాల్ మెండిస్ (4), ధనంజయ డిసిల్వా (0) పెవిలియన్ చేరారు.
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌కు హైకోర్టు అనుమతించింది.
నిందితులు వెంటనే సైబరాబాద్ కమిషనర్ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో రామచంద్ర భారతి, నందు కుమార్, సింహయాజిలను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు వారిని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. వారికి రిమాండ్ విధించాలని పోలీసులు ఏసీబీ న్యాయమూర్తిని కోరారు. లంచం డబ్బు దొరకని కారణంగా ఈ కేసు అవినీతి నిరోధక చట్టం వర్తించదని అభిప్రాయపడిన ఆ కోర్టు చెప్పడంతో ముగ్గురినీ గురువారం విడుదల చేశారు.
రిమాండ్‌కు ఏసీబీ స్పెషల్ కోర్టు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
విచారించిన హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.
బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఛట్ పూజ సందర్భంగా ప్రసాదం తయారుచేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాలామంది తీవ్రంగా కాలిపోయారు.
ఔరంగాబాద్ జిల్లా షాగంజ్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఒక రెండంతస్తుల భవనంలో ప్రసాదం తయారు చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
30 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారని చెబుతున్నారు.
గాయపడినవారిలో కొందరు ఔరంగాబాద్ సదర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని అక్కడి నుంచి పట్నా, గయలకు తరలించారు.
ప్రమాదంలో ఇంతవరకు ఎవరూ చనిపోలేదని సదర్ హాస్పిటల్ సివిల్ సర్జన్ డాక్టర్ వీరేంద్ర ప్రసాద్ ‘బీబీసీ’తో చెప్పారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా సంప్రదాయ గిరిజన నృత్యం చేశారు.
భద్రాచలానికి చెందిన గిరిజన కళాకారులతో కలిసి ఆయన ‘కొమ్ముకోయ’ నృత్యం చేశారు.
యాత్రలో భాగంగా శనివారం ఆయన విద్యా సంబంధ సమస్యలపై మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య వివిధ సంస్థలు, ప్రముఖులతో భేటీ కానున్నారు.
కాగా పాదయాత్రలో శనివారం సినీనటి పూనమ్ కౌర్ పాల్గొన్నాారు.
ఆమె రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.
చేనేత కార్మికుల సమస్యలను ఆమె రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.
దిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఇండిగో విమానం ఇంజిన్‌లో మంటలు కనిపించడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
టేకాఫ్‌కు కొద్ది సేపటి ముందు మంటలను గుర్తించడంతో ప్రమాదం తప్పింది.
శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
దిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఇండిగో విమానం 6E-2131 టేకాఫ్ కావడానికి ముందు ఈ విషయం గుర్తించారు.
ప్రయాణికులను అందరినీ సురక్షితంగా కిందకు దించి వేరే విమానంలో బెంగళూరు పంపించారు.
ప్రమాద సమయానికి విమానంలో 177 మంది ప్రయాణికులు ఏడుగురు సిబ్బంది ఉన్నారు.
వెనుక ఉన్న విమానం నుంచి మంటలను చూసి..
టేకాఫ్ కోసం రన్‌వేపై ఉన్న ఇండిగో విమానం వెనుక స్పైస్ జెట్ విమానం ఇంకోటి ఉంది.
ఆ స్పైస్ జెట్ విమాన పైలట్ ఇండిగో విమాన ఇంజిన్‌లో మంటలను గుర్తించి కంట్రోల్ రూమ్‌కి సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఆ వెంటనే కంట్రోల్ రూం నుంచి ఇండిగో విమానం పైలట్‌కు సమాచారం రావడంతో టేకాఫ్ నిలిపివేశారు.
కాగా ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు చేయనుంది.
విమానం ఇంజిన్లో మంటలకు సంబంధించిన కొన్ని వీడియలో సోషల్ మీడియాలో కనిపించాయి.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.