You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

అమెరికా: స్పీకర్ నాన్సీ పెలోసీ భర్త మీద దాడి

82 ఏళ్ల పాల్ పెలోసీ కాలిఫోర్నియాలోని ఇంట్లో ఉన్నప్పుడు ఆయన మీద దాడి చేశారు. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

లైవ్ కవరేజీ

  1. రామసేతు: ఇది రాముడి కాలంలో జరిగిన నిర్మాణమేనా, కాదా?

  2. లైవ్ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం కలుద్దాం.

  3. బ్రేకింగ్ న్యూస్, అమెరికా: నాన్సీ పెలోసీ భర్త మీద దాడి

    అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసీ భర్త పాల్ పెలోసీ మీద దాడి జరిగింది.

    82 ఏళ్ల పాల్ పెలోసీ కాలిఫోర్నియాలోని ఇంట్లో ఉన్నప్పుడు ఆయన మీద దాడి చేశారు. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

    సుత్తి తీసుకొని ఇంటి లోపలికి వచ్చిన నిందితుడు ‘నాన్సీ ఏది?’ అంటూ పాల్ పెలోసీని అడిగినట్లు చెబుతున్నారు.

    శుక్రవారం ఉదయం దాడి జరిగిన సమయంలో నాన్సీ పెలోసీ వాషింగ్టన్‌లో ఉన్నారు.

    ప్రస్తుతం దాడి చేసిన నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అయితే దాడి చేయడానికి కారణమేంటో తెలియలేదు.

  4. తెలంగాణ: బావిలో పడ్డ కారు... నలుగురు మృతి

    మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో బైపాస్ రోడ్‌లో గల పాడుబడ్డ బావిలో కారు అదుపు తప్పి పడింది.

    కారులో ఏడుగురు ఉండగా ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయినట్లు బీబీసీకి మహబూబాబాద్ పోలీసులు తెలిపారు.

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన ఐదుగురు వరంగల్‌ జిల్లా అన్నారం షరీఫ్‌ వచ్చి.. తిరిగి వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్‌కు చెందిన మరో ఇద్దరు బంధువులను కూడా కారులో ఎక్కించుకున్నారు.

    కేసముద్రం బైపాస్‌ రోడ్డులో మలుపు వద్దకు రాగానే కారు అదుపు తప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.

    ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.

  5. ‘ఫాంహౌస్‌లో ముందే సీసీ కెమెరాలు పెట్టాం...రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం’-హైకోర్టుకు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

  6. కరెన్సీ నోట్లపై దేవతల బొమ్మలు ముద్రిస్తారా?-వీక్లీ షో విత్ జీఎస్

  7. నెల జీతంలాగా స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే మార్గమిది, ఎవరు చేరొచ్చు, తెలుసుకోవాల్సిన విషయాలేంటి

  8. వ్యభిచారం చేస్తోందని మాజీ భర్త ఆరోపణ, రాళ్లతో కొట్టి చంపమని కోర్టు తీర్పు, ఆమెను రక్షించేవారే లేరా

  9. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా బండి సంజయ్ ప్రమాణం

    ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

    ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

    ఈ మేరకు ఆయన యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లారు.

    తడి బట్టలతో ఆలయంలోకి ప్రవేశించి తాము ఎలాంటి తప్పు చేయలేదంటూప్రధాన గుడి లోపల ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో తమకు సంబంధం లేదని పునరుద్ఘాటించారు.

    కేసీఆర్ కూడా ఈ సవాలును స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.

  10. ‘భారత్ గెలుపు కంటే పాక్ ఓటమితోనే మీకు ఎక్కువ ఆనందం’ అంటూ అమిత్ మిశ్రాపై ఆగ్రహం...

    భారత మాజీ క్రికెటర్ అమిత్‌ మిశ్రా చేసిన ట్వీట్‌పై పాకిస్తాన్‌కు చెందిన కొందరు వ్యక్తులు తీవ్రంగా స్పందించారు.

    గురువారం జింబాబ్వే చేతిలో పాక్ ఓడిపోయిన తర్వాత అమిత్ మిశ్రా ఒక ట్వీట్ చేశారు.

    ‘‘ఈ మ్యాచ్‌లో ముందు నుంచి జింబాబ్వే చక్కగా ఆడింది. కాబట్టి పాకిస్తాన్‌కు నిరాశ అని చెప్పకూడదు. పొరుగువారికి ఇది చెడ్డ రోజు’’ అని ట్వీట్‌లో అమిత్ మిశ్రా పేర్కొన్నారు.

    దీంతో సోషల్ మీడియాలో పలువురు పాక్ జట్టు అభిమానులు అమిత్ మిశ్రా ట్వీట్‌పై విరుచుకుపడ్డారు.

    మహ్మద్ నజీబ్ అనే వ్యక్తి ట్వీట్ చేస్తూ... "మీ కెరీర్‌లో మీరు ఏదైనా గొప్ప ఘనత సాధించి ఉంటే ఇలా ఈ రకంగా ప్రజల దృష్టిని మీవైపుకు తిప్పుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు’’ అని అన్నారు.

    షకీల్52075870 అనే మరో ఖాతాదారుడు కూడా అమిత్ మిశ్రా ట్వీట్‌కు స్పందించారు.

    ‘‘ఇలాగే జోకులు వేయండి. మీకు భారత్ గెలుపు కంటే పాకిస్తాన్ ఓటమి అనే అంశంతో ఎక్కువ ఆనందం కలుగుతుంది. గతేడాది మీ పరిస్థితి ఏంటో గుర్తుందా?’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

    ఆసిఫ్ జునైద్ అనే మరో వ్యక్తి... ‘‘నాకు 1999 ప్రపంచకప్ గుర్తుకు వస్తుంది. అప్పుడు జింబాబ్వే 3 పరుగులతో భారత్‌ను ఓడించింది. పాకిస్తాన్ కేవలం ఒక పరుగుతోనే ఓటమి పాలైంది’’ అని ట్వీట్‌లో రాశాడు.

  11. పాకిస్తాన్, జింబాబ్వే మ్యాచ్ తర్వాత మిస్టర్ బీన్ పేరు ఎందుకు ట్రెండ్ అవుతోంది?

  12. రిషి సునక్‌కు నరేంద్రమోదీ కంగ్రాట్స్ చెప్పారు. కానీ, షీ జిన్‌పింగ్‌‌కు ఎందుకు చెప్పలేదు?

  13. 72 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం: ‘మా ఇంట్లో ఒకపూట కూరగాయల ఖర్చు రూ.1200, నాన్ వెజ్ ఖర్చు రూ.5 వేలు.. సిలిండర్ 4 రోజుల్లో అయిపోతుంది’

  14. నోట్లపై లక్ష్మీ, గణేశ్ చిత్రాలను ముద్రించాలంటూ ప్రధాని మోదీకి అరవింద్ కేజ్రీవాల్ లేఖ

    భారత కరెన్సీ నోట్లపై హిందువుల దేవుళ్లు అయిన గణేశ్-లక్ష్మీ చిత్రాలను ముద్రించాలని కోరుతూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

    శుక్రవారం ట్విటర్‌లో ఆ లేఖను కేజ్రీవాల్ షేర్ చేశారు.

    ‘‘దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు భారతీయ కరెన్సీలో ఒక వైపు గాంధీజీ, మరొక వైపు దేవతామూర్తులైన గణేష్‌, లక్ష్మీదేవీల చిత్రాలు ఉండాలని కోరుకుంటున్నారు.నేడు దేశ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణమైన స్థితిలో ఉంది.

    స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణిస్తున్నారు. నేటికీ మన దేశంలో పేదవారి సంఖ్య ఇంత ఎక్కువగా ఎందుకు ఉంది?’’ అని ఆ లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.

    దేశ ప్రజలంతా కష్టపడి పనిచేయడంతో పాటు మన ప్రయత్నాలు సఫలం కావాలంటే భగవంతుని ఆశీస్సులు కూడా ఉండాలని ఆయన లేఖలో రాశారు.

    అరవింద్ కేజ్రీవాల్ రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు.

    ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేసియా నోట్లపై గణేశ్ చిత్రం ఉన్నప్పుడు... భారత్ అలా ఎందుకు చేయకూడదని ఆయన ప్రశ్నించారు.

  15. రామసేతు రాముడి కాలంలో జరిగిన నిర్మాణమా, ప్రకృతి సిద్ధమా?

  16. PAK VS ZIM: ‘మా వద్ద నిజమైన మిస్టర్ బీన్ లేకపోవచ్చు, కానీ మా క్రీడాస్ఫూర్తి నిజమైనది’ అని పాక్ ప్రధాని ఎందుకు అన్నారు?

    ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.

    ఈ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో ఒక్కసారిగా ‘మిస్టర్ బీన్’ పేరు ట్రెండ్ అయింది.

    సోషల్ మీడియాను వాడే సామాన్య పౌరులే కాకుండా దేశాధ్యక్షులు కూడా మిస్టర్ బీన్‌పై చర్చలో భాగమయ్యారు.

    పాకిస్తాన్‌ను ఓడించిన తమ జట్టును జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డెంబుజో అభినందించారు. వచ్చేసారి తమ దేశానికి నిజమైన మిస్టర్ బీన్‌ను పంపించాలని పాక్‌ను కోరుతూ ట్వీట్ చేశారు.

    ఈ ట్వీట్‌కు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ స్పందించారు. ‘‘ మా వద్ద నిజమైన మిస్టర్ బీన్ లేకపోవచ్చు. కానీ, మా క్రీడాస్ఫూర్తి నిజమైనది. మా పాకిస్తానీలకు తిరిగి నిలదొక్కుకునే ఆసక్తికరమైన అలవాటు ఒకటి ఉంది. మిస్టర్ ప్రెసిడెంట్ కంగ్రాచ్యులేషన్స్. ఈరోజు మీ జట్టు బాగా ఆడింది’’ అని ఎమర్సన్ ట్వీట్‌కు షరీఫ్ బదులు ఇచ్చారు.

    పాక్ ఓటమి తర్వాత మిస్టర్ బీన్ పేరు ట్రెండ్ అవ్వడానికి కారణం ఒక పాత వివాదం.

    పాకిస్తాన్‌కు చెందిన ఒక కళాకారుడు ఆసిఫ్ మహమ్మద్ ‘మిస్టర్ బీన్’ రూపంలో నటిస్తూ ఒకసారి జింబాబ్వేకు వెళ్లారు.

    సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ప్రకారం, జింబాబ్వేకు ‘మిస్టర్ బీన్’ వేషంలో వెళ్లిన ఆసిఫ్ తానే నిజమైన మిస్టర్ బీన్ అంటూ అందరితో పరిచయం చేసుకున్నారు.

    తర్వాత ఆయన నిజమైన మిస్టర్ బీన్ కాదని తెలియడంతో అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

    మ్యాచ్‌కు ముందు చసురా అనే ఒక జింబాబ్వే అభిమాని ట్వీట్ చేస్తూ..‘‘ జింబాబ్వే మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. మీరొకసారి రోవన్ అట్కిన్సన్‌కు బదులుగా ఫేక్ పాకిస్తానీ మిస్టర్ బీన్‌ను మా వద్దకు పంపించారు. మ్యాచ్‌లో దీనిపై పగ తీర్చుకుంటాం. వర్షం కురవాలని మీరు ప్రార్థనలు చేసుకోండి’’ అని అన్నారు.

  17. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, ధన్నీపూర్‌లో మసీదు నిర్మాణం ఎంతవరకు వచ్చాయంటే... గ్రౌండ్ రిపోర్ట్

  18. భార్య పైనుంచి కారును నడిపారనే ఆరోపణలతో సినీ నిర్మాత అరెస్టు

    కారుతో భార్యను తొక్కించారనే ఆరోపణలతో సినీ నిర్మాత కమల్ కిశోర్ మిశ్రాను మహారాష్ట్ర ఆంబోలీ పోలీసులు అరెస్ట్ చేశారు.

    గురువారం కమల్ కిశోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసులో విచారణను ప్రారంభించారు.

    సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కమల్ కిశోర్ మిశ్రా తన భార్యపై నుంచి కారును నడుపుతున్నట్లుగా కనిపిస్తోంది.

    ఈ దాడిలో తన తలకు గాయాలయ్యాయని మిశ్రా భార్య చెప్పారు.

    మిశ్రాపై సెక్షన్ 279, 338కింద కేసులు నమోదయ్యాయి.

    అయితే, ఇప్పటివరకు దీనిపై కమల్ కిశోర్ మిశ్రా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

    మిశ్రా ఐఎండీజీ పేజీ ప్రకారం, అతను ఇప్పటివరకు 5 సినిమాలను నిర్మించారు. శర్మాజీ కి లగ్ గయీ, హూతియాపా, ఫ్లాట్ నంబర్ 420, దెహాతీ డిస్కో, ఖలీ-బలీ సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు.

  19. పుతిన్: ‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బహుశా ఇదే అత్యంత ప్రమాదకరమైన దశాబ్ధం’

    రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బహుశా ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన దశాబ్ధం ఇదేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ గురువారం అన్నారు.

    తన ప్రసంగంలో యుక్రెయిన్‌పై రష్యా దాడిని సమర్థించే ప్రయత్నం చేశారు.

    రష్యాను ఒంటరి చేసేందుకు పాశ్చాత్య దేశాలు అణ్వాయుధాల పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని పుతిన్ ఆరోపించారు.

    ‘‘అణ్వాయుధాలను ఉపయోగించడం గురించి మేం ఎప్పుడూ చెప్పలేదు. ఈ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదు. మేం కేవలం పశ్చిమ దేశాల నేతలు చేసిన ప్రకటనలకు సమాధానాలు మాత్రమే ఇచ్చాం’’ అని ఆయన అన్నారు.

    అదే సమయంలో యుక్రెయిన్ ‘డర్టీ బాంబులను ఉపయోగించవచ్చని రష్యా చేసిన వాదనలు నిరాధారమైనవని యూరోపియన్ దేశాల సైనిక కూటమి అయిన ‘నాటో’ వ్యాఖ్యానించింది.

    మామూలు పేలుడు పదార్థాలతో పాటు అణుధార్మిక పదార్థాలు కూడా కలిపి ఉండే బాంబును డర్టీగా బాంబుగా వ్యవహరిస్తున్నారు.

  20. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.