స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్, బూడిద భిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్‌లో చేరిక
కేటీఆర్ సమక్షంలో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమ నాయకులు మళ్లీ సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు.
లైవ్ కవరేజీ
తిరుమల: రక్తదానంతో ప్రత్యేక ఉచిత దర్శనం, 1985 నుంచి ఉన్న ఈ పథకం గురించి మీకు తెలుసా?
మహిళలపై ఆర్ఎస్ఎస్ వైఖరి మారుతోందా... బీజేపీకి ఓట్ల కోసమే అలా చేస్తున్నారా?
రాహుల్ యాత్రతోనే మోదీ జాబ్ మేళాకు తెరలేపారు: కాంగ్రెస్

ఫొటో సోర్స్, ANICopyright
ఫొటో క్యాప్షన్, రణదీప్ సుర్జేవాలా, రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో ) కేంద్రప్రభుత్వ‘రోజ్‌గార్ మేళా’ను ‘జుమ్లాకింగ్’(మాటకారి) చేస్తున్న ఈవెంట్‌బాజీ(షో)గా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది.
దేశంలోని యువతకు హామీ ఇచ్చిన 16 కోట్ల ఉద్యోగాల హామీ ఎప్పుడు నెరవేరుస్తారని కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, గత ఎనిమిదేళ్లుగా అది నెరవేర్చలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు.
‘‘ఈ ప్రకటన రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రకు తొలి భారీ విజయం. 70వేల ఉద్యోగాలు ఒంటె నోట్లో జీలకర్రలాంటిది.కానీ, ఏమైతేనేం, దిల్లీ రాజు మొత్తానికి మేలుకొన్నారు. నిరుద్యోగ సమస్యను గుర్తించారు. 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. అంటే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు. ఇప్పుడు 70 వేల ఉద్యోగాలు ప్రకటించారు’’ అని ఆయన తన ట్వీట్ లో వ్యాఖ్యానించారు.
‘‘మొత్తానికి రాహుల్ గాంధీ యాత్ర ఈ జుమ్లాకింగ్ మీద ఒత్తిడి పెంచింది. మరి ఇప్పుడు చెప్పండి, 8 సంవత్సరాలలో ఇవ్వాల్సిన 16 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి’’ అని రణదీప్ సూర్జేవాలా అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పవన్ కల్యాణ్ జనసేన దారేది?
తిరుపతి: కులాంతర వివాహం చేసుకున్న యువతికి దళితవాడ పెద్దల జరిమానా.. ‘కుల కట్నం చెల్లించనందుకు దాడి’
అమరావతి రైతుల పాదయాత్ర నిలుపుదల, కోర్టు తీర్పులో స్పష్టత కోసమేనంటున్న జేఏసీ, శంకర్.వి, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, bbc
అమరావతి నుంచి అరసవల్లి వరకూ చేపట్టిన మహాపాదయాత్రను తాత్కాలికంగా ఆపుతున్నట్లు అమరావతి రైతు జేఏసీ నేతలు ప్రకటించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం వరకూ ఈ యాత్ర చేరుకుంది.
శుక్రవారం ఆ పట్టణంలో ప్రవేశిస్తుండగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
కోర్టు తీర్పునకు అనుగుణంగా కేవలం 600 మందిని, నాలుగు వాహనాలను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు పట్టుబట్టారు.
గుర్తింపు కార్డులు చూపించిన వారిని మాత్రమే యాత్రకు అంగీకరిస్తామని పోలీసులు అడ్డుచెప్పారు.
దాంతో పాదయాత్రలో ఉన్న వారు దానిని వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగడం, తోపులాటకు దారితీసింది.
ఆ క్రమంలో ఓ మహిళా రైతు కిందపడి గాయాలు పాలయ్యారు. శనివారం ఉదయం కూడా పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నద్ధమవుతుండగా పోలీసులు మరోసారి జోక్యం చేసుకున్నారు.
యాత్రను ముందుకు సాగించేందుకు అనుమతించాలంటే కోర్టు ఆదేశాలను పాటించాలంటూ ఆదేశించారు.
దాంతో పాదయాత్ర విషయంలో జేఏసీ నేతలు తాత్కాలిక విరమణ నిర్ణయం తీసుకున్నారు.
దీపావళి సెలవుల కారణంగా కోర్టు నాలుగు తర్వాత తీర్పు విషయంలో స్పష్టతనిస్తుందని ఆశిస్తున్నామంటూ జేఏసీ నేతలు తెలిపారు.
శుక్రవారం ఏపీ హైకోర్టు పాదయాత్రకు పోటీగా నిరసనలకు అనుమతివ్వకూడదని ఆదేశాలు ఇచ్చింది.
అదే సమయంలో పాదయాత్రను అడ్డుకుంటామని ప్రకటనలు చేసిన అధికార పార్టీకి చెందిన నర్సీపట్నం ఎమ్మెల్యే కి కూడా నోటీసులు జారీ చేసింది.
పాదయాత్రలో నిబంధనలు పాటిస్తూ 600 మంది వరకూ అడ్డంకులు లేకుండా పాల్గొనేందుకు పోలీసులు సహకరించాలని తెలిపింది.
గుర్తింపు కార్డులు ఉంటేనే పాదయాత్రకు అనుమతిస్తామని పోలీసులు చెప్పడంపై జేఏసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపై కోర్టులోనే తేల్చుకొని పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని తెలిపింది.
4 రోజుల తాత్కాలిక విరామం తీసుకున్నట్టు ప్రకటించింది.
టీ20 ప్రపంచకప్: మెల్‌బోర్న్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం జరుగుతుందా? జరగదా?
బ్రిటన్: ‘ధరలు పెరిగిపోయాయి, కడుపునిండా తినే స్థోమత లేదు.. నూడుల్స్ తిని బతకాల్సి వస్తోంది’
మునుగోడు: ‘ఉప ఎన్నికకు రూ.900 కోట్లు ఖర్చంట.. ఆ డబ్బుతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చు’
బ్రిటన్ ప్రధాని: ‘రిషి సునాక్ సరైన వ్యక్తి, కానీ పార్టీలోని రాజకీయాలను ఎదుర్కోగలరా?’ - బ్రిటన్‌లోని భారతీయుల మనోగతం
బీబీసీ తెలుగు న్యూస్ లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అప్డేట్ల కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.
ఇస్రో-శ్రీహరికోట: అక్టోబర్ 23న ఒకేసారి 36 ఉపగ్రహాల ప్రయోగం
ఒక్కసారిగా గుండెపోటు, కుప్పకూలి ప్రాణాలు వదిలేస్తున్నారు.. ఇంత సడెన్‌గా చనిపోవడానికి కారణాలేంటి?
నేటి లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం
తాజా వార్తలతో రేపు ఉదయం కలుద్దాం.
అంతవరకు సెలవు.
ఆంధ్రప్రదేశ్: రాజకీయాలను ఇంకెంత దిగజారుస్తారు? -వీక్లీ షో విత్ జీఎస్
ఓరి దేవుడా: ఒకే సినిమాలో రెండు ప్రేమకథలు, మధ్యలో దేవుడి ఎంట్రీ అదే ట్విస్ట్
'ఓరి దేవుడా' మూవీ రివ్యూ: బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది?
స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్, బూడిద భిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్‌లో చేరిక

ఫొటో సోర్స్, TWITTER/TRSPARTY
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీజేపీ నాయకుడు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ కూడా టీఆర్ఎస్‌లో చేరారు.
కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
తెలంగాణ ఉద్యమ నాయకులు మళ్లీ సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు.
మైనారిటీలపై ద్వేషపూరిత ప్రసంగాలపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. 'ఆలస్యం చేయకుండా దోషులను శిక్షించాలి'
దేశంలో ఇటీవల మతపరమైన సమావేశాల సందర్భంగా మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా కొందరు ద్వేషపూరిత ప్రసంగాలు చేయడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మనం ఎక్కడికి చేరుకున్నాం, మతాన్ని ఏ స్థాయికి తగ్గించేశాం? అంటూ ప్రశ్నించింది.
"మనం ఎక్కడికి చేరుకున్నాం, మతాన్ని ఏ స్థాయికి తగ్గించేశాం? దేవుడిని ఏ స్థాయికి దిగజార్చేశాం? ఇది విషాదం" అని జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలో జస్టిస్ హృషికేష్ రాయ్‌తో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది.
"మతపరంగా తటస్థంగా ఉండాల్సిన దేశంలో ఇలాంటి ప్రసంగాలు దిగ్భ్రాంతిని కలగజేస్తున్నాయటూ" ఆందోళన వ్యక్తం చేసింది.
ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా చేస్తున్న ద్వేషపూరిత ప్రసంగాలను ఆపడానికి తక్షణ దిశానిర్దేశం, జోక్యం, ఆదేశాలు అవసరం అంటూ జర్నలిస్ట్ షాహీన్ అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.
"ప్రజాస్వామ్యం, లౌకికవాదం పాటిస్తున్న దేశంలో ఒక వర్గానికి వ్యతిరేకంగా విషం చిమ్మడం విచారకరం" అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ద్వేషపూరిత ప్రసంగాల కేసులు వెలుగులోకి వచ్చిన తరువాత, దోషులు ఏ మతం వారైనా సరే, కేసులను సుమోటోగా తీసుకుని వెంటనే విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ మేరకు దిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
ఇటువంటి కేసులను "చాలా తీవ్రమైనవి"గా పేర్కొంటూ, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు
