స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్, బూడిద భిక్షమయ్య గౌడ్‌ టీఆర్ఎస్‌లో చేరిక

కేటీఆర్ సమక్షంలో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమ నాయకులు మళ్లీ సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. INDvsSA: 5 వికెట్ల తేడాతో ఇండియాపై గెలిచిన దక్షిణాఫ్రికా

  2. ‘ఆ రోజు అమ్మ చెప్పిన మాటలే ఇప్పటికీ నన్ను ముందుకు నడిపిస్తున్నాయి’’

  3. బ్రేకింగ్ న్యూస్, INDSvsSA: 24 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

    భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 24 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.

    అర్షదీప్ 2 వికెట్లు తీశాడు.

    క్వింటన్ డీకాక్(1), బవుమా(10), రిలీ(0) అవుటయ్యారు.

  4. బ్రేకింగ్ న్యూస్, INDSvsSA: సూర్యకుమార్ అవుట్... 8 వికెట్లు కోల్పోయిన భారత్

    సూర్య కుమార్ యాదవ్ 40 బంతుల్లో 68 పరుగులు చేసి అవుటయ్యాడు.

    రవిచంద్రన్ అశ్విన్ 7 పరుగులకే వెనుతిరిగాడు.

    ఇప్పటి వరకు 127 పరుగులకు భారత్ 8 వికెట్లు కోల్పోయింది.

  5. బ్రేకింగ్ న్యూస్, INDSvsSA: ఆరో వికెట్ కోల్పోయిన భారత్

    దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీంఇండియా 115 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.

    ఇప్పటి వరకు 17 ఓవర్లు జరిగాయి.

    తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.

    అయితే దక్షిణాఫ్రికా బౌలర్ లుంగి ఎంగిడి భారత్ టాప్ ఆర్డర్‌నున కూల్చాడు.

    ఓపెనర్లు కేఎల్ రాహుల్(9), రోహిత్ శర్మ(15), విరాట్ కోహ్లీ(12) పరుగులకే పెవిలియన్ చేరారు.

    హార్దిక్ పాండ్య, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్ సైతం తక్కువ పరుగులకే అవుటయ్యారు. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే పోరాడుతున్నాడు.

  6. INDvsSA: దక్షిణాఫ్రికాపై భారత్ గెలవాలంటూ పాక్ అభిమానులు కోరుకుంటున్నారా

  7. కేసీఆర్: ‘వంద కోట్లను మన ఎమ్మెల్యేలు గడ్డిపోచలా విసిరేశారు’

    కేసీఆర్

    దిల్లీ నుంచి వచ్చిన కొందరు వంద కోట్ల ఆశ చూపినప్పటికీ తెలంగాణ ఎమ్మెల్యేలు వాటిని గడ్డిపోచలా విసిరేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

    వారికి లొంగకుండా ఎమ్మెల్యేలు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలిపారని ప్రశంసించారు.

    మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

    ‘తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు’ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

    ఆయనతో పాటు ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ వ్యవహారంతో వార్తల్లో నిలిచిన ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు సభా స్థలానికి వచ్చారు.

    ఈ సభకు భారీ ఎత్తున గులాబీ శ్రేణులు తరలి వచ్చాయి.

    ఈ సభలో మాట్లాడుతూ కేసీఆర్ ఏమన్నారంటే...

    ‘‘ఉప ఎన్నిక ఫలితం ఎప్పుడో తేలిపోయింది. నాతో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు వచ్చారు. వందకోట్లను గడ్డిపోచలా విసిరేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని వారు కాపాడారు. ఇలాంటి ఎమ్మెల్యేలే మనకు కావాలి. రాజకీయమంటే అమ్ముడుపోవడం కాదని వారు నిరూపించారు.

    కొంతమంది దిల్లీ బ్రోకర్లు తెలంగాణను కొనాలని వచ్చారు. కానీ, తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదు.

    తెలంగాణను కొనడానికి వందల కోట్ల రూపాయలు వారికి ఎక్కడి నుంచి వచ్చాయి?

    ప్రధాని మోదీ ఎందుకీ అరాచకాలు? ఇంకా మీకు ఏం కావాలి? దేశంలో ప్రధానమంత్రి కంటే పెద్ద పదవేం లేదు కదా...

    ప్రజలారా మీరంతా ఓటు వేసే ముందు ఆలోచించండి.

    రైతులపై కేంద్రం పెద్ద కుట్ర చేస్తోంది. రైతులను వ్యవసాయం నుంచి తప్పించాలని కుట్ర పన్నుతోంది.

    బీజేపీకి ఓటు వేస్తే వారి విద్యుత్ చట్టాలను మనం ఒప్పుకున్నట్లే అవుతుంది.

    దేశంలో అరాచక పాలన అంతానికే బీఆర్‌ఎస్ పుట్టింది.

    మీరంతా ప్రలోభాలకు లొంగకుండా ఆలోచించి, విశ్లేషించి ఓటు వేయండి’’ అని అన్నారు.

  8. క్యూబా జనాభా 25 ఏళ్లుగా ఎందుకు పెరగడం లేదు... కారణాలేంటి, పరిణామాలు ఎలా ఉంటాయి

  9. Samantha: ‘నేను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నా’

  10. పూనమ్ కౌర్: ‘నేను కిందపడబోతుంటే రాహుల్ గాంధీయే నా చేయి పట్టుకున్నారు’

  11. తిరుమలలో నవంబర్ 1 నుంచి టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్ల జారీ మళ్లీ ప్రారంభం, ఇది భక్తులకు ఎంత ఉపయోగం

  12. రాహుల్ గాంధీ పాదయాత్రలో పిల్లలతో పరుగు పందెం...

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, UGC

    భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఆదివారం ఉదయం కొందరు పిల్లల బృందంతో పరుగు పందెం చేశారు.

    పిల్లలతో కలిసి రాహుల్ పరుగు తీయటం, వారి వెనుకే కాంగ్రెస్ నాయకులు కూడా పరుగు పెట్టటం దృశ్యాల వీడియోలను కాంగ్రెస్ పార్టీ, నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

    గొల్లపల్లి వద్ద యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ.. తన వద్దకు వచ్చిన పిల్లలతో మాట్లాడారు. అంతలోనే ‘రేస్ లగావోగే’ అని వారితో మాట్లాడుతూ పరుగు అందుకోవటం ఆ వీడియోలో కనిపిస్తోంది.

    ప్రస్తుతం 52 ఏళ్ల వయసున్న రాహుల్‌తో పాటు ఆ పిల్లలు కూడా పరుగు అందుకున్నారు. వారితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా పరుగుతీశారు.

    రాహుల్ పరుగు పందెం వీడియో సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. జగన్‌పై దాడి కేసు విచారణ ఏమైంది.. ఆ రోజు వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరిగింది

  14. దక్షిణాఫ్రికాలో కొత్త జులు చక్రవర్తికి పట్టాభిషేకం, నోమ్సా మసేకో, నొబుహ్లే సిమిలేన్ – బీబీసీ న్యూస్, డర్బన్

    కింగ్ మిసుజులు కా జ్వెలితిని
    ఫొటో క్యాప్షన్, కింగ్ మిసుజులు కా జ్వెలితిని సంప్రదాయ వస్త్రధారణ అయిన చిరుత పులి చర్మం ధరించి ఈ పట్టాభిషేకంలో పాల్గొన్నారు
    దక్షిణాఫ్రికాలో కొత్త జులు చక్రవర్తికి పట్టాభిషేకం
    ఫొటో క్యాప్షన్, వేలాది మంది జులు ప్రజలు సంప్రదాయ దుస్తులు చిరుతపులి చర్మం ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

    దక్షిణాఫ్రికాలో కొత్త జులు రాజుకు పట్టాభిషేకం జరిగింది. తీర ప్రాంతమైన డర్బన్ నగరంలో జరిగిన ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు.

    డర్బన్ నగరంలో జరిగిన ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో కింగ్ మిసుజులు కా జ్వెలితినిని లాంఛనంగా చక్రవర్తిగా గుర్తిస్తూ దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోసా ధృవపత్రం అందించారు.

    దక్షిణాఫ్రికా 1994లో స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత తొలి జులు పట్టాభిషేక కార్యక్రమం ఇది.

    జులు గత రాజు కింగ్ గుడ్‌విల్ జ్వెలితిని గత ఏడాది చనిపోయారు. ఆయన వారసుడి ఎంపిక కోసం అప్పటి నుంచీ తీవ్ర సంఘర్షణ సాగింది.

    కింగ్ గుడ్‌విల్ జ్వెలితిని అత్యంత సుదీర్ఘకాలం పాటు జులు చక్రవర్తిగా ఉన్నారు. యాభై ఏళ్లకు పైగా సింహాసనంలో కొనసాగిన ఆయనకు ఆరుగురు భార్యలు, 26 మంది సంతానం ఉన్నారు.

    ఆయన మరణానంతరం ఆయన భార్యను (కింగ్ మిసుజులు తల్లిని) రాణిగా ప్రకటించారు. అయితే ఆమె కూడా నెల రోజుల్లోనే హఠాత్తుగా చనిపోయారు. దీంతో సింహాసనం కోసం పోరాటం ముదిరింది.

    దక్షిణాఫ్రికాలో కొత్త జులు చక్రవర్తికి పట్టాభిషేకం

    ఫొటో సోర్స్, Getty Images

    ఎట్టకేలకు కింగ్ మిసుజులు చక్రవర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సామ్రాజ్యాన్ని, ప్రజలను కింగ్ మిసుజులు సమైక్యం చేస్తారని తాను నమ్ముతున్నట్లు ఆయన సోదరుడు యువరాజు బాంబినడ్లోవు జులు బీబీసీతో పేర్కొన్నారు.

    ‘‘జులులు తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్న ఈ సమయంలో చరిత్ర నన్ను ఎంచుకుందని నేను భావిస్తున్నా. పేదరికం, నిరుద్యోగం, ప్రభుత్వం మీద, సంప్రదాయ నాయకత్వం మీద విశ్వాస లోపం, వాతావరణ మార్పు, ఆహార అభద్రత అనేవి ఆ సవాళ్లు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావటానికి నేను వారధిగా పనిచేస్తానని ఆశిస్తున్నా’’ అని కింగ్ మిసుజులు తన తొలి ప్రసంగంలో చెప్పారు.

    అమాజులు జాతిని కలిపి ఉంచే ఆధారం కింగ్ మిసుజులు అని అధ్యక్షుడు రామఫోసా అభివర్ణించారు.

    జులు సంస్కృతికి ప్రత్యేకమైన చిరుతపులి చర్మాన్ని శరీరంపై ధరించి కింగ్ మిసుజులు పట్టాభిషిక్తులయ్యారు.

  15. మునుగోడు: ‘ఖాతాల్లో డబ్బుల’ మీద కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

  16. దక్షిణ కొరియా: హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట, భారీగా ప్రాణనష్టం ఉండొచ్చని ఆందోళన

  17. కూతురిని ఇవ్వరు, ఇచ్చినా దేశం దాటనివ్వరు...మూడేళ్లుగా సౌదీ హోటల్ గదిలోనే బందీ అయిన అమెరికన్ మహిళ

  18. సమంత: ‘నేను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నా’

  19. మహిళను ‘ఐటెం’ అని పిలవడం నేరమేనా, కోర్టులు ఏం చెప్పాయి, నటి ఖుష్బూ వివాదమేంటి ?

  20. రామసేతు: ఇది రాముడి కాలంలో జరిగిన నిర్మాణమేనా, కాదా?