అమూల్ పాల ధరలు దేశవ్యాప్తంగా పెంపు... గుజరాత్‌లో తప్ప

ఫుల్ క్రీం, గేదె పాల ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచుతున్న అమూల్ ప్రకటించింది. అంటే ఎంఆర్‌పీ మీద 4శాతం పెంచినట్లుగా తెలిపింది. పాల ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్లే ధరలు పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.

లైవ్ కవరేజీ

  1. పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో అక్టోబర్ 14వ తేదీన ముల్తాన్‌లోని నిష్టర్ హాస్పిటల్ మార్చురీ పైకప్పుపై సుమారు 200 గుర్తుతెలియని, కుళ్ళిపోయిన మృతదేహాలు బయటపడ్డాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్ జియో న్యూస్ తెలిపింది.

  2. ఎలుకలు, ఎముకలు, బంకమట్టి, నాగజెముడు పండ్లు...ఆకలికి తట్టుకోలేక వీళ్లు ఇవే తింటున్నారు

  3. విశాఖ గర్జన.. వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర

    విశాఖ గర్జన
    ఫొటో క్యాప్షన్, విశాఖ గర్జన

    వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నేడు విశాఖ గర్జన జరుగుతోంది. ఎల్ఐసీ బిల్డింగ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్‌లోని పార్క్ హోటల్ వరకు నాలుగు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు.

    ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్న వైసీపీ పార్టీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

    విజయనగరం శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు విశాఖకు చేరుకున్నారు.

    ఉదయం 10.39 గంటల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పాల్గొన్నవారంతా మూడు రాజధానుల నినాదంతో ఫ్లకార్డులు ప్రదర్శించారు.

    ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటూ నినాదాలు చేశారు.

    విశాఖ గర్జన
    ఫొటో క్యాప్షన్, విశాఖ గర్జన

    ర్యాలీలో జేఏసీ నేతలతో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, విడదల రజిని, వైవీ సుబ్బారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

    "ఉత్తరాంద్ర ప్రజల రాజధాని ఆకాంక్షను గట్టిగా తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ ర్యాలీకి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఈ అవకాశాన్ని వదులుకునేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా లేరు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా విశాఖ పరిపాలన రాజధాని అవడం ఖాయం" అని మంత్రి అమర్నాథ్ బీబీసీతో అన్నారు.

    విశాఖ గర్జన
    ఫొటో క్యాప్షన్, విశాఖ గర్జన

    బీచ్ రోడ్‌లోని పార్క్ హోటల్ వద్ద ర్యాలీ ముగిసిన అనంతరం బహిరంగ సభను నిర్వహించనున్నారు.

    విశాఖ గర్జనలో ఎక్కడ చూసినా కళాశాల విద్యార్థులే ఎక్కువగా కనిపించారు. ఉత్తరాంధ్రకు చెందిన అనేక కళారూపాలను ఈ గర్జన కార్యక్రమంలో ప్రదర్శించారు.

  4. తుర్కియే బొగ్గు గనిలో పేలుడు.. 28 మంది మృతి

    తుర్కియే బొగ్గు గనిలో పేలుడు

    ఫొటో సోర్స్, Getty Images

    ఉత్తర తుర్కియేలోని బార్టిన్‌లో బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. కనీసం 28 మంది మరణించారు. అనేకమంది భూగర్భంలో చిక్కుకున్నారు.

    శుక్రవారం పేలుడు జరిగినప్పుడు సుమారు 110 మంది కార్మికులు గని లోపల ఉన్నారు. వారిలో దాదాపు సగం మంది 300 మీటర్లలో లోతులో ఉన్నారు.

    మొత్తం 11 మందిని రక్షించారని, వారికి చికిత్స అందిస్తున్నామని తుర్కియే ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా తెలిపారు.

    రాత్రంతా అత్యవసర సిబ్బంది రాళ్లను తవ్వుతూ భూగర్భంలో ఉన్నవారిని చేరేందుకు ప్రయత్నించారు. గల్లంతైనవారి కుటుంబాలు సమాచారం కోసం ఆతృరగా ఎదురుచూస్తున్నాయి.

    భూగర్భంలో 300 మీటర్ల లోతులో పేలుడు సంభవించినట్టు భావిస్తున్నారు. ఆ సమయంలో సుమారు 49 మంది కార్మికులు ప్రమాదకరమైన జోన్‌లో, 300 నుంచి 350 మీటర్ల లోతులో పనిచేస్తున్నారని తుర్కియే అంతర్గత మంత్రి సులేమాన్ సోయ్లు చెప్పారు.

    "అక్కడి నుంచి కొంతమందిని తరలించలేకపోయామని" ఆయన చెప్పారు.

    పేలుడుకు కారణం ఇంకా తెలియలేదు. దర్యాప్తు జరుగుతోంది. ఫైర్‌డాంప్ వల్ల పేలుడు సంభవించినట్లు ప్రాథమిక సూచనలు కనిపిస్తున్నాయని తుర్కియే ఇంధన మంత్రి తెలిపారు. బొగ్గు గనుల్లో మీథేన్ కారణంగా పేలుడుకు కారణమయ్యే మిశ్రమాల పొరలు ఏర్పడతాయి. దీన్నే ఫైర్‌డాంప్ అంటారు.

    "ఇది చాలా విచారకమైన ఘటన" అని సులేమాన్ సోయ్లు అన్నారు. గనిలో మంటలు ఆరిపోయాయని, వెంటిలేషన్ బాగానే పనిచేస్తోందని ఆయన చెప్పారు.

    తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్ శనివారం ఘటనాస్థలాన్ని సందర్శించే అవకాశం ఉంది.

    ప్రమాదం నుంచి బయటపడినవారికి తీవ్ర గాయాలయ్యాయని అమాస్రా మేయర్ రెకాయ్ కాకిర్ చెప్పారు.

    ఈ గని ప్రభుత్వ యాజమాన్యంలోని టర్కిష్ హార్డ్ కోల్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందినది.

    2014లో కూడా తుర్కియేలోని సోమాలో బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 301 మంది ప్రాణాలు కోల్పోయారు.

  5. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్!

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలు, విశేషాల కోసం ఈ పేజీని ఫాలో అవుతూ ఉండండి.