టీ20 ప్రపంచకప్: భారత జట్టులో చేరేందుకు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియా ప్రయాణం

ఫొటో సోర్స్, Getty Images
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టులో చేరేందుకు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ గురువారం ఆస్ట్రేలియా వెళ్లనున్నారు.
గాయాలతో ఈ టోర్నమెంటుకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో వీరిలో ఎవరిని తీసుకోవాలన్నది బీసీసీఐ ఇంకా నిర్ణయించలేదు. ఆసక్తికరంగా, రిజర్వ్ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, రవి విష్ణోయ్, దీపక్ చాహర్ ప్రస్తుతం ఆస్ట్రేలియాకు వెళ్లడం లేదు. చాహర్ వెన్ను గాయంతో అందుబాటులో లేడని చెబుతున్నారు.
భారత జట్టు అక్టోబర్ 6న భారత్ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరింది. ప్రస్తుతం పెర్త్‌లో టీమిండియా టోర్నమెంటుకు సిద్ధమవుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడుతోంది.
బూమ్రా దక్షిణాఫ్రికాతో జరిగిన ట్20 సిరీస్‌లో గాయపడ్డాడు. దాంతో, ఈ వరల్ద్ కప్‌కు దూరమవుతున్నాడు.
షమీ ఫిట్‌నెస్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తరుగ్వాతే బుమ్రా స్థానంలో అతడిని తీసుకోవడంపై భారత జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.
షమీ 2021 నవంబర్ నుంచి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు. అయితే, కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నాడు.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్


