ఆదిపురుష్ సినిమా విడుదలను ఆపాలంటూ దిల్లీ కోర్టులో పిటిషన్

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ దిల్లీలోని తిస్ హజారి కోర్టులో పిటీషన్ వేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా అందులోని పాత్రలను చిత్రీకరించారంటూ పిటీషనర్ పేర్కొన్నారు.

లైవ్ కవరేజీ

  1. ములాయం సింగ్ యాదవ్ అస్తమయం

    ములాయం సింగ్ యాదవ్

    ఫొటో సోర్స్, @sansad_tv

    సమాజ్‌వాది పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి చెందారు.

    ఆయన వయసు 82 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ములాయంను అక్టోబర్ 2వ తేదీన గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించారు.

    అక్కడ చికిత్స పొందుతున్న ములాయం సోమవారం ఉదయం 8:16 గంటలకు తుది శ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

    ఈ విషయాన్ని ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ ధృవీకరించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ములాయం సింగ్ యాదవ్ గత కొన్ని రోజులుగా మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని మొయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు.

    ఈ ఏడాది జులైలో ములాయం భార్య సాధనా గుప్తా మరణించారు.

    నరేంద్ర మోదీ, ములాయం

    ఫొటో సోర్స్, @narendramodi

    ప్రజాస్వామ్యం కోసం పోరాడిన సైనికుడు: ప్రధాని మోదీ సంతాపం

    ములాయం సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో ఆయన విశిష్టమైన నేత అని మోదీ కొనియాడారు.

    ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన కీలకమైన సైనికుడని, రక్షణ మంత్రిగా బలమైన భారతదేశం కోసం కృషి చేశారని ములాయంను కీర్తించారు. ఆయన మృతి తనకు బాధ కలిగిస్తోందని చెప్పారు.

    ములాయంకు, తనకు మధ్య తాము ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటి నుంచీ ఉన్న సంబంధాలను మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేశారు.

    ములాయం మృతికి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు సంతాపం తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3