గద్దర్: మునుగోడు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ
విప్లవ గాయకుడు గద్దర్ మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తెలిపారు.
పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల అభ్యర్థన మేరకు మునుగోడులో పోటీ చేసేందుకు గద్దర్ ఒప్పుకున్నారని పాల్ వెల్లడించారు.
ఒకప్పుడు నక్సలైటుగా ఉన్న గద్దర్, ఆ తరువాత ఉద్యమం నుంచి బయటకు వచ్చారు. విప్లవ గీతాలతో ఆయన ‘ప్రజా గాయకుని’గా గుర్తింపు తెచ్చుకున్నారు.
2018లో కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యారు గద్దర్. తన కుమారునికి సీటు కోసం సోనియా గాంధీని కలిశారు.