You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

INd vs SA: రాహుల్, సూర్యకుమార్ అర్ధసెంచరీలు.. తొలి టీ20లో దక్షిణాఫ్రికాపై 8 వికెట్లతో భారత్ గెలుపు

107 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 110 పరుగులు చేసింది. అంతకుముందు దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది.

లైవ్ కవరేజీ

  1. ఎస్‌సీఓ సదస్సు తరువాత తొలిసారి బయట కనిపించిన షీ జిన్‌పింగ్

    చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమర్కండ్ ఎస్‌సీఓ సదస్సు తరువాత తొలిసారి బహిరంగంగా కనిపించారు.

    చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చూడటానికి ఆయన వచ్చారు.

    చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందని, షీ జిన్‌పింగ్‌ను హౌస్ అరెస్టు చేశారనే ఊహాగానాలు ఇటీవల వినిపించాయి.

    వచ్చే నెల 16న చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ సమావేశం జరుగనుంది. మూడోసారీ కూడా షీ జిన్‌పింగ్‌ను చైనా అధ్యక్షునిగా ఎన్నుకుంటారని భావిస్తున్నారు.

  2. అమరావతి పాదయాత్ర: రైతుల ఉద్యమమా, రాజకీయ పోరాటమా

  3. ఉత్తరప్రదేశ్‌లో లతా మంగేష్కర్ చౌక్

    బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ పేరు మీద అయోధ్యలో ఒక చౌక్ ఏర్పాటు చేశారు.

    దానికి ‘లతా మంగేష్కర్ చౌక్’ అని పేరు పెట్టారు.

    సుమారు 14 టన్నులు ఉన్న వీణను అక్కడ పెట్టారు.

    లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఈ చౌక్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారు.

  4. తూర్పు యుక్రెయిన్‌లో పూర్తయిన రష్యా రెఫరెండం

    తూర్పు యుక్రెయిన్‌లో రష్యా అధీనంలో గల ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి అయింది.

    రష్యాలో ఆ ప్రాంతాలు చేరాలా వద్దా అనేది నిర్ణయించేందుకు ఈ రెఫరెండం నిర్వహించామని అక్కడి అధికారులు తెలిపారు.

    ఈ రెఫరెండంలో పాల్గొన్న వారిలో దాదాపు అందరూ రష్యాలో చేరేందుకు అనుకూలంగా ఉన్నారని రష్యా నియమించిన అధికారులు చెబుతున్నారు.

    ఈ రెఫరెండాన్ని చూపించి ఆ ప్రాంతాలను తనలో రష్యా కలుపుకుంటుందని భావిస్తున్నారు.

    అయితే ఈ రెఫరెండంను యుక్రెయిన్‌తో సహా పశ్చిమ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అదంతా బోగస్ అని కొట్టి పారేశాయి.

  5. ‘ఇరాన్ హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో 76 మంది మరణం’

    ఇరాన్‌లో ‘హిజాబ్’కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనల్లో ఇప్పటి వరకు భద్రతా దళాల చేతిలో 76 మంది చనిపోయారని నిరసనకారులు తెలిపారు.

    అయితే 41 మంది చనిపోయినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా చెబుతోంది.

    హిజాబ్ నిబంధనలు ఉల్లంఘించిందనే నేరంతో ఒక యువతిని కొద్ది రోజుల కిందట అరెస్టు చేయగా కస్టడీలో ఆమె మరణించింది.

    నాటి నుంచి హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగుతున్నాయి.

  6. మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి మృతి

    సినీనటుడు మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి, నేటి ఉదయం మరణించారు.

    70 ఏళ్ల వయసున్న ఇందిరా దేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

    ఒకనాటి సినీనటుడు కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి. కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు రమేశ్ బాబు, మహేశ్ బాబు, మంజుల, పద్మావతి, ప్రియదర్శిని సంతానం.

    రమేశ్ బాబు ఈ ఏడాది జనవరిలో చనిపోయారు.

    సినీనటుడు చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు ఇందిరా దేవి మృతికి సంతాపం తెలిపారు.

  7. గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.