ఇరాన్‌లో కొనసాగుతున్న ‘హిజాబ్’ నిరసనలు
ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు అయిదో రోజుకు చేరుకున్నాయి. హిజాబ్‌ను తగలబెట్టడం కొనసాగుతోంది.
హిజాబ్ నిబంధనలు ఉల్లంఘించింది అంటూ 22ఏళ్ల మాషా అమిని అరెస్టు చేయగా కస్టడీలో ఆమె చనిపోయారు.
కస్టడీలో పోలీసులు ఆమెను తీవ్రంగా కొట్టినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. నాటి నుంచి ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి.
తెహ్రాన్, తాలేష్, మషాద్, జహేదాన్, అహ్‌వాజ్, సిర్జన్, అమోల్, కేషమ్, నౌషహర్ వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. చాలా చోట్ల పోలీసులతో నిరసనకారులు ఘర్షణలకు దిగుతున్నారు.
ఈ నేపథ్యంలో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను నిలిపి వేశారు.
బహిరంగ ప్రదేశాల్లో బాగా వదులుగా ఉండే దుస్తులు ధరించినందుకు ఇతర మహిళలతో పాటు మాషాను అదుపులోకి తీసుకున్నామని, గుండె సమస్యతో ఆ యువతి చనిపోయిందని మోరల్ పోలీసులు చెబుతున్నారు.