You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆస్కార్స్ 2023: ఆర్ఆర్ఆర్‌కు నిరాశ.. భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’
2023వ సంవత్సరానికి గాను ఆస్కార్స్ బరిలో భారతదేశం తరపునుంచి గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ పోటీపడుతోంది. ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుందని పీటీఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.
లైవ్ కవరేజీ
‘ఆ సినిమా హిందూ దేవతలను కించపరిచేలా ఉంది... బ్యాన్ చేయండి’
అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘థ్యాంక్ గాడ్’ సినిమా చుట్టూ వివాదం అలుముకుంటోంది.
ఈ సినిమాలో హిందూ దేవతలను కించపరిచేలా చూపించారని, అందువల్ల ఆ సినిమాను బ్యాన్ చేయాలంటూ మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్, కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్‌కు లేఖ రాశారు.
‘థ్యాంక్ గాడ్’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ చిత్రగుప్తునిగా నటించారు.
ప్రధాని మోదీని ప్రశంసించిన మేక్రాన్
‘ఇది యుద్ధాలు చేయడానికి సరైన సమయం కాదు’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అన్నారు.
ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల మీద మేక్రాన్ ఇలా స్పందించారు.
‘ఇది యుద్ధాలు చేసే శకం కాదు. దీని గురించి మీతో ఫోనులో కూడా మాట్లాడాను. శాంతి కోసం మనం ముందుకు ఎలా వెళ్లాలో మాట్లాడుకునేందుకు ఈ రోజు అవకాశం లభించింది. కొన్ని దశాబ్దాలు భారత్, రష్యా కలిసిమెలిసి ముందుకు సాగుతున్నాయి’ అని మోదీ ఎస్‌సీఓ సమిట్ సందర్భంగా అన్నారు.
నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను అమెరికా కూడా ఆహ్వానించింది.
వైఎస్సార్‌సీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదు - ఎన్నికల సంఘం
యుక్రెయిన్‌లో శ్రీలంక తమిళులపై చిత్రహింసలు: కాలి వేళ్ల గోళ్లు పీకేశారు, కడుపులో పిడిగుద్దులు గుద్దారు
ఆస్కార్స్ 2023: ఆర్ఆర్ఆర్‌కు నిరాశ.. భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’
2023వ సంవత్సరానికి గాను ఆస్కార్స్ బరిలో భారతదేశం తరపునుంచి గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ పోటీపడుతోంది.
ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుందని పీటీఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.
95వ అకాడెమీ అవార్డులకు భారత్ నుంచి తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్ బరిలో నిలుస్తుందని ప్రచారం జరిగింది. రాజమౌళి తీసిన ఈ చిత్రంలో టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఛెల్లో షో అంటే చివరి సినిమా షో అని అర్థం. పాన్ నలిన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ ఏడాది డిసెంబర్ 21వ తేదీన అకాడెమీ అవార్డు విజేతల పేర్లను ప్రకటిస్తారు. 2023 మార్చి 12వ తేదీన లాస్ ఏంజెలెస్‌లో 95వ అకాడెమీ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది.
యుక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత భూభాగాల్లో రెఫరెండం
తూర్పు యుక్రెయిన్‌లోని లుహాన్స్‌క్‌లో రష్యా అధికారులు ప్రజాభిప్రాయసేకరణ చేపడుతున్నారు.
శుక్రవారం ఓటింగ్ మొదలు కానుంది. రష్యా బలగాలు ఆక్రమించుకున్న యుక్రెయిన్ భూభాగాలను రష్యాలో కలపడం మీద రెఫరెండం చేపట్టనున్నారు.
దొనెత్స్‌క్, ఖేర్సన్‌లోనూ ఇలాగే రెఫరెండం చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రష్యా అధీనంలో ఉన్న ఈ ప్రాంతాల్లో త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామంటూ రష్యా అపాయింట్ చేసిన అధికారులు తెలిపారు.
తమ స్వీయ రక్షణ కోసం ఇది అవసరమని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదెవ్ చెప్పారు.
అయితే తమ భూభాగాల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని యుక్రెయిన్ తెలిపింది.
చైనా, యూరప్, అమెరికాలో దుర్భిక్షం: 2022 చరిత్రలో అత్యంత కరవు సంవత్సరమా?
బీబీసీ తెలుగు కార్టూన్
ఆంధ్రప్రదేశ్: కలెక్టరేట్లను ముట్టడించిన కార్మికులు, కనీస వేతనాలకై నిరసనలు, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లొ కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు రోడ్డెక్కారు.
వివిధ జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పూనుకున్నారు. ప్రదర్శనలు నిర్వహించారు.కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు దిగారు.
ఈ సందర్భంగా అనకాపల్లి సహా కొన్ని జిల్లా కలెక్టరేట్ లోకి దూసుకెళ్ళే ప్రయత్నం చేసిన కార్మికులను అరెస్ట్ చేశారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. మంగళవారం ఉదయం నుంచే కార్మికుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.
రాష్ట్రంలో కార్మికుల కనీస వేతన చట్టం సవరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. 12 ఏళ్లుగా ఈ చట్టం సవరణకు నోచుకోలేదని ఏలూరు కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ఏ గఫూర్ అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు.
అంగన్ వాడి, ఆశా కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, భవన నిర్మాణ కార్మికులు సహా వివిధ రంగాల కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లా, కాకినాడ, తుగో, పగో, ఏలూరు జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు జరిగాయి. విజయవాడ, మచిలీపట్నం, ఒంగోలు, హిందూపురం జిల్లా కేంద్రాల్లోనూ నిరసనలు జరిగాయి
ముంబయి ఐఐటీ: అమ్మాయిల స్నానపు గదుల్లోకి తొంగి చూసిన క్యాంటీన్ ఉద్యోగి అరెస్టు.
ఐఐటీ ముంబయిలోని ఒక హాస్టల్ లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా దొంగచాటుగా చూసేందుకు ప్రయత్నించిన 22 ఏళ్ల క్యాంటీన్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు.
అమ్మాయిలను చూసేందుకు పైపు ద్వారా గోడ పైకి చేరినట్లు పోలీసులు తెలిపారు. నిందితుని పై ఐపీసీ లోని సెక్షన్ 354 కింద కేసును నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ముంబయి పోలీసులు తెలిపారు.
బుధవారం నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తారు.
అమ్మాయిల భద్రతకు ఎటువంటి ప్రమాదం లేదని పోలీసులు తెలిపారు.
క్రికెట్ రూల్స్ మార్చిన ఐసీసీ.. ఈ 8 కొత్త నిబంధనలతో లాభం బౌలర్‌కా లేక బ్యాటర్‌కా?
"తల పై పైట కప్పుకోవడం, హిజాబ్ ఒకటే" - కర్ణాటక జనతా దళ్ (ఎస్) అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తల పై పైట కప్పుకునేవారు. భారత రాష్ట్రపతి కూడా పైట కప్పుకుంటారు. ఇది భారతీయ సంస్కృతి.
"గూంఘట్" (తలను కొంగుతో కప్పుకోవడం) పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) చేస్తున్న కుట్రా? హిజాబ్ అయినా, పైట అయినా ఒకటే" అని కర్ణాటక జనతా దళ్ (ఎస్) అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం అన్నారు.
కర్ణాటకలో విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడం పై నిషేధాన్ని సమర్ధిస్తూ కర్ణాటక హై కోర్టు తీర్పు నిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ముస్లిం విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
సుప్రీం కోర్టు ద్విసభ్య బెంచ్ మంగళవారం ఈ కేసు విచారణను చేపట్టింది.
విద్యాసంస్థలు విడుదల చేసిన సర్క్యులర్ మతపరమైన తటస్థతతో కూడుకుని ఉందని కర్ణాటక ప్రభుత్వం తరుపున వాదిస్తున్న సాలిసిటర్ జనరల్ ఎస్ జీ మెహతా అన్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థులందరూ ఒకే రకమైన యూనిఫామ్ ధరించడాన్ని అమలు చేయాలని అన్నారు.
ఈ విచారణను సుప్రీం కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
సముద్రాలను శుభ్రం చేస్తున్న నత్త గుల్లలు
"శ్రీనగర్‌లో ప్రతి శుక్రవారం జామియా మసీదును ఎందుకు తెరవడం లేదు?" - అసదుద్దీన్ ఒవైసీ
కశ్మీర్ లెఫ్టినేట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం కశ్మీర్‌లో మల్టీప్లెక్స్ తెరిచారు. వీటిని కశ్మీర్ యువతకు అంకితమిస్తున్నట్లు మనోజ్ సిన్హా ప్రకటించారు.
మల్టీప్లెక్స్‌లను తెరవడం పై ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్ వేదికగా స్పందించారు.
ట్విటర్ ద్వారా ఆయన మనోజ్ సిన్హాను ప్రశ్నించారు.
"షోపియన్, పుల్వామాలో సినిమా హాళ్లు తెరిచారు. కానీ,ప్రతి శుక్రవారం శ్రీనగర్‌లోని జామియా మసీదును ఎందుకు మూసేస్తున్నారు? అని ప్రశ్నించారు. కనీసం శుక్రవారం మ్యాటినీ షో వేస్తున్న సమయంలోనైనా మసీదును మూయకండి" అని ట్వీట్ చేశారు.
మార్కెటింగ్ సంస్థల చేతికి మీ వివరాలు చిక్కకుండా ఈ సెట్టింగ్స్‌తో తప్పించుకోవచ్చు - డిజిహబ్
రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్ ప్రాంతంలో ఈ సీజన్లో కురిసిన తొలి మంచు చిత్రాలు
కశ్మీర్‌లో తొలి మల్టీప్లెక్స్ ప్రారంభం
కశ్మీర్ ప్రజలు సుమారు మూడు దశాబ్దాల తర్వాత బిగ్ స్క్రీన్ పై సినిమాలను చూసేందుకు అవకాశం కలుగుతోంది. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం కశ్మీర్‌లో తొలి మల్టీప్లెక్స్ ను ప్రారంభించారు.
జమ్మూ కశ్మీర్‌లో కొత్త సినిమా విధానాల రూపకల్పనతో ఇక్కడ సినిమాల చిత్రీకరణ పెరిగింది. భవిష్యత్తులో రాష్ట్రంలో ఫిల్మ్ సిటీ కూడా నిర్మిస్తామని మనోజ్ సిన్హా తెలిపారు. ఇందుకోసం భూమిని కూడా కేటాయించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రచురించింది.
లండన్ సమీపంలోని లెస్టర్‌లో అల్లర్లు.. 47 మంది అరెస్ట్
పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను జర్మనీలో విమానం నుంచి ఎందుకు ‘దించేశారు’? విపక్షాల ప్రశ్న