SCO సదస్సు: భారత్-రష్యా సంబంధాల బలోపేతంపై పుతిన్‌తో చర్చించిన ప్రధాని మోదీ

ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సమర్‌కండ్ చేరుకున్నారు. ఆయనకు భారత దౌత్యాధికారులు స్వాగతం పలికారు.

లైవ్ కవరేజీ

  1. కృష్ణంరాజు కుటుంబానికి రాజ్‌నాథ్ పరామర్శ

    ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో రాజ్‌నాథ్ సింగ్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో రాజ్‌నాథ్ సింగ్

    ఇటీవల మరణించిన నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు.కృష్ణంరాజు కుటుంబాన్ని రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు.

    హైదరాబాద్‌లో కృష్ణంరాజు నివాసానికి చేరుకున్న రాజ్‌నాథ్ సింగ్ ఆయనకు నివాళులు అర్పించారు.

    కృష్ణంరాజు కుటుంబ సభ్యులతోపాటు హీరో ప్రభాస్‌తో కూడా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' రివ్యూ: 'ప్రేక్షకులు చాలా మంచోళ్లు. చెత్త సినిమాలోనూ మంచే వెదుక్కొంటారు'

  3. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్న గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీకి 8వ స్థానం

    గౌతమ్ అదానీ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, గౌతమ్ అదానీ

    ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో రెండో ర్యాంకుకు చేరుకున్నారు.

    ఆయన ఫ్రాన్స్‌కు చెందిన కుబేరుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను దాటి ఈ ర్యాంకును సాధించారు.

    ఈ జాబితాలో టెస్లా మోటార్స్ అధినేత ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

    బెర్నార్డ్ ఆర్నాల్ట్ మూడో స్థానం, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ నాలుగో స్థానం, బిల్ గేట్స్ ఐదో స్థానంలో ఉన్నారు.

    గౌతమ్ అదాని సంపద 154.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12లక్షల కోట్లు ) కాగా, ఎలాన్ మస్క్ సంపద రూ. 21.7 లక్షల కోట్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది.

    ఈ జాబితాలో ముకేశ్ అంబానీ సుమారు రూ.7 లక్షల కోట్ల సంపదతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు.

    బొగ్గు గనుల నుంచి విమానాశ్రయాల వరకు అనేక వ్యాపారాలో అదానీ బిజినెస్ వ్యవహరాలు విస్తరించాయి. ఇటీవలే అదానీ గ్రూప్ ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను పరోక్ష పద్ధతిలో కొనుగోలు చేసింది.

  4. బ్రిటన్ వంట గదుల్లోకి భారతీయ వంటకాలను తీసుకెళ్లిన మాథుర్

  5. ఆ జెర్సీ విలువ రూ. 79 కోట్లు, క్రీడా చరిత్రలో అతి పెద్ద వేలం ఇదే

    మైఖేల్ జోర్డాన్ వాడిన జెర్సీ రికార్డు ధరకు వేలంలో అమ్ముడైంది

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, మైఖేల్ జోర్డాన్ వాడిన జెర్సీ రికార్డు ధరకు వేలంలో అమ్ముడైంది

    అమెరికాకు చెందిన బాస్కెట్ బాల్ ప్లేయర్ మైఖేల్ జోర్డాన్ ధరించిన జెర్సీ ఒకటి 10 మిలియన్ డాలర్ల( సుమారు రూ. 79 కోట్లు)కు వేలంలో అమ్ముడైంది.

    1998లో నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) ఫైనల్స్‌లో ఓపెనింగ్ మ్యాచ్ సందర్భంగా జోర్డాన్ ఈ జెర్సీని ధరించారు.

    క్రీడాకారుల జెర్సీల వేలం చరిత్రలో ఇప్పటి వరకు ఇదే అతి ఖరీదైన ఆక్షన్ సేల్‌గా భావిస్తున్నారు.

    అర్జెంటీనా సాకర్ స్టార్ డియాగో మారడోనా ఉపయోగించిన జెర్సీ గతంలో 9.3 మిలియన్ డాలర్ల( సుమారు రూ. 74 కోట్లు)కు అమ్ముడు పోయింది. ఈ జెర్సీని మారడోనా ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ సాధించిన సందర్భంగా వాడారు.

    ఆ రికార్డును బద్ధలు చేస్తూ తాజాగా జోర్డాన్ జెర్సీ అమ్ముడైంది. వేలం ప్రకటించిన తర్వాత, కేవలం క్రీడాభిమానులే కాక, అనేకమంది ఈ జెర్సీని సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపించారని ఈ వేలం నిర్వాహక సంస్థ సోత్‌బైస్ కు చెందిన బ్రామ్ వాచర్ తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. స్మార్ట్‌ఫోన్‌ను పిల్లలకు ఏ వయసులో ఇవ్వాలి?

  7. SCO సదస్సు: ‘‘మనవాళ్లు బిచ్చగాళ్లలా కూర్చున్నారు’’ పాక్ ప్రధానిపై మాజీ డిప్యూటీ స్పీకర్ విమర్శలు

    హెడ్‌ఫోన్ సరిచేసుకుంటున్న షాబాజ్ షరీఫ్

    ఫొటో సోర్స్, ANI/RIA

    ఫొటో క్యాప్షన్, హెడ్‌ఫోన్ సరిచేసుకుంటున్న షాబాజ్ షరీఫ్

    షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భాగంగా పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన సమావేశంలో సరదా సన్నివేశం చోటు చేసుకుంది.

    పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడుతుండగా, ఆయన చెవికి పెట్టుకున్న హెడ్ ఫోన్ పదే పదే కింద జారిపడింది. ఈ దృశ్యాన్ని చూస్తూ పుతిన్ నవ్వుతూ ఉండిపోయారు.

    ఈ వీడియోను రష్యా అధికారిక మీడియా సంస్థ ఆర్ఐఏ షేర్ చేసింది. ఇదే వీడియోను మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్(పీటీఐ) కూడా షేర్ చేసింది.

    హెడ్‌ఫోన్ పదే పదే జారి పడిపోతుండగా, సాయం చేయాలంటూ షాబాజ్ అక్కడున్న సిబ్బందిని కోరారు. ఆ వ్యక్తి వచ్చి సరిచేసినా హెడ్ ఫోన్ మళ్లీ పడిపోయింది.

    ‘‘ఇది ఒక ఇబ్బందికరమైన సన్నివేశం’’ అని పీటీఐ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.

    మరోవైపు ఈ సదస్సులో పాల్గొంటున్న పాకిస్తాన్ బృందాన్ని విమర్శిస్తూ నేషనల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, పీటీఐ నేత ఖాసింఖాన్ సూరి ఒక ఫొటో విడుదల చేశారు.

    అందులో పాకిస్తాన్ బృందంలోని విదేశాంగ శాఖమంత్రి బిలావల్ భుట్టో జర్దారీ సహా మిగిలిన సభ్యులంతా బిచ్చగాళ్లలాగా కూర్చున్నారని ఖాసింఖాన్ విమర్శించారు.

    అంతకు ముందు, సమర్‌ఖండ్‌లో వివిధ దేశాల నేతలతో సమావేశాలు ఫలవంతంగా జరిగాయని షాబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు.

    ఈ ట్వీట్‌పై స్పందిస్తూ, ‘‘కానీ, ఫొటోల్లో అవతలి దేశానికి చెందిన సభ్యులు శ్రద్ధగా విషయాలు నోట్ చేసుకుంటుండగా, మిగిలిన వాళ్లు బిచ్చగాళ్లలా ఖాళీగా కూర్చున్నారు’’ అంటూ ఖాసింఖాన్ ట్వీట్ లో విమర్శించారు.

    ఖాసింఖాన్ విడుదల చేసిన ఫొటో

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ఖాసింఖాన్ విడుదల చేసిన ఫొటో
  8. లఖీంపుర్ ఖీరీలో దళిత బాలికల హత్య: 'నా బిడ్డలను ఎందుకు చంపారు, అందరినీ ఉరి తీయాలి' - తల్లి ఆవేదన

  9. SCO సదస్సు: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తో సమావేశం కానున్న ప్రధానమంత్రి మోదీ

    మోదీ, షీ జిన్‌పింగ్

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    ఫొటో క్యాప్షన్, నరేంద్రమోదీ తో షీ జిన్‌పింగ్

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ వేదికగా జరిగే ఒక భద్రతా సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా ఉజ్బెకిస్తాన్ దేశాల నేతలతో సమావేశమవుతారు.

    షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సభ్యదేశాలు ఉజ్బెకిస్తాన్ వేదికగా జరుగుతున్న సమావేశంలో పాల్గొంటున్నాయి.

    చైనా సైన్యాన్ని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు సూచించాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణియన్ స్వామి ట్వీట్ చేశారు.

    యుక్రెయిన్ యుద్ధంతో పాటు చైనా, పశ్చిమ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల గురించి ఈ సదస్సులో ప్రముఖంగా చర్చించే అవకాశం ఉంది.

    ఈ సదస్సులో చైనా, రష్యాలతో మోదీ చర్చలు జరుపనున్నారనే అంచనాలు మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీపై అందరి దృష్టి నిలిచింది.

    గురువారం రాత్రి ఉజ్బెకిస్తాన్‌లో సదస్సు జరుగుతున్న సమర్‌కండ్‌ నగరానికి ప్రధానమంత్రి మోదీ చేరుకున్నారు.

    ప్రధానికి ఉజ్బెకిస్తాన్‌లోని భారత దౌత్యాధికారులు, ఇతర సిబ్బంది స్వాగతం పలికారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. ఉత్తరప్రదేశ్: లఖ్‌నవూలో గోడకూలి 9మంది మృతి

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో కురిసిన భారీ వర్షాలకు ఓ గోడ కూలడంతో 9 మంది మరణించారు.

    ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

    లఖ్‌నవూలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న దిల్‌కుషా ఏరియాలో ఘటన జరిగిందని రాష్ట్ర హోంశాఖ వెల్లడించినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

  11. హలో..గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.

  12. ఎక్స్‌పైరీ డేట్ దాటిన, బూజు పట్టిన ఆహార పదార్థాల్లో ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు?

  13. ‘ఈ శతాబ్దంలోనే అతిపెద్ద నిఘా కుట్ర’: భారత్ సహా అనేక దేశాల రహస్యాలు చేజిక్కించుకున్న అమెరికా

  14. సెప్టెంబర్ 17: ‘నాకు లొంగిపోవటం మినహా దారి లేదు’ - నిజాం సైన్యాధికారి