‘సీఎం కేసీఆర్ ఎందుకు రావడం లేదు... రాజ్‌భవన్ అంటరాని స్థలమా?’

రాజ్‌భవన్ అంటరాని స్థలమా? ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యేలు ఎందుకు ఇక్కడకు రావడం లేదు అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రశ్నించారు.

లైవ్ కవరేజీ

  1. సిద్ధిక్ కప్పన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

  2. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    మళ్లీ రేపు తాజా వార్తలతో కలుద్దాం.

  3. వైద్యుల పర్యవేక్షణలో బ్రిటన్ రాణి ఎలిజబెత్

    క్వీన్

    ఫొటో సోర్స్, EPA

    బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు గురువారం నాడు బకింగ్‌హమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది.

    ఈ రోజు ఉదయం ఆమెను పరీక్షించిన అనంతరం రాణి ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారని, ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించినట్లు వెల్లడించింది.

    ప్రస్తుతం బల్మోరల్ క్యాసిల్‌లో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.

  4. వైద్యుల పర్యవేక్షణలో బ్రిటన్ రాణిక్వీన్ ఎలిజబెత్

    క్వీన్

    ఫొటో సోర్స్, EPA

    బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బుధవారం నాడుబకింగ్‌హమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది.

    ఈ రోజు ఉదయం ఆమెను పరీక్షించిన అనంతరం రాణి ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారని, ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించినట్లు తెలిపింది.

    ప్రస్తుతం బల్మోరల్ క్యాసిల్‌లో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారని ప్రకటన తెలిపింది.

  5. ‘‘ఉద్యోగానికి ఆఫర్ లెటర్ ఇచ్చాక, చివరి నిమిషంలో చేరలేనని చెప్పడం న్యాయమా’’- ఈ అంశంపై ఎందుకు చర్చ జరుగుతోంది?

  6. యూఎన్‌డీపీ మానవాభివృద్ధి సూచీలో క్షీణించిన భారత్ ర్యాంక్

    మానవాభివృద్ధి సూచీలో క్షీణించిన భారత ర్యాంక్

    ఫొటో సోర్స్, Getty Images

    మానవాభివృద్ధి సూచీ-2021లో భారత్ ర్యాంకు క్షీణించినట్లు తాజాగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) విడుదల చేసిన నివేదిక తెలిపింది.

    మొత్తం 191 దేశాల్లో భారత్ 132వ ర్యాంకులో ఉన్నట్లు పేర్కొంది. 2020లో భారత మానవాభివృద్ధి సూచిక స్కోరు 0.642 ఉండగా, 2021 నాటికి 0.633కి పడిపోయింది.

    ఈ జాబితాలో శ్రీలంక 73, చైనా 79, బంగ్లాదేశ్ 129, పాకిస్తాన్ 161 ర్యాంకులో ఉన్నట్లు యూఎన్‌డీపీ ప్రకటించింది.

  7. గత రెండేళ్లలో మనిషి సరాసరి ఆయుర్దాయం తగ్గింది, రాబోయే కాలంలో పరిస్థితి ఎలా ఉండబోతోంది?

  8. ‘సీఎం కేసీఆర్ ఎందుకు రావడం లేదు... రాజ్‌భవన్ అంటరాని స్థలమా?’

    తమిళిసై

    ఫొటో సోర్స్, RajBhavan

    రాజ్‌భవన్ అంటరాని స్థలమా? ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యేలు ఎందుకు ఇక్కడకు రావడం లేదు అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రశ్నించారు.

    ‘సదరన్ జోనల్ కాన్ఫరెన్స్‌లో నేను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో పాల్గొన్నాను. అక్కడ ప్రస్తావనకు వచ్చిన సమస్యలో 75శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌వే. వాటిని పరిష్కరించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు?

    ఇలాంటి సమావేశాలు సమస్యల పరిష్కారానికి అవకాశం కదా? వాటిని ఎందుకు సీఎం ఉపయోగించుకోవడం లేదు?

    గవర్నర్ ప్రోటోకాల్ వారు పాటించడం లేదు. నిద్రపోతున్నవారిని లేపొచ్చు కానీ నటిస్తున్న వారిని ఎలా లేపుతాం? వారు తెలిసి కూడా చేయలేడం లేదు.

    ఎందుకు ప్రోటోకాల్ పాటించడం లేదు... నేను మహిళను కాబట్టా? లేక మీరు చెప్పిందల్లా చేయనుందుకా? అది వారే చెప్పాలి.

    నేను ఇక్కడ రాజకీయాలు చేయడం లేదు. అన్ని పార్టీలకు సమదూరంలో ఉంటున్నాను. నేను ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఎమ్మెల్యేలు సమస్యలు పరిష్కరించడం లేదు కాబట్టే ప్రజలు రాజ్‌భవన్‌కు వస్తున్నారు’ అని ఆమె అన్నారు.

  9. వాటర్ డ్రోన్: సముద్రంలో మునిగిపోయే వారిని కాపాడేందుకు వేగంగా చేరుకునే డ్రోన్

  10. కర్తవ్యపథ్‌ డ్రోన్ వీడియో

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

    దిల్లీలో రాజ్‌పథ్ మార్గం కొత్త అందాలను సంతరించుకుని కర్తవ్య పథ్‌గా సిద్ధమైంది. సెప్టెంబర్ 8 సాయంత్రం దీనిని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. కర్తవ్య పథ్ అందాలను డ్రోన్ వీడియోలో చూడండి.

  11. రెండో రోజు సాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’

    భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, ANI

    తమిళనాడులో రెండో రోజు భారత్ జోడో యాత్ర సాగుతోంది.

    కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన ఈ యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగనుంది.

    2017లో ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థి అనిత తండ్రి, సోదరుడు ఈ సందర్భంగా రాహుల్ గాంధీని కలిశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. మూడేళ్లుగా అవమానాలు ఎదుర్కొంటున్నా: తెలంగాణ గవర్నర్ తమిళిసై

    తెలంగాణ గవర్నర్ తమిళిసై

    ఫొటో సోర్స్, Telangana RajBhavan

    తెలంగాణలో తనకు ఎన్ని ఆటంకాలు వచ్చినా పని చేస్తూ పోతున్నానని ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు.

    తెలంగాణ గవర్నర్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె రాజ్‌భవన్‌లో మాట్లాడారు.

    ఈ మూడేళ్ల కాలంలో తాను ఎంతో వివక్షను ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు. సమ్మక్క సారక్క ఉత్సవాలకు వెళ్లేందుకు హెలికాప్టర్ అడిగినా ప్రభుత్వం తనకు ఇవ్వలేదని అన్నారు.

    రిపబ్లిక్ డే నాడు జెండా ఎగుర వేసేందుకు గవర్నర్‌ను అనుమతించకపోవడమా సరైనదేనా? అని ఆమె ప్రశ్నించారు.

    ‘ఎట్ హోం కార్యక్రమానికి పిలిచినా కూడా ముఖ్యమంత్రి రాలేదు. కనీసం వస్తారో రారో సమాచరం కూడా ఇవ్వలేదు. ఇలా ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నా’ అని తమిళి సై అన్నారు.

  13. పౌరసత్వ సవరణ చట్టంపై దాఖలైన పిటీషన్లను విచారించనున్న సుప్రీం కోర్టు

    పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లను వచ్చే సోమవారం సుప్రీం కోర్టు విచారించనుంది.

    ప్రధాన న్యాయమూర్తి యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం 200కు పైగా ఫైల్ అయిన పిటీషన్లను విననుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. బ్రహ్మాస్త్ర: ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనం చేసుకోలేకపోయిన రణబీర్ కపూర్, ఆలియా భట్... ఏమిటీ వివాదం?

  15. అమిత్ షా భద్రతలో లోపం... ఆంధ్రప్రదేశ్ ఎంపీ పీఏగా నటించిన వ్యక్తి అరెస్ట్

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

    ఫొటో సోర్స్, Facebook/AmitShah

    ఆంధ్రప్రదేశ్ ఎంపీ పీఏగా నటించిన ఒక వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముంబయి పర్యటనలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

    ఏక్‌నాథ్ శిందే ముఖ్యమంత్రి అయిన తరువాత అమిత్ షా తొలిసారి మహారాష్ట్ర వచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీ పర్సనల్ అసిస్టెంట్‌గా నటించిన హేమంత్ పవార్ అనే వ్యక్తి ఆయన బస చేసిన నివాసంలోకి వచ్చారని పోలీసులు తెలిపారు.

    అలాగే కేంద్ర హోంశాఖకు చెందిన వ్యక్తిగా నటించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ నివాసాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు.

    హేమంత్ పవార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

  16. చిత్రాల్లో కర్తవ్యపథ్

    సుందరీకరించిన ఇండియా గేట్ పరిసరాలు

    ఫొటో సోర్స్, Twitter/KirenRijiju

    ఫొటో క్యాప్షన్, సుందరీకరించిన ఇండియా గేట్ పరిసరాలు
    రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్‌గా మార్చారు.

    ఫొటో సోర్స్, Twitter/KirenRijiju

    ఫొటో క్యాప్షన్, రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్‌గా మార్చారు.
    సుందరీకరించిన కర్తవ్యపథ్

    ఫొటో సోర్స్, Twitter/KirenRijiju

    ఫొటో క్యాప్షన్, సుందరీకరించిన కర్తవ్యపథ్
  17. నితీశ్ కుమార్: పబ్లిసిటీలో ప్రశాంత్ కిశోర్ దిట్ట... బీజేపీకి దగ్గర కావాలని ఆయన అనుకుంటున్నారు

    బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్

    ఫొటో సోర్స్, Nitish Kumar

    ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మీద బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    బిహార్‌లో తాము చేసిన అభివృద్ధి గురించి ఆయనకు ఏమీ తెలియదని, పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని అన్నారు.

    జేడీయూ, ఆర్జేడీల కలయిక బిహార్ వరకే పరిమితమని దేశ రాజకీయాల మీద ప్రభావం చూపదని ప్రశాంత్ కిశోర్ అన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మొన్నటి దాకా బీజేపీతో ఉన్న వాళ్లు ఈ రోజు ఆ పార్టీకి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్నారని ఆయన విమర్శించారు.

    ‘ఆ వ్యక్తి(పీకే) నా వద్దకు వచ్చారు. నువ్వు చేస్తున్న పని మానేసి నాతో రమ్మని నేను చెప్పాను. కానీ అతను నా మాట వినలేదు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల కోసం పని చేస్తూనే ఉన్నాడు. అది ఆయన వ్యాపారం.

    బిహార్‌లో ఆయన ఏమైనా చేయొచ్చు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలకు అర్థం లేదు. బిహార్‌లో 2005 నుంచి మేం చేసిన పనుల గురించి కొంచెం(ఏబీసీ) కూడా తెలియదు. పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. అందులో ఆయన సిద్ధహస్తుడు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఆయన బీజేపీతో ఉండాలని అనుకుంటూ ఉండొచ్చు. లేదా బీజేపీకి సాయం చేయాలని భావిస్తూ ఉండొచ్చు’ అని నితీశ్ కుమార్ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. ఆంధ్రప్రదేశ్‌: కొత్త పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఏమిటీ ఓపీఎస్, జీపీఎస్?

  19. వియత్నాంలో అగ్నిప్రమాదం... 32 మంది మృతి

    వియత్నాంలో అగ్ని ప్రమాదం

    ఫొటో సోర్స్, AN PHONG

    ఫొటో క్యాప్షన్, వియత్నాంలో అగ్ని ప్రమాదం జరిగిన కాంప్లెక్స్

    వియత్నాంలోని హో చి మిన్ సిటీ సమీపంలో గల కరోకీ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 32 మంది చనిపోయారు.

    చనిపోయిన వారిలో 17 మంది మగవారు 15 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు.

    కాంప్లెక్స్‌లోని పై అంతస్తులో మంగళవారం రాత్రి మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. దీంతో పని చేసే సిబ్బంది, కస్టమర్లు మంటల్లో చిక్కుకుని పోయారు.

    కింది అంతస్తులో సులభంగా కాలిపోగల మెటీరియల్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాద తీవ్రత బాగా పెరిగింది.

  20. పాముకు ప్లాస్టిక్ సర్జరీ

    కొండ చిలువకు ఆపరేషన్

    ఫొటో సోర్స్, ANI

    ముంబయిలో 10 అడుగుల పొడవైన కొండ చిలువకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు.

    తీవ్రంగా గాయపడిన రాక్ పైథాన్‌ను పోయిన నెలలో అటవీశాఖ అధికారులతో కలిసి రెస్కింక్ అసోసియేషన్ ఫర్ వైల్డ్‌లైఫ్ వెల్ఫేర్(ఆర్‌ఏడబ్ల్యూడబ్ల్యూ) రక్షించింది.

    నాటి నుంచి ఆ కొండ చిలువ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు డాక్టర్ రీనా దేవ్ తెలిపారు. దానికి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు వివరించారు. 3 నెలలు పాటు అది అబ్జర్వేషన్‌లో ఉంటుంది.

    ఇప్పటికే కొండ చిలువకు రెండు సర్జరీలు చేశారు.

    కొండ చిలువ

    ఫొటో సోర్స్, ANI