35 ఏళ్ల కాలానికి రైల్వే భూముల లీజు... ‘ఆదాయం పెంచుకునేందుకే’

ప్రధానమంత్రి గతి శక్తి విధానంలో భాగంగా రైల్వే భూములను 35ఏళ్ల కాలానికి లీజుకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

లైవ్ కవరేజీ

  1. పిల్లలు త్వరలోనే కంటిచూపు కోల్పోతారని తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఏం చేశారు?

  2. ఇరాన్‌: యాభైఏళ్ల కిందటే అత్యాధునిక జీవితాన్ని చూసిన మహిళల జీవితాలు తర్వాత ఎలా మారిపోయాయి?

  3. సీనియర్ నటి ఆశా పరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్

    ఆశా పరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ఆశా పరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్

    ప్రముఖ నటి ఆశాపరేఖ్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

    ఈ విషయాన్ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.

    నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా కూడా ఆమె కళారంగానికి సేవలందించారు.

    1942లో గుజరాత్ లో జన్మించిన ఆశా పరేఖ్ హిందీ సినిమాలలో తనదైన ముద్ర వేశారు.

    పదేళ్ల వయసు నుంచే బాల నటిగా కెరీర్ ప్రారంభించిన ఆశా, 1960,70 ల నాటికి కెరియర్‌లో అత్యుతన్న దశను చూశారు.

    1992లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  4. సుప్రీంకోర్టు విచారణలు లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభం

    సుప్రీంకోర్టు

    ఫొటో సోర్స్, webcast.gov.in/scindia/

    ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు

    సుప్రీంకోర్టులో విచారణలు ఇవాళ్టి నుంచి లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. రాజ్యాంగ ధర్మాసనంలో జరగనున్న విచారణకు సంబంధించిన ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి.

    ఆన్‌లైన్ స్ట్రీమింగ్ కోసం వెబ్‌సైట్, యూట్యూబ్‌‌లను సుప్రీంకోర్టు ఉపయోగిస్తుంది.

    ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, మహారాష్ట్రలో శివసేన వివాదం సహా అనేక ఇతర అంశాలు రాజ్యాంగ ధర్మాసనంలో మంగళవారం నాడు విచారణకు వస్తున్నాయి.

    రాజ్యాంగ ధర్మాసనం విచారణలకు సంబంధించి మూడు కోర్టుల నుంచి ప్రత్యేక వెబ్‌కాస్ట్ ఉంటుంది.

    దీని బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC)కి అప్పగించారు. ఆన్‌లైన్ విచారణను చూడటానికి https://webcast.gov.in/scindia/ ని సందర్శించవచ్చు.

    NICకి చెందిన YouTube చానెల్‌లలో కూడా ఈ విచారణలను చూడవచ్చు.

    కరోనా సమయం నుండి ఆన్‌లైన్ ప్రయత్నాలు

    కరోనా మహమ్మారి తర్వాత సుప్రీంకోర్టు పిటిషన్ల కోసం ఇ-ఫైలింగ్‌ను ప్రారంభించింది. ఈ-ఫైలింగ్‌ను రోజులో 24 గంటల్లో ఎప్పుడైనా చేయవచ్చు.

    అలాగే సుప్రీంకోర్టుకు చెల్లించాల్సిన ఫీజులను కూడా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

  5. తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో పోలీసు, ఏటీఎస్ సోదాలు.. పీఎఫ్ఐ అనుమానితుల అరెస్టులు

    అస్సాం పోలీసులు

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, అస్సాంలో సోదాలు చేస్తున్న పోలీసులు

    దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసు విభాగాలు, వాటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌లు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) మీద సోదాలు నిర్వహిస్తున్నాయి.

    ఏఎన్‌ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, దిల్లీ, అస్సాం రాష్ట్రాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఈ క్రమంలో పలుచోట్ల పెద్ద ఎత్తున అనుమానితులను అరెస్ట్ చేస్తున్నారు.

    దిల్లీలోని నిజాముద్దీన్, షాహీన్ బాగ్ సహా రాజధానిలోని పలు ప్రాంతాల నుంచి 30 మందిని అరెస్ట్ చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ఔరంగాబాద్‌లో 13 మందిని, మాలెగావ్‌లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ కొనసాగుతోందని మహారాష్ట్ర ఏటీఎస్ చెప్పింది.

    ఉత్తరప్రదేశ్‌లో 12 మందికి పైగా పీఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. అస్సాంలోనూ పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు వెల్లడించారు.

  6. జైశంకర్: ఆయుధాలు ఎవరి దగ్గర కొనాలనేది పూర్తిగా మా ఇష్టం... మా ప్రయోజనాలే ముఖ్యం

  7. నరేంద్ర మోదీ వరల్డ్ లీడర్ అయ్యారా, భారత్‌ అంతర్జాతీయ శక్తిగా మారిందా...

  8. పొలంలో దిగి, వరి నాట్లు వేసిన కలెక్టర్లు... గట్టు మీదే భోజనాలు

  9. లెస్టర్‌లో హిందూ, ముస్లింల మధ్య హింసకు ‘భారత్‌ కనెక్షన్’ ఏంటి?

  10. ఆంధ్రప్రదేశ్‌: పొలంలో దిగి, వరి నాట్లు వేసిన కలెక్టర్లు... గట్టు మీదే భోజనాలు

  11. మ్యాక్స్‌వెల్ రన్ అవుట్: స్టంప్స్‌ మీద ఒక బెయిల్ ఉన్నా ఔటేనా? ఐసీసీ క్రికెట్ నిబంధన ఏంటి?

  12. కేసీఆర్ కోరుకుంటున్న ప్రతిపక్ష కూటమిని నితీశ్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్ కోరుకోవడం లేదా

  13. హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరుపై స్పందించిన లక్ష్మీ పార్వతి, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

    లక్ష్మీ పార్వతి

    ఫొటో సోర్స్, ysrcp

    డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి స్పందించారు.

    ఎన్టీఆర్ మీద ఇప్పుడు కొందరు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన వైఎస్ఆర్ పేరు యూనివర్సిటీకి పెట్టడం సముచితమేనన్నారు.చంద్రబాబులా, పగతోనో, ద్వేషంతోనో పేరు మార్చడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ పై గౌరవం, అభిమానం ఉన్నాయి కాబట్టే, ఎవరూ అడగకపోయినా, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయన్ను గౌరవించిన ముఖ్యమంత్రి జగన్ అంటూ ఆమె ప్రశంసించారు.

    ‘‘జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలా? యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టాలా? అని నన్ను ప్రశ్నిస్తే జిల్లాకే ఎన్టీఆర్‌ పేరు ఉండాలని నేను కోరుకుంటాను’’ అని ఆమె అన్నారు.

    ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన వాళ్ళే.. నేడు ఆయన పేరు వాడుకుంటున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ గౌరవార్థం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని లక్ష్మీ పార్వతి డిమాండ్ చేశారు. అధికార దాహంతో చంద్రబాబు దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

    టీడీపీ, వారికి వత్తాసు పలికే మీడియాలో తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారున, ఎన్టీఆర్‌ తనను వివాహమే చేసుకోలేదని, నందమూరి ఇంటిపేరు వాడుకునే హక్కులేదంటూ అతి దారుణంగా మాట్లాడుతున్నారని లక్ష్మీ పార్వతి తెలిపారు. చరిత్ర ఎప్పుడూ చరిత్రే. దాన్ని ఎవరు చెరిపివేయాలనుకున్నా చెరపలేరని వ్యాఖ్యానించారు.

    ఎన్టీరామారావుపై నాదెండ్ల భాస్కర రావు తిరుగుబాటు చేస్తే వెన్నుపోటు, ఎన్టీరామారావుకు చంద్రబాబు వెన్నపోటు పొడిస్తే అధికార మార్పా? అని ఆమె ప్రశ్నించారు.

    లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలను టీడీపీ తప్పుబడుతోంది. ఆమె అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరుని చెరిపేస్తుంటే దానిని కూడా సమర్థించడానికి సిగ్గులేదా అంటూ ప్రశ్నించారు.

  14. ‘డెమొక్రాటిక్ ఆజాద్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీని స్థాపించిన గులాంనబీ ఆజాద్

    ఇటీవల కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీని స్థాపించారు.

    దాని పేరు డెమొక్రాటిక్ ఆజాద్ పార్టీ అని పెట్టారు.

    ఈ సందర్భంగా ఆయన తన పార్టీ జెండాను జమ్మూలో ఆవిష్కరించారు.

    మూడు రంగులున్న డెమొక్రాటిక్ ఆజాద్ పార్టీ జెండా ఆవపువ్వు రంగు, నీలం, తెలుపు రంగులలో ఉంది.

    ఆవపువ్వు రంగు సృజనాత్మకతకు, భిన్నత్వంలో ఏకత్వానికి సూచిక అని, నీలి రంగు స్వేచ్ఛకు, తెలుపు రంగు శాంతికి నిదర్శనమని పార్టీ ప్రకటన సందర్భంగా ఆజాద్ పేర్కొన్నారు.

    కొత్త పార్టీ పెట్టిన గులాం నబీ ఆజాద్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, కొత్త పార్టీ పెట్టిన గులాం నబీ ఆజాద్
    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. కింగ్ కోబ్రా: ఈ పాముకు మనుషులంటే చాలా భయం. కానీ, అది ఎంత మేలు చేస్తుందో తెలుసా?

  16. Cup of Life: మగాళ్లకు పీరియడ్స్ నొప్పులు ఎందుకు వస్తున్నాయి?

  17. INDvAUS: ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ నెగ్గింది సరే, వరల్డ్ కప్‌కు టీమిండియా సన్నద్ధంగా ఉందా?

  18. రాజస్థాన్ రాజకీయ సంక్షోభం పై పార్టీ హై కమాండ్ కు నివేదికను సమర్పించనున్న కాంగ్రెస్ పరిశీలకులు

    కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు

    ఫొటో సోర్స్, ANI

    రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు మల్లికార్జున్ ఖార్గే, అజయ్ మకెన్ రాజకీయ పరిస్థితికి సంబంధించిన నివేదికను దిల్లీలో కాంగ్రెస్ నాయకత్వానికి సమర్పించనున్నారు.

    అయితే, గెహ్లోత్ తరుపున ఉన్న శాసనసభ్యులు పార్టీ పరిశీలకులను కలిసేందుకు సుముఖత చూపించలేదని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐ సీసీ) పార్టీ హై కమాండ్ తో చర్చించి తదుపరి చర్య గురించి నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు తెలిపినట్లుఏఎన్ఐ పేర్కొంది.

    ఆదివారం సాయంత్రం రాజస్థాన్ ముఖ్యమంత్రి నివాసంలో అబ్జార్వర్ల సమక్షంలో శాసన సభ్యుల సమావేశం చోటు చేసుకుంది. ఈ సమావేశానికి సచిన్ పైలట్ కూడా హాజరయ్యారు.

    కానీ, గెహ్లోత్ మద్దతుదారులు క్యాబినెట్ మంత్రి శాంతి ధరివాల్ నివాసంలో మరో సమావేశాన్ని నిర్వహించారు.

    ఈ సమావేశం తర్వాత 90 మంది శాసన సభ్యులు స్పీకర్ కు తమ రాజీనామాను సమర్పించారు.

    శాసనసభ్యులు సోనియా గాంధీ పంపిన పరిశీలకుల సమక్షంలో జరిగిన సమావేశానికి హాజరై ఉండాల్సిందని కొంత మంది వ్యాఖ్యానించారు.

    శాసనసభ్యులను వ్యక్తిగతంగా వచ్చి కలవమని అభ్యర్ధించినట్లు అజయ్ మకెన్ చెప్పారు.

  19. సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు

    జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌

    ఫొటో సోర్స్, ANI

    సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రూ.200 కోట్ల మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించిన కేసులో దిల్లీలోని కోర్టుకు హాజరయ్యారు.

    జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తరుపున వాదిస్తున్న న్యాయవాది ఈ కేసులో ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

    అదనపు సెషన్స్ జడ్జీ శైలేందర్ మలిక్ బెయిల్ పిటిషన్ పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను సమాధానం చెప్పమని కోరింది.

    ఈడీ సమాధానం వచ్చేవరకు ఆమె బెయిల్ పిటిషన్ కోర్టులో పెండింగ్ లో ఉంటుంది.

    జాక్వెలిన్ న్యాయవాది అభ్యర్ధన మేరకు రూ.50,000 బెయిల్ బాండు పై కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

    సుకేశ్ చంద్రశేఖర్ కేసుకు సంబంధించి జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు జారీచేసింది. ఇప్పటికే రూ.7.27 కోట్ల విలువైన జాక్వెలిన్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

  20. రాజస్థాన్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సంక్షోభం

    సచిన్ పైలట్, అశోక్ గెహ్లోత్

    ఫొటో సోర్స్, ANI

    రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతోంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది.

    ఈ మేరకు బీజేపీ రాజస్థాన్ అధ్యక్షుడు ట్వీట్ చేస్తూ, భగవంతుడు మాత్రమే రాజస్థాన్ ను రక్షించాలని అన్నారు.

    "రాజస్థాన్ లో రాజకీయ పరిస్థితి రాష్ట్రపతి పాలన వైపు దారి తీసేలా ఉంది" అని అంటూ రాజస్థాన్ బీజేపీ నాయకుడు రాజేంద్ర రాథోడ్ ట్వీట్ చేశారు.

    "ముఖ్యమంత్రి గారు మీరు నాటకం ఎందుకు ఆడుతున్నారు? క్యాబినెట్ రాజీనామా చేసిన తర్వాత మీరు రాజీనామా చేయడంలో జాప్యం ఏంటి? మీరు కూడా రాజీనామా చేయండి" అని ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ప్రస్తుతం రాజస్థాన్ లో నెలకొన్న పరిస్థితి 2023లోనే ఎన్నికలు వచ్చేటట్లు అనిపించేలా ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.

    రాజస్థాన్ కాంగ్రెస్ లో రాజీనామాల రాజకీయం నడుస్తోందని ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ఇది కంచెలతో కూడిన ప్రభుత్వం" అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్వీట్ చేసారు.

    రాజస్థాన్ లో ఆదివారం కూడా రాజకీయ సంక్షోభం కొనసాగింది. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి ముందు అశోక్ గెహ్లోత్

    మద్దతుదారులు రాజీనామాలు సమర్పించేందుకు స్పీకర్ ఇంటికి చేరుకున్నారు.

    ప్రస్తుతం అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్ మధ్య రాష్ట్రంలో అధికారం కోసం జరుగుతున్న ఘర్షణ స్పష్టంగా కనిపిస్తోంది.

    గెహ్లోత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పోటీ చేస్తూ ఉండటంతో సచిన్ పైలట్ ను ముఖ్యమంత్రి చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ, కాంగ్రెస్ లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం పరిస్థితిని మార్చేసింది.

    సచిన్ పైలట్ మద్దతుదారులు ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టిన వర్గానికి చెందినవారినే ముఖ్యమంత్రిని చేయాలనిఅశోక్ గెహ్లోత్ వర్గం పట్టుబడుతోంది.

    కేవలం 10 - 15 మంది శాసనసభ్యుల మాటను మాత్రమే విన్నారని, మిగిలిన వారి అభిప్రాయాలను పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎం ఎల్ ఏ శాసన సభ్యుడు ప్రతాప్ సింగ్ కచారియవాస్ అన్నట్లు ఏఎన్ ఐ వార్తా సంస్థ తెలిపింది.

    "పార్టీ మా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటోంది" అని ఆయన అన్నారు.