కేసీఆర్ బిహార్ పర్యటన.. నేడు సీఎం నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్‌లతో భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం పట్నాలో పర్యటించనున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో సమావేశమై దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.
ఇదిలా ఉండగా, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ 'విపక్షాల ఐక్యతలో ఇది తాజా కామెడీ షో' అంటూ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ కూడా ఆర్జేడీలా అవినీతిలో కూరుకుపోయిన కుటుంబ పార్టీ అంటూ సుశీల్ మోదీ ట్విట్టర్‌లో విమర్శించారు.
మరోవైపు, ఈ ఇరువురి నేతల సమావేశాన్ని వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలుగా పరిగణిస్తున్నారు నిపుణులు.
కేసీఆర్ బిహార్ పర్యటన వివరాలు
తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన 12 మంది బిహార్ కూలీల కుటుంబాలను కేసీఆర్ పరామర్శించనున్నారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నారు. ఇ
ఇది కాకుండా, గల్వాన్ వ్యాలీలో చైనాతో జరిగిన హింసాత్మక ఘర్షణలో అమరులైన బిహార్ సైనికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలను అందజేయనున్నారు.
మధ్యాహ్నం పట్నా చేరుకుని, నేరుగా నితీశ్ కుమార్ నిర్వహిస్తున్న 'సీఎం డైలాగ్' కార్యక్రమానికి వెళతారు. అక్కడ బాధిత కుటుంబాలకు ఈ చెక్కులను అందిస్తారు.
తరువాత, నితీశ్ కుమార్‌తో కలిసి లంచ్ చేస్తారు. దాని తరువాత, ఈ ఇద్దరు నేతలు తేజస్వి యాదవ్‌తో సమావేశం కానున్నారు.
సాయంత్రం పట్నా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.