గౌతం అదానీ: ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో మూడవ వ్యక్తి

అదానీ గ్రూపు చైర్మన్ గౌతం అదానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో మూడవ స్థానానికి చేరారు. ఈ స్థానానికి చేరిన మొదటి ఆసియా వ్యక్తి కూడా ఆయనే.

లైవ్ కవరేజీ

  1. ఇరాక్: రాజధానిలో చెలరేగిన ఘర్షణల్లో కనీసం 15 మంది చనిపోయారు

    ఇరాక్

    ఫొటో సోర్స్, Getty Images

    ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో భద్రతా దళాలకు, శక్తిమంతమైన షియా మతపెద్దల మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారు.

    షియా నేత ముక్తాదా అల్-సదర్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత బాగ్దాద్‌లో హింస చెలరేగింది.

    ఇరాక్ రాజకీయ వ్యవస్థను సంస్కరించడానికి ప్రత్యర్థి షియా నాయకులు, పార్టీలు నిరాకరించడంతో ఆయన పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

    దాంతో, సదర్ మద్దతుదారులు నిరసనలకు దిగారు. నిరసనకారులు ఇరాక్ రాష్ట్రపతి భవనానంలోకి చొరబడ్డారు. ఈ ఘర్షణల్లో పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

    ఇరాక్

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    ప్రజలు శాంతి, సంయమనం పాటించాలని ఇరాక్ తాత్కాలిక ప్రధాని ముస్తఫా అల్-కజేమి కోరారు.

    ఇతర నగరాల్లో కూడా అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో సైన్యం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది.

    సోమవారం రాత్రి భద్రతా దళాలకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి.

    ఇరాక్‌లో అంతర్గత పోరు నేపథ్యంలో ఇరాన్ ఆ దేశంతో సరిహద్దులను మూసివేసింది.

    తమ దేశ పౌరులు వెంటనే ఇరాక్ విడిచిపెట్టాలని కువైట్ కోరింది.

    సదర్ మద్దతుదారులు 15 మంది తుపాకీ కాల్పులకు చనిపోయారని, సుమారు 350 మంది నిరసనకారులు గాయపడ్డారని డాక్టర్లు తెలిపినట్లు ఏఎఫ్‌పీ వెల్లడించింది.

  2. హైదరాబాద్: ఐకియా స్టోర్‌లో జాతివివక్షపై మండిపడ్డ కేటీఆర్

    కేటీఆర్

    ఫొటో సోర్స్, @TRS PARTY

    హైదరాబాదులోని ఐకియా స్టోర్‌ సిబ్బంది ప్రవర్తనపై కేటీఆర్ మండిపడ్డారు. కస్టమర్లతో గౌరవంగా ప్రవర్తించేలా వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు.

    హైదరాబాద్ ఐకియా షో రూంలో జాతివివక్ష చూపించారని నితిన్ సేతి అనే వ్యక్తి ఆరోపించారు. ఆ మేరకు, ఆగస్టు 28న ఒక ట్వీట్‌ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    మణిపూర్‌కు చెందిన తన భార్య కొన్న వస్తువులను మాత్రమే తనిఖీ చేశారని, అంతకుముందు ఎవరి వస్తువులూ తనిఖీ చేయలేదని నితిన్ ఆరోపించారు.

    తరువాత, స్టోర్ సూపర్‌వైజర్లు కూడా వచ్చి రేసిజంను సపోర్ట్ చేశారని, 'అంతర్జాతీయ స్టోర్'లో కూడా ఇలాంటి వివక్ష ఎదుర్కోవడం బాధకరమని నితిన్ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    తెలంగాణ మంత్రి కేటీఆర్, నితిన్ ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ, ఐకియా స్టోర్, బాధిత కస్టమర్లకు క్షమాపణ చెప్పాలని కోరారు. అలాగే, కస్టమర్లందరినీ సమానంగా చూస్తూ, వారితో గౌరవంగా, మర్యాదగా ప్రవర్తించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు.

  3. దిల్లీ అసెంబ్లీ బయట రాత్రంతా ధర్నాలు చేసిన ఆప్, బీజేపీ ఎమ్మెల్యేలు

    ఆప్, బీజేపీ

    ఫొటో సోర్స్, TWITTER/AAP

    దిల్లీలోని ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై రాజకీయాలు వేడెక్కాయి. సోమవారం రాత్రంతా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ ఎమ్మెల్యేలు దిల్లీ అసెంబ్లీ బయట ధర్నాలు చేశారు.

    దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు వ్యతిరేకంగా ఆప్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.

    మరోవైపు, దిల్లీ రాష్ట్ర మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు రాజీనామా చేయాలని బీజేపీ ఆందోళనకు దిగింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రూ.1400 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. దీనిపై విచారణ పూర్తయే వరకు ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది.

    ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్‌గా వినయ్ కుమార్ సక్సేనా కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఆప్ ఆరోపించింది.

    వినయ్ కుమార్ సక్సేనాపై సీబీఐ విచారణ, ఎఫ్‌ఐఆర్‌ వేయాలని ఆప్ ఎమ్మెల్యే ఆతిషి డిమాండ్ చేశారు.

  4. మథుర: షాహీ ఈద్గా మసీదు స్థలాన్ని సర్వే చేయాలనే పిటిషన్‌పై నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించిన అలహాబాద్ హైకోర్టు

    మథుర

    మథురలోని షాహీ ఈద్గా మసీదు వివాదాస్పద స్థలాన్ని సర్వే చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై నాలుగు నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని మథుర జిల్లా కోర్టును అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది.

    భగవాన్ శ్రీకృష్ణుడు, ఇతరుల తరుపున న్యాయమూర్తి పీయూష్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై జరిపిన విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసిందని పీటీఐ తెలిపింది.

    మథురలోని శ్రీ కృష్ణ జన్మభూమి మందిరాన్ని కుల్చేసి షాహీ ఈద్గా మసీదును కట్టారని ఆరోపిస్తూ, మసీదు పురావస్తు సర్వేను జరపాలని కోరుతూ గత ఏడాది జస్టిస్ పీయూష్ అగర్వాల్ మథుర జిల్లా కోర్టును ఆశ్రయించారు.

  5. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ లైవ్ పేజీని ఫాలో అవ్వండి.

  6. గౌతం అదానీ: ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో మూడవ వ్యక్తి

  7. గోర్బచెవ్ కథ ఎలా ముగిసింది, అమెరికాను సవాలు చేసిన అత్యంత శక్తిమంతమైన దేశం ఎలా పతనమైంది?