గౌతం అదానీ: ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో మూడవ వ్యక్తి
అదానీ గ్రూపు చైర్మన్ గౌతం అదానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో మూడవ స్థానానికి చేరారు. ఈ స్థానానికి చేరిన మొదటి ఆసియా వ్యక్తి కూడా ఆయనే.
లైవ్ కవరేజీ
అమెరికా డ్రోన్లు పాకిస్తాన్ గగనతలం నుంచి అఫ్గానిస్తాన్‌లోకి ప్రవేశిస్తున్నాయా?
మిఖాయిల్ గోర్బచెవ్: సోవియెట్ యూనియన్ చివరి అధినేత మృతి
నేటి లైవ్ పేజీ ముగిస్తున్నాం.. ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ తెలుగు న్యూస్ లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
మళ్లీ తాజా అప్‌డేట్లతో రేపు ఉదయం కలుద్దాం.
ధన్యవాదాలు!
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపై శశిథరూర్ ఏమన్నారంటే..
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తాను పోటీపడబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ నేత శశి థరూర్ స్పందించారు.
‘‘ప్రజలు వారికి నచ్చినట్లుగా ఊహించుకోవచ్చు. నేను రాసిన ఆర్టికల్‌లో పార్టీలో ఎన్నికలు నిర్వహించడం మంచి పరిణామమని మాత్రమే రాశాను. అది కాకుండా ఇంకెలాంటి వ్యాఖ్యలు చేయలేదు నేను’’ అని శశిథరూర్ చెప్పారంటూ ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అమలాపాల్: సన్నిహితంగా ఉన్న ఫొటోలను లీక్ చేస్తానని బెదిరిస్తున్నాడంటూ మాజీ ఫ్రెండ్‌పై హీరోయిన్ ఫిర్యాదు
గుజరాత్: 'నా భార్య, బావమరిది బలవంతంగా నాతో బీఫ్ తినిపించారు... అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా'
హైపర్ రియలిజమ్: అత్యంత వాస్తవికంగా కనిపించే ఇది పెయింటింగా.. ఫోటోనా
40 ఏళ్ల కిందట భార్యను చంపి మృతదేహాన్ని మాయం చేసిన టీచర్ చివరికి ఎలా దొరికిపోయాడంటే..
భారత్ చైనాకు దూరంగా జరిగి తైవాన్‌కు దగ్గర అవుతోందా?
'నాకు క్లీన్ చిట్ లభించినందుకు సంతోషంగా ఉంది, సత్యం గెలిచింది' మనీష్ సిసోడియా

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్‌పై సీబీఐ దాడి చేసింది. అయితే, "తన బ్యాంక్ లాకర్‌లో సీబీఐకి ఏమీ దొరకలేదని" మనీష్ తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో వసుంధర ప్రాంతంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులోని మనీష్ సిసోడియా లాకర్‌పై సీబీఐ బృందం దర్యాప్తు నిర్వహించింది.
దర్యాప్తు సమయానికి మనీష్ సిసోడియా కూడా ఆ బ్యాంకుకు చేరుకున్నారు.
అనంతరం, ఆయన విలేఖరులతో మాట్లాడుతూ,"సీబీఐకు మా ఇంట్లో ఏమీ దొరకనట్లే, నా బ్యాంకు లాకర్ నుంచి కూడా ఏమీ దొరకలేదు. నాకు క్లీన్ చిట్ లభించినందుకు సంతోషంగా ఉంది" అన్నారు.
సీబీఐ అధికారులు తనతో మర్యాదగా ప్రవర్తించారని, తాను కూడా వారికి సహకరించానని చెప్పారు.
"సత్యం గెలిచింది" అంటూ మనీష్ సిసోడియా హర్షం వ్యక్తం చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో మనీష్ సిసోడియాపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈ విచారణకు సిఫార్సు చేశారు.
ఇటీవల మనీష్ సిసోడియా ఇంటిపై కూడా సీబీఐ దాడులు చేసింది. అప్పటి నుంచి బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య రాజకీయ వేడి రగులుకుంది.
దిల్లీ రాష్ట్ర మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు రాజీనామా చేయాలని బీజేపీ ఆందోళనకు దిగింది.
దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రూ.1400 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. దీనిపై విచారణ పూర్తయే వరకు ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది.
సోమవారం రాత్రి ఇరు పార్టీల ఎమ్మెల్యేలు దిల్లీ అసెంబ్లీ ముందు ధర్నా చేశారు.
Olive oil: ‘గ్రీన్ గోల్డ్’గా భావించే ఈ నూనె ధర ఎందుకు విపరీతంగా పెరుగుతోంది?

కరవుకు బాగా ఎండిపోయిన ఆలివ్ పంట మధ్య నుంచి వెళ్తూ, వాడిపోయినట్లు కనిపిస్తున్న ఓ మొక్కను ఫ్రాంకోయిస్ ఎల్వీరా చూపించారు.
‘‘దానివైపు ఒకసారి చూడండి’’అని నిట్టూరుస్తూ ఆయన అన్నారు. ‘‘ఈ పాటికి ఇవి ఆలివ్‌లతో కళకళలాడుతూ ఉండాల్సిన మొక్కలు. కానీ, ఇప్పుడు ఇలా ఎండిపోయాయి. వచ్చే ఏడాది మార్కెట్‌లో ఆలివ్ నూనె అందించాల్సిన పంటి ఇది’’అని ఆయన చెప్పారు.
దక్షిణ స్పెయిన్‌లోని సారవంతమైన మైదానాల్లో ఎటుచూసినా ఆలివ్ చెట్లే కనిపిస్తాయి. ఆలివ్ ఆయిల్ ఉత్పత్తిలో స్పెయిన్‌ది మొదటి స్థానం. ప్రపంచ మార్కెట్లకు సగం ఆలివ్ ఆయిల్ ఇక్కడి నుంచే వెళ్తుంది.
నేపాల్: ‘‘భారత్‌లో ముస్లింల కంటే మా పరిస్థితి దారుణం’’అని మధేసీలు ఎందుకు అంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
‘‘మమ్మల్ని భారత్‌కే వెళ్లిపోవాలని తిడుతుంటారు. భారత్‌లో కూడా ఇలానే ముస్లింలను పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలని అంటారు. పాకిస్తాన్‌పై ద్వేషం నేడు భారత జాతీయవాదంలో భాగమైంది. అలానే ఇక్కడి నేపాలీ జాతీయవాదంలో మధేసీలపై ద్వేషం కనిపిస్తుంది.’’
గౌతం అదానీ: ప్రపంచంలోని అత్యంత సంపనుల్లో మూడవ వ్యక్తి

ఫొటో సోర్స్, ANI
అదానీ గ్రూపు చైర్మన్ గౌతం అదానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో మూడవ స్థానానికి చేరారు.
బ్లూంబర్గ్ విడుదల చేసిన బిలియనీర్ల జాబితాలో, ప్రముఖ ఫ్రెంచ్ ఫ్యాషన్ కంపెనీ లూయిస్ విటన్ చీఫ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను దాటుకుని అదానీ ముందుకు దూసుకుపోయారు.
బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం, 137.4 బిలియన్ డాలర్ల నికర ఆస్తితో అదానీ.. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వెనుకే ఉన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రిలయన్స్ అధిపతి ముఖేశ్ అంబానీ 91.9 బిలియన్ డాలర్ల నికర విలువతో 11వ స్థానంలో ఉన్నారు.
బ్లూంబర్గ్ సూచీలో మూడవ స్థానానికి చేరిన మొదటి ఆసియా వ్యక్తి అదానీ.
ఈ సూచీ ప్రకారం, ఎలాన్ మస్క్ ఆస్తి నికర విలువ 251 బిలియన్ డాలర్లు కాగా, జెఫ్ బేజోస్ ఆస్తి నికర విలువ 153 బిలియన్ డాలర్లు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గత అయిదేళ్లల్లో అదానీ గ్రూప్ విమానాశ్రయాలు, సిమెంట్, కాపర్, రిఫైనింగ్, డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్, పెట్రోకెమికల్ రిఫైనింగ్, రోడ్లు, సోలార్ సెల్ తయారీలో భారీగా పెట్టుబడులు పెట్టింది.
భారత్‌లో రిలయన్ ఇండస్త్రీస్, టాటా గ్రూపు తరువాత అదానీ గ్రూపు ప్రముఖ వ్యాపారసంస్థగా అవతరించింది.
చంద్రుడి మీదకు తొలి అడుగులు పడ్డాయిలా...
పాకిస్తాన్‌లో వరద బీభత్సం... తిండి కోసం తిప్పలు పడుతున్న జనం
'2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన అన్ని కేసులు క్లోజు' - సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన అన్ని కేసులను సుప్రీంకోర్టు మంగళవారం ముగించింది.
గుజరాత్ అల్లర్లకు సంబంధించి సుప్రీం కోర్టులో 10 పిటిషన్లు ఉన్నాయి. వాటిలో జాతీయ మానవ హక్కుల కమిషన్ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఒకటి.
ఈ వ్యవహారంలో కోర్టు ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసిందని, మొత్తం తొమ్మిది కేసుల్లో ఎనిమిది కేసుల విచారణ పూర్తయిందని, ఒక కేసులో వాదనలు చివరికొచ్చాయని చీఫ్ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్‌లు రవీంద్ర భట్, జేబీ పరదీవాలాతో కూడిన ధర్మాసనం తెలిపింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"కాలం గడిచేకొద్దీ కేసులు వ్యర్థంగా మారాయి. ఇకపై కోర్టు వాటిని విచారించాల్సిన అవసరం లేదు" అని సుప్రీంకోర్టు పేర్కొంది.
నరోడా అల్లర్ల కేసు విచారణ మాత్రమే పెండింగ్‌లో ఉందని సిట్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు.
నరోడా అల్లర్ల కేసును కూడా చట్టప్రకారం విచారిస్తామని, సిట్ తదనుగుణంగా చర్యలు తీసుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.
హార్దిక్ పాండ్యా స్టయిలే వేరు... జీవితాన్ని రాజాలా జీవించాలంటాడు
ఒక ఆదివాసీ తెగకు చెందిన ఆఖరి మనిషి... గత 26 ఏళ్ళు ఒంటరిగా బతికి చనిపోయాడు

ఫొటో సోర్స్, FUNAI
తనారు తెగకు చెందిన ఈ వ్యక్తి పేరేమిటో తెలియదు. ఏ భాషలో మాట్లాడతారో తెలియదు. గత 26 ఏళ్ళుగా ఒంటరిగా బతికాడు.
'మరణం దగ్గరపడిందన్న స్పృహతోనే ఆయన ముందుగానే తన మీద పక్షి ఈకలు కప్పుకుని ఉండవచ్చు.'
కేటీఆర్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మధ్య ట్విట్టర్‌లో మాటల యుద్ధం

ఫొటో సోర్స్, ANI, FACEBOOK/KTR
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్‌లో మాటల యుద్ధం చోటుచేసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీకి కూడా ప్రధాని మోదీ అనుమతి ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు.
"మన ప్రధాని మోదీ తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలు మంజూరు చేసారో ఇప్పుడు మీకు చెబుతాను.. సున్న" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దీనికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమాధానమిస్తూ, తెలంగాణలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఎలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదన్నారు. "మీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం ఎన్ని ప్రతిపాదనలు పంపింది?.. సున్న" అంటూ ట్వీట్ చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అయితే, విషయం అక్కడితో ఆగిపోలేదు. మాండవీయ ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ, "జవాబు ఇచ్చేముందు ఒకసారి అధికారిక పత్రాలను పరిశీలిస్తే బావుండేది. 2015, 2019లలో తెలంగాణ ఆరోగ్య మంత్రుల అభ్యర్థనలకు మీకు ముందున్న (కేంద్ర) ఆరోగ్య శాఖ మంత్రులు ఇచ్చిన జవాబులు ఇవి" అంటూ ఆ లేఖలను పోస్ట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కాలేజీ కోసం అభ్యర్థిస్తూనే ఉందని, అందుకు మీ ప్రభుత్వం ఏమీ చేయలేదని కేటీఆర్ అన్నారు.
అందుకు మాండవీయ, ఆ పత్రాల్లోని మూడవ పారాను హైలైట్ చేస్తూ, "ప్రాజెక్ట్ రిపోర్ట్ వివరాలతో పాటు అధికారిక ప్రతిపాదన పంపాలని కేంద్రం ఎప్పటినుంచో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నదని" అన్నారు. సాధారణ లేఖకు, అధికారిక ప్రతిపాదనకు మధ్య వ్యత్యాసం ఉందన్నారు.
