IndiaVsPakistan: గెలిచిన భారత్.. చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు
దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ 2022 క్రికెట్ టోర్నమెంటులో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం సాయంత్రం జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు, పాకిస్తాన్ ఇచ్చిన 148 పరుగుల టార్గెట్‌ను 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
లైవ్ కవరేజీ
ఇండియా, పాకిస్తాన్.. రెండు జట్లకూ ఆడిన క్రికెటర్
అపోలో: ఈ ఫొటోలు చూస్తే మీకు కూడా చంద్రుడిపైకి వెళ్లిన ఫీల్ కలుగుతుంది
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత: దుమ్ము, ధూళి స్థాయిలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాలు
నోయిడాలో సూపర్‌టెక్ నిర్మాణ సంస్థ నిర్మించిన రెండు భారీ ఆకాశహర్మ్యాలను నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు కూల్చివేయనున్నారు.
కూల్చివేత సందర్భంగా భారీ ఎత్తున ధూళి మేఘం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.
భవనాలను కూల్చివేసిన తర్వాత అక్కడి కాలుష్య స్థాయిలను, దుమ్మును పర్యవేక్షించడానికి ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేశారు.
‘అపెక్స్’, ‘సియానే’ అనే పేర్లున్న ఈ ట్విన్ టవర్స్‌ను పడగొట్టేందుకు 3700 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారు.
కూల్చివేత వల్ల నేలపై నుంచి 984 అడుగుల ఎత్తులో భారీ ధూళి మేఘం ఏర్పడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ధోని ఎత్తుకున్న పిల్లాడు ఎవరు? గంగూలీకి ముషారఫ్ ఎందుకు ఫోన్ చేశారు
దుబయ్‌కి చేరిన రాహుల్ ద్రవిడ్

ఫొటో సోర్స్, Getty Images
కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆసియా కప్-2022 టోర్నీకి దూరం అవుతారనున్న టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆదివారం దుబయ్‌కు చేరుకున్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.
కరోనా నెగెటివ్‌గా తేలడంతో ఆయన దుబయ్‌కి వెళ్లి భారత జట్టుతో కలిసినట్లు తెలిపింది.
ఆసియా కప్‌లో భాగంగా నేడు రాత్రి 7: 30 గంటల నుంచి భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నోయిడా జంట భవనాల కూల్చివేతకు అంతా సిద్ధం

ఫొటో సోర్స్, Getty Images
నోయిడాలో సూపర్‌టెక్ నిర్మాణ సంస్థ నిర్మించిన రెండు బహుళ అంతస్థుల భవనాలను ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు కూల్చివేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు.
మొత్తం 560 మంది పోలీసులు, రిజర్వ్ బలగాలకు చెందిన 100 మందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, 4 క్విక్ రెస్పాన్స్ బృందాలను మోహరించినట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ భవనాల కూల్చివేత సందర్భంగా మధ్యాహ్నం 2: 15 నిమిషాలకు నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వేను మూసివేస్తామని వార్తా ఏజెన్సీ ఏఎన్‌ఐతో డీసీపీ సెంట్రల్ రాజేశ్ చెప్పారు.
కూల్చివేత పూర్తయిన అరగంట తర్వాత మళ్లీ ఎక్స్‌ప్రెస్ వేను తెరుస్తామని తెలిపారు.
నోయిడా సెక్టార్ 93ఎలో ఉన్న ఈ ట్విన్ టవర్స్‌ను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేస్తున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ లైవ్ పేజీని ఫాలో అవ్వండి.
IndiaVsPakistan: గెలిచిన భారత్.. చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు