'మనీష్ సిసోడియాను ఇంకో రెండు మూడు రోజుల్లో అరెస్టు చేయవచ్చనిపిస్తోంది'- అరవింద్ కేజ్రీవాల్
గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు పెరుగుతోందని, ఈ అంశమే మనీష్ సిసోడియాను అరెస్టు చేసేందుకు సీబీఐపై ఒత్తిడి చేస్తోందని అన్నారు.
లైవ్ కవరేజీ
ట్రిపుల్ తలాక్ నిషేధం: ‘ఇప్పుడు విడాకులు ఇవ్వకుండానే వదిలేస్తున్నారు’ - కనీస హక్కులూ కోల్పోతున్న ముస్లిం మహిళలు
ఇవీ ఈనాటి ముఖ్యాంశాలు..
స్థానికం
- మహమ్మద్ ప్రవక్త మీద అవమానకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగం మీద గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ, రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
- మహమ్మద్ ప్రవక్తపై రాజా సింగ్ ఉద్దేశపూర్వకంగానే అనుచిత వ్యాఖ్యలు చేశారని, ముస్లింలను దెబ్బతీయడానికి, వారిని రెచ్చగొట్టేందుకు బీజేపీ ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
- పోలీసులు, రాజా సింగ్ రిమాండ్ అప్లికేషన్‌లో 41 సీఆర్‌పీసీ నిబంధనలు పాటించలేదని ఆయన తరపు న్యాయవాదులు వాదించడంతో కోర్టు రిమాండ్ అప్లికేషన్‌ను తిరస్కరించినట్లు రాజసింగ్ తరఫు న్యాయవాది కరుణా సాగర్ బీబీసీకి వివరించారు.
జాతీయం
- గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు పెరుగుతున్న కారణంగానే మనీష్ సిసోడియాను టార్గెట్ చేస్తున్నారని, మరో రెండు, మూడు రోజుల్లో ఆయన్ను అరెస్ట్ చేయవచ్చనిపిస్తోందన్నారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
- బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం శిక్ష మాఫీ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
- ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ బుద్ధ నగర్‌లో అక్రమంగా నివసిస్తున్న 15 మంది చైనా పౌరులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
- బీజేపీ నేత, సినీ నటి సోనాలి ఫోగట్ గుండెపోటుతో చనిపోయారు. ఆమె తన సిబ్బందిలో కొందరితో కలిసి గోవా వెళ్లారని, అక్కడ చనిపోయారని వార్తలు వచ్చాయి.
అంతర్జాతీయం
- మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఒక బీజేపీ నేత మీద ఆత్మాహుతి దాడి చేయటానికి ఐసిస్ ప్రత్యేక శిక్షణ ఇచ్చిన తీవ్రవాదిని అరెస్ట్ చేసినట్లు రష్యా గూఢచార సంస్థ చెప్పింది.
- ఇటీవల తన నివాసంలో ఎఫ్‌బీఐ ఆకస్మిక సోదాలు చేసి స్వాధీనం చేసుకున్న ఫైళ్ల మీద న్యాయశాఖ దర్యాప్తును ఆపాలంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఫ్లోరిడా కోర్టులో కేసు వేశారు.
ఇంతటితో ఈ లైవ్ పేజీని ముగిస్తున్నాం. రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
ముఖ్యమైన కథనాలకు, విశ్లేషణలకు బీబీసీ తెలుగు పేజీ చూడండి.
సోనాలీ ఫోగట్: టిక్‌టాక్ స్టార్ నుంచి గోవాలో అనుమానాస్పద మరణం వరకు...ఆమె జీవితంలో ఎన్ని మలుపులో...
రాజాసింగ్‌కు కోర్టు రిమాండ్ ఎందుకు తిరస్కరించింది, ఆయన లాయర్ ఏం చెప్పారు ?

ఫొటో సోర్స్, UGC
ఫొటో క్యాప్షన్, రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారన్న ఆరోపణలపై పోలీసులు గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
అయితే, రాజాసింగ్‌ను రిమాండ్‌కు ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టులో తాము ఎలా వాదనలు వినిపించామో రాజసింగ్ తరఫు న్యాయవాది కరుణా సాగర్ బీబీసీకి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్ మీద పెట్టిన అన్ని సెక్షన్లు కూడా ఏడేళ్లలోపు పనిష్మెంట్ ఉన్న సెక్షన్లు. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన 41 సీఆర్‌పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్)గైడ్ లైన్స్‌ను ఉల్లంఘిస్తూ పోలీసులు ఆయనను రిమాండ్ కోరారు. ఈ రిమాండ్ అప్లికేషన్‌లో 41 సీఆర్‌పీసీ నిబంధనలు పాటించలేదని మేం కోర్టు ముందు వాదించాం. మా ఆర్గ్యుమెంట్ విన్న కోర్టు రిమాండ్ అప్లికేషన్‌ను తిరస్కరిస్తూ, వెంటనే రాజాసింగ్‌ను రిలీజ్ చేయాల్సిందిగా ఆదేశించింది. కేవలం 20 వేల రూపాయల వ్యక్తిగత పూచికత్తును మాత్రమే సమర్పించాలని కోరింది. పూచికత్తు ఇవ్వడంతో ఆయనను రిలీజ్ చేశారు’’ అని కరుణా సాగర్ వెల్లడించారు.
మిగతా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల గురించి బీబీసీ ప్రశ్నించినప్పుడు
‘‘ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో పేర్కొన్న ఎఫ్ఐఆర్‌లలోని సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్షార్హమైనవే కాబట్టి వారు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం 41 సీఆర్‌పీసీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందే. వాటిని కాదనే అధికారం, వివక్ష చూపే అవకాశం పోలీసులకు ఉండదు. 41 సీఆర్‌పీసీ ప్రకారం ముందుగా ఆయనకు నోటిసు ఇవ్వాల్సిందే’’ అని కరుణా సాగర్ అన్నారు.
మరి యూట్యూబ్, సోషల్ మీడియాలలో రాజాసింగ్ పెట్టిన వీడియోలు అభ్యంతరకరంగా ఉన్నాయని కోర్టు ఏమైనా గుర్తించిందా అని బీబీసీ ప్రశ్నించినప్పుడు...
‘‘కోర్టు కేవలం సాంకేతిక అంశాలు అంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, 41 సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారం రిమాండ్ పిటిషన్ ఉందా లేదా అన్నది మాత్రమే చూస్తుంది. ఇతర విషయాలపై కోర్టు ఇప్పుడు నిర్ణయం తీసుకోదు. పోలీసులు సరైన ప్రొసీజర్‌ను పాటించారా లేదా అన్నది మాత్రమే కోర్టు చూస్తుంది’’ అని కరుణా సాగర్ వివరించారు.
కస్తూర్బా గాంధీ: చదవడం, రాయడం తెలియని ఆమె డైరీ ఎలా రాశారు, మునిమనవడు తుషార్ గాంధీ దీనిపై ఏమన్నారు?
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా రారా? వస్తే బీజేపీలో చేరతారా లేదా - అభిప్రాయం
ఎన్‌డీటీవీ షేర్లు కొనబోతున్న అదానీ గ్రూప్

ఫొటో సోర్స్, SAM PANTHAKY/AFP/GETTY IMAGES
ఫొటో క్యాప్షన్, గౌతమ్ అదానీ అదానీ గ్రూపు ఎన్‌డీటీవీ మీడియా సంస్థలో 29.18 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఏఎన్ఐ తెలిపింది.
ఆసియాలో అత్యంత ధనవంతులైన వారిలో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ ఒకరు.
ఈ ఏడాది ఫిబ్రవరి 8 నాటికి గౌతమ్ అదానీ మొత్తం సంపద విలువ 88.5 బిలియన్ డాలర్లకు చేరింది.
ఫిబ్రవరి 8న బ్లూంబర్గ్ బిజినెస్ ఇండెక్స్ జాబితాలో గౌతమ్ అదానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీని మించిపోయారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇంటి సరుకుల నుంచి, బొగ్గు గనులు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడ రేవులు, విద్యుత్ ఉత్పత్తి వరకూ గౌతమ్ అదానీకి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి.
మోచేతి గాయం కారణంగా యూఎస్ ఓపెన్ 2022 నుంచి వైదొలగిన సానియా మీర్జా

ఫొటో సోర్స్, Getty Images
యూఎస్ ఓపెన్ 2022 నుంచి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వైదొలిగారు. మోచేతి గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమెతెలిపారు.
"రెండు వారాల క్రితం కెనడాలో ఆడుతుండగా మోచేతికి గాయమైంది. నిన్న స్కాన్ చేయించుకునే వరకు గాయం ఇంత తీవ్రంగా ఉందని తెలియలేదు. నేను కొన్ని వారాల పాటు ఆడలేను. అందుకే యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగాను. టైం బాలేదు. నా రిటైర్మెంట్ ప్రణాళికలో కూడా కొన్ని మార్పులు రావచ్చు. త్వరలో మీకు తెలియజేస్తాను" అంటూ సానియా ఇన్స్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, instagram/sania mirza
సానియా మీర్జా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఓడిపోయిన తరువాత, 2022 చివరిలో టెన్నిస్ నుంచి రిటైర్ అవుతానని ప్రకటించారు.
ఇప్పుడు తన రిటైర్‌మెంట్ ప్లాన్‌లో మార్పు ఉంటుందని చెప్పారు. మరో పెద్ద మ్యాచ్ ఆడిన తరువాత ఆమె రిటైర్ అయే అవకాశం ఉంది.
'బీజేపీ కావాలనే ఎప్పటికప్పుడు ముస్లింలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది' - అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ, బీజేపీ ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఇది నిరంతరం సాగుతోందని ఒవైసీ అన్నారు.
"దీనిని అనుకోకుండా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అనలేం. బీజేపీ ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మ కూడా ప్రవక్త మొహమ్మద్‌కు అవాకులు చవాకులు పేలారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ ఎమ్మెల్యే అలాంటి అనుచిత వ్యాఖ్యలే చేశారు. దీన్ని బట్టి బీజేపీ మహమ్మద్ ప్రవక్తను, ముస్లింలను ద్వేషిస్తోందని స్పష్టమవుతోంది. ముస్లింలను దెబ్బతీయడానికి, వారిని రెచ్చగొట్టేందుకు బీజేపీ ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తోంది" అని ఒవైసీ అన్నారు.
"బీజేపీ, భారతదేశపు సాంఘిక నిర్మాణాన్ని కూలదోయాలని చూస్తోందా?" అని ఆయన ప్రశ్నించారు.
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. ఆయనకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసి 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
రాజా సింగ్ ఓ వీడియో విడుదల చేస్తూ మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దాంతో, ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
రాజాసింగ్...వీడియో నుంచి అరెస్ట్, పార్టీ సస్పెన్షన్, కోర్టు వరకు - ఈ మూడు రోజుల్లో ఏం జరిగింది ?
'మనీష్ సిసోడియాను ఇంకో రెండు మూడు రోజుల్లో అరెస్టు చేయవచ్చనిపిస్తోంది'- అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, @AamAadmiParty
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగించారు. గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు పెరుగుతోందని చెబుతూ, ఈ అంశం మనీష్ సిసోడియాను అరెస్టు చేసేందుకు సీబీఐపై ఒత్తిడి తెస్తుందని అన్నారు.
"మరో పది రోజుల్లో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఇంకో రెండు మూడు రోజుల్లోనే అరెస్ట్ చేస్తారనిపిస్తోంది" అన్నారు కేజ్రీవాల్.
దీనితో పాటు గుజరాత్‌లో పేపర్ లీక్ అంశాన్ని అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తారు. దేశంలో క్రాకర్లు కన్నా ఎక్కువగా గుజరాత్‌లో పేపర్ పేలిపోతోందన్నారు.

ఫొటో సోర్స్, ANI
దిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా కూడా ఇదే మాట అన్నారు. గుజరాత్‌లో ఆప్‌కు ఆదరణ పెరుగుతుండడంతో బీజేపీ తనను టార్గెట్ చేస్తోందన్నారు.
మనీష్ సిసోడియాపై దిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీబీఐ విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించి శుక్రవారం మనీష్ సిసోడియా నివాసంపై సీబీఐ దాడులు చేసింది. మనీష్ సిసోడియా సహా 15 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
కల్వకుంట్ల కవిత : దిల్లీ మద్యం విధానంపై వివాదంలో కేసీఆర్ కుమార్తె పేరెందుకు వినిపిస్తోంది?
బ్రేకింగ్ న్యూస్, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన బీజేపీ
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ ను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ఈ వ్యాఖ్యల కారణంగా పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కూడా బీజేపీ రాజాసింగ్ కు షోకాజ్ నోటీస్ పంపినట్లు ఏఎన్ఐ తెలిపింది.
ఈ వ్యాఖ్యలపై కేసు నమోదు కావడంతో ఆయనను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలను సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను పరీశీలించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images
బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం శిక్ష మాఫీ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది.
నేరస్థులను ఆగస్టు 15న విడుదల చేసిన విషయం తెలిసిందే. వీరి విడుదలను వ్యతిరేకిస్తూ సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్, న్యాయవాది అపర్ణా భట్‌లు చేసిన వాదనలను ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"వారికి శిక్ష మాఫీ చేయడాన్ని మేం సవాలు చేస్తున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాలను కాదు. సుప్రీంకోర్టు ఆదేశాలతో మాకు ఇబ్బంది లేదు. శిక్ష మాఫీకి దారి తీసిన నియమాలనే మేం సవాలు చేస్తున్నాం" అని సిబల్ చెప్పారు.
సొంత ఇంటిని అమ్మేసి అనాథల కోసం స్కూల్ నడుపుతున్నారు
గురుగ్రహం: జూపిటర్ అద్భుత చిత్రాలను పంపించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK
ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన అంతరిక్ష టెలిస్కోప్ జేమ్స్ బెబ్.. గురుగ్రహాన్ని మునుపెన్నడూ చూడనంత వివరంగా ఫొటోలు తీసి పంపించింది.
సౌర కుటుంబంలోని అతి పెద్ద గ్రహం గురు గ్రహం (జూపిటర్). ఈ గ్రహానని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ జూలైలో ఫొటోలు తీసింది.
జూపిటర్ చుట్టూ ఉన్న అరోరాలు, భారీ తుఫానులు, ఉపగ్రహాలు, వలయాలను జూపిటర్ అత్యంత సవివరంగా బంధించి పంపిన ఫొటోలు ‘అద్భుతం’గా ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు.
ఇన్ఫ్రారెడ్ ఫొటోగ్రాఫ్‌లను కృత్రిమంగా రంగుల్లోకి మార్చారు. తద్వారా చిత్రంలోని అంశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇన్ఫ్రారెడ్ వెలుగు మనిషి కళ్లకు కనిపించదు.
‘‘జూపిటర్‌ను ఇలా మేం మునుపెన్నడూ చూడలేదు. ఇంత అద్భుతంగా ఉంటుందని మేం ఎన్నడూ అనుకోలేదు’’ అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త ఇమ్కే డి పేటర్ చెప్పారు.
గురుగ్రహం మీద ‘గ్రేట్ రెడ్ స్పాట్’గా వ్యవహరించే భారీ తుపాను ఈ ఫొటోలో తెలుపు రంగులో కనిపించింది. ఆ తుఫాను సూర్యుడి వెలుతురును చాలా ఎక్కువగా ప్రతిఫలించటమే దీనికి కారణమని నాసా చెప్పింది.
ఈ తుఫాను ఎంత పెద్దదంటే.. భూగ్రహాన్ని కూడా మింగేసేంతటి పెద్ద తుఫాను అది.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ను 2021 డిసెంబర్‌లో అంతరిక్షంలోకి పంపించారు. ఇది ప్రస్తుతం భూమికి 16 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది.
Cost of living: ధరల పెరుగుదలతో ఆంధ్రప్రదేశ్‌లోని చిరు వ్యాపారులపై ఎలాంటి ప్రభావం పడుతోంది
నోయిడాలో అక్రమంగా నివసిస్తున్న 15 మంది చైనీయులు అరెస్ట్

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ బుద్ధ నగర్‌లో అక్రమంగా నివసిస్తున్న 15 మంది చైనా పౌరులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. అక్కడి నుంచి వారి స్వదేశానికి పంపిస్తారు.
అరెస్ట్ చేసిన 15 మంది చైనీయుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
ఈ 15 మంది చైనీయులు వారి వీసా గడువు ముగిసిపోయినా కూడా భారతదేశంలో నివసిస్తున్నారని పోలీస్ అధికార ప్రతినిధి పంకజ్ కుమార్ చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
గ్రేటర్ నోయిడాలో అక్రమంగా నివసిస్తున్న ఒక చైనా వ్యక్తిని పోలీసులు ఈ ఏడాది జూన్‌లో అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తికి హవాలా సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
అనంతరం ఈ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించటానికి నోయిడా పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రష్యాలో ఐసిస్ తీవ్రవాది అరెస్ట్.. ‘భారత్‌లో బీజేపీ నేత మీద ఆత్మాహుతి దాడికి కుట్ర’

ఫొటో సోర్స్, Getty Images
మధ్య ఆసియా దేశానికి చెందిన ఒక ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదిని తాము అరెస్ట్ చేసినట్లు రష్యా గూఢచార సంస్థ ఎఫ్ఎస్‌బీ తెలిపింది.
మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారత అధికార పార్టీ నేత ఒకరి మీద ఆత్మాహుతి దాడి చేయటానికి ఈ తీవ్రవాదికి ఐఎస్ ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు ఎఫ్ఎస్‌బీ చెప్పింది.
ఈ వ్యక్తి టర్కీలో ఐసిస్ ప్రతినిధి ఒకరిని కలిసి తీవ్రవాదిగా మారాడని ఎఫ్ఎస్‌బీ చెప్పినట్లు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ పేర్కొంది.
అక్కడి నుంచి ఈ అనుమానిత తీవ్రవాదిని రష్యా వెళ్లాలని నిర్దేశించారని, రష్యాలో అవసరమైన పత్రాలు సంపాదించి భారతదేశానికి వెళ్లి సదరు బీజేపీ నేత మీద ఆత్మాహుతి దాడి చేయాలన్నది తమ ప్రణాళికగా నిందితుడు వెల్లడించినట్లు ఎఫ్ఎస్‌బీ చెప్పింది.
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, దాని మీద ఇస్లామిక్ ప్రపంచం తీవ్ర నిరసన తెలపటం జరిగింది. ఈ వివాదం ముదరటంతో నుపూర్ శర్మను, పార్టీ మరో నేత నవీన్ జిందాల్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది.
