‘దిల్లీ లిక్కర్ పాలసీతో నాకెలాంటి సంబంధం లేదు’ - టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

లిక్కర్ స్కామ్ పేరుతో బీజేపీ నేతలు తమ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కవిత ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని కల్వకుంట్ల కవిత అన్నారు

లైవ్ కవరేజీ

  1. రిషి సునాక్: పన్ను తగ్గింపు సాధ్యం కాదంటూ లిజ్ ట్రస్ ఆర్థిక ప్రణాళికలపై విమర్శలు

    రిషి సునాక్

    ఫొటో సోర్స్, JONATHAN HORDLE/ITV/PA WIRE

    లిజ్ ట్రస్ ఆర్థిక ప్రణాళికలను రిషి సునాక్ విమర్శించారు. పన్ను తగ్గింపులను, పెరుగుతున్న ఇంధన బిల్లులకు సహాయ ప్యాకేజీని ఏకకాలంలో అందించలేమని రిషి సునాక్ అన్నారు. ఇందుకోసం భారీగా రుణాలు తీసుకోవలసి వస్తుందని, దాని వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని విమర్శించారు.

    లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధాని అయితే, అత్యవసర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వస్తే ఎలాంటి ప్రణాళికను రూపొందిస్తారనే అంశంపై డిబేట్ సందర్భంగా రిషి సునాక్ ఆ వ్యాఖ్యలు చేశారు.

    కాస్ట్ ఆఫ్ లివింగ్ సమస్యను పరిష్కరించడానికి "తక్షణ చర్యలు" అవసరమని లిజ్ ట్రస్ టీం అభిప్రాయపడింది.

    యూకేలో ఎన్నికల ప్రక్రియ జూలైలో ప్రారంభమైంది. బోరిస్ జాన్సన్ రాజీనామాతో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి, బ్రిటన్ ప్రధానమంత్రి అభ్యర్ధిత్వానికి పోటీ మొదలైంది.

    టోరీ ఓటింగ్ ప్రక్రియలో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ముందంజలో ఉన్నారు. పోటీలో భాగంగా అభ్యర్థుల మధ్య టీవీ డిబేట్లు అవుతున్నాయి.

    ఎన్నికల తుది ఫలితాలను సెప్టెంబర్ 5న ప్రకటిస్తారు.