దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా 15 మందిపై సీబీఐ కేసు నమోదు
దిల్లీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మనిష్ సిసోడియా నివాసంతో పాటు.. ఏడు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో సీబీఐ శుక్రవారం నాడు ఆకస్మిక సోదాలు నిర్వహించింది.
లైవ్ కవరేజీ
కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి - వై ఎస్ జగన్

ఫొటో సోర్స్, YSRCP/FB
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"కర్తవ్యదీక్షను జీవనసూత్రంగా తెలిపిన గీతాచార్యుడు శ్రీకృష్ణుడు. ప్రేమ, స్నేహం, ధర్మాచరణ ఆయన బోధించిన పాఠాలు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు" అని ఆయన ట్వీట్ చేశారు.
డ్రోన్ కేసుకు సంబంధించి జమ్మూ కశ్మీర్‌లో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ
జమ్మూ కశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జరిగిన డ్రోన్ దాడులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) జమ్మూ కశ్మీర్‌లోని ఐదు జిల్లాల్లో 8 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది.
ఈ మేరకు ఎన్‌ఐఏ ఒక ట్వీట్ ద్వారా సమాచారాన్ని అందించింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"ది రెసిస్టన్స్ ఫ్రంట్" (టీఆర్‌ఎఫ్) డ్రోన్ల ద్వారా ఆయుధాలు, పేలుడు సామాగ్రిని పై నుంచి జారవిడిచినట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. టీఆర్‌ఎఫ్ కు లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయని ఎన్‌ఐఏ పేర్కొంది.
"ఈ సోదాల్లో నేరానికి పాల్పడినట్లు నిరూపించే సమాచారం, డిజిటల్ పరికరాలు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారని ఎన్‌ఐఏ చెప్పింది" అని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
టీఆర్‌ఎఫ్ సభ్యులు లష్కరే తోయిబా పాకిస్తాన్ విభాగంతో నిరంతరం సంబంధాలను నిర్వహిస్తూ అంతర్జాతీయ సరిహద్దు దగ్గర సాంబా సెక్టర్‌లో డ్రోన్ల ద్వారాఆయుధాలు, పేలుడు సామాగ్రిని పొందుతున్నట్లు ఎన్‌ఐఏ చెప్పింది. టీఆర్‌ఎఫ్ సభ్యులు కశ్మీర్‌లో తీవ్రవాద దాడులను నిర్వహించేందుకుఈ ఆయుధాలను వాడుతున్నట్లు చెప్పారు.
ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతున్నట్లు తెలిపింది.
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రానుందా? సోషల్ మీడియాలో చర్చ ఎందుకు మొదలైంది
"జాఫోరిజియాకు జరిగే ఎటువంటి హాని అయినా ఆత్మహత్య లాంటిదే" - యూఎన్ చీఫ్

ఫొటో సోర్స్, Getty Images
"దక్షిణ యుక్రెయిన్ లో జాఫోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర జరుగుతున్న దాడుల గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నాను" అని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అన్నారు.
లీయెవ్ లో యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియెన్‌స్కీ, టర్కీ నాయకుడు ఎర్దవాన్‌తో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"జాఫోరిజియాకు జరిగే ఎటువంటి హాని అయినా ఆత్మహత్య లాంటిదే" అని ఆయన హెచ్చరించారు.
గుటెరెస్ చేసిన వ్యాఖ్యలను ఎర్దవాన్ కూడా సమర్ధించారు. జాఫోరిజియా ప్లాంటు దగ్గర చోటు చేసుకుంటున్న దాడులతో మరో 'చెర్నోబిల్ విపత్తు" తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు.
గత కొన్ని వారాలుగా జాఫోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర ఆయుధ దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఈ దాడులకు కారణం మీరంటే మీరేనంటూ మాస్కో, యుక్రెయిన్ ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.
న్యూయార్క్ టైమ్స్ కథనమే సీబీఐ సోదాలకు కారణం - అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, ANI
దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటి పై సీబీఐ సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం పై మాటల దాడికి దిగారు.
"ప్రపంచమంతా దిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్య, ఆరోగ్య మోడల్ గురించి చర్చిస్తుంటే, దీనిని కేంద్ర ప్రభుత్వం నియంత్రించాలని చూస్తోంది. అందుకే అరెస్టులు, సోదాలు నిర్వహిస్తున్నారు" అని అంటూ ట్వీట్ చేశారు.
"దిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఎడ్యుకేషన్ మోడల్ గురించి ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ లో కథనం వచ్చిన రోజు నాడే కేంద్రం మనీష్ ఇంటికి సీబీఐని పంపింది" అని ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, ANI
సీబీఐ విచారణలతో ఉన్న భయం వల్లే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా దిల్లీలో అనుసరిస్తున్న ఎడ్యుకేషన్ మోడల్ గురించి మాట్లాడుతూ ట్వీట్ చేశారు" అని కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు అనురాగ్ ఠాకూర్ అన్నారు.
"ఇది విద్య గురించి కాదు. ఆల్కహాల్ గురించి. సత్యేంద్ర జైన్ జైలుకు వెళ్లారు. కానీ, ఆయనను పదవి నుంచి తప్పించలేదు. ఆయన అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఆయన రాజకీయాల్లోకి రానంటూ రాజకీయాల్లోకి రావడం మాత్రమే కాకుండా అవినీతికి కూడా పాల్పడ్డారు. దిల్లీ లో చోటు చేసుకున్న మద్యం కాంట్రాక్టుల్లో అవినీతి చోటు చేసుకుంది. ప్రజలు ఫూల్స్ కాదు. దేశానికి సందేశం ఇవ్వడం ఆపండి" అని అనురాగ్ ఠాకూర్ ఏఎన్ ఐ వార్తా సంస్థతో అన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న - ఫిన్‌లాండ్ ప్రధాని సనా మారిన్ డాన్స్ వీడియో

ఫొటో సోర్స్, TWITTER
ఫిన్‌లాండ్ ప్రధాన మంత్రి సనా మారిన్ పార్టీ చేసుకుంటున్నట్లుగా ఉన్న వీడియో లీక్ అవ్వడంతో ఆమె తీవ్ర ప్రతిఘటన ఎదుర్కుంటున్నారు.
సోషల్ మీడియా నుంచి సేకరించిన ఈ వీడియోలో ఆమె స్నేహితులు, కొంత మంది సెలబ్రిటీలతో కలిసి పాటలు పాడుతూ డాన్స్ చేస్తున్నారు.
ఈ మేరకు ఆమె ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమె డ్రగ్ పరీక్షలు చేయించుకోవాలని మరొక నాయకుడు డిమాండ్ చేశారు.
అయితే, 36 ఏళ్ల సనా మారిన్ మాత్రం ఆమె మాదక ద్రవ్యాలు తీసుకోలేదని చెప్పారు.
ఆమె "ప్రపంచంలోనే కూలెస్ట్ ప్రైమ్ మినిస్టర్" అని గత వారంలో జర్మనీ వార్తా సంస్థ బిల్డ్ పేర్కొంది.
ఈ వీడియోను షూట్ చేస్తున్నట్లు తెలుసు కానీ, దానిని బహిరంగంగా విడుదల చేస్తారని ఊహించలేదని అన్నారు.
"నేను డాన్స్ చేశాను. పాటలు పాడాను. పార్టీ చేసుకున్నాను. ఇవన్నీ చట్టబద్ధమైన పనులే. మాదక ద్రవ్యాలను తీసుకుంటున్న వారిని, లేదా ఎలా తీసుకోవాలో తెలిసిన వారిని కూడా నేనెప్పుడూ చూడలేదు" అని ఆమె అన్నారు.
దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు

ఫొటో సోర్స్, ANI
దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు సీబీఐ చేరినట్లు ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు.
"దేశంలో మెరుగైన పని చేస్తున్నవారిని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అన్నిటి కంటే దౌర్భాగ్యమైన పని.ఇలాంటి చర్యల వల్లే దేశం నంబర్ 1 కాలేకపోతోంది".
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"సీబీఐ విచారణను స్వాగతిస్తున్నాం. నిజం త్వరగా బయటకు వచ్చేందుకు చేసేందుకు పూర్తి సహకారం అందిస్తాం.ఇప్పటి వరకు నా పై చేసిన ఆరోపణలేవీ నిరూపణ అవ్వలేదు. ఈ కేసులో కూడా ఏమీ జరగదు. దేశంలో ఉత్తమమైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలనే మా సంకల్పాన్ని ఎవరూ ఆపలేరు".
దిల్లీ ప్రభుత్వం చేపడుతున్న విద్య, ఆరోగ్య కార్యక్రమాలతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందుకే దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రిని అరెస్టు చేశారు. ఇప్పుడు విద్యా శాఖ మంత్రిని లక్ష్యం చేసుకున్నారు. ఇవి మా పై అబద్ధపు ఆరోపణలు. నిజం కోర్టులో బయటపడుతుంది" అని ట్వీట్ చేశారు.
దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ గత కొన్ని నెలలుగా మనీ లాండరింగ్ ఆరోపణలతో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు.
సీబీఐ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించి శుక్రవారం దిల్లీలోని 10 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది.
హలో, గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.
