అత్యాచారం హత్య కేసులో నిందితుడిని పట్టుకుని కొట్టి చంపిన గ్రామస్తులు

మృతుడు అత్యాచారం, హత్య ఆరోపణల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడు మరో ఇద్దరు నేరస్తులతో పాటు మంగళవారం నాడు ధాకువాఖానా కోర్టు సమీపంలో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడు.

లైవ్ కవరేజీ

  1. అజిత్ డోబాల్‌ నివాసం వద్ద భద్రతా లోపం కేసులో అధికారులపై వేటు

    జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్

    ఫొటో సోర్స్, ANI

    జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ నివాసం వద్ద సెక్యూరిటీ లోపానికి కారణమయ్యారంటూ ముగ్గురు సీఐఎస్‌ఎఫ్ కమాండోల మీద వేటు వేసినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

    అలాగే ఇద్దరు సీనియర్ అధికారులను కూడా వీఐపీ సెక్యూరిటీ యూనిట్ నుంచి తొలగించారు.

    77 ఏళ్ల అజిత్ డోబాల్‌కు ‘Z+’ కేటగిరి భద్రత ఇస్తున్నారు. ఆయన అధికారిక నివాసం వద్ద పారామిలిటరీ బలగాలు పహారా కాస్తుంటాయి.

    ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఒక వ్యక్తి కారుతో అజిత్ డోబాల్ నివాసంలోకి చొచ్చుకుని పోయేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో భద్రతా దళాల లోపం ఉన్నట్లు తేలడంతో సబంధింత అధికారులపై చర్యలు తీసుకున్నారు.

  2. ఏమిటీ ‘స్మోకింగ్ పనిష్మెంట్’ టెక్నిక్.. ఇలా చేస్తే సిగరెట్లు మానేయవచ్చా

  3. సుబ్రమణియన్ స్వామి: ‘బీజేపీలో అంతా మోదీ మాట మీదనే నడుస్తోంది’

    బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామీ

    ఫొటో సోర్స్, Facebook/Dr. Subramanian Swamy

    బీజేపీ పార్లమెంటరీ బోర్డు మార్పుల మీద ప్రధాని నరేంద్ర మోదీని ఆ పార్టీ నేత సుబ్రమణియన్ స్వామి విమర్శించారు.

    ఒకప్పుడు బీజేపీలో ఎన్నికలు నిర్వహించి పార్టీ పదవులు భర్తీ చేసే వారని నేడు మోదీ మాట మీద అన్ని జరిగిపోతున్నాయని ఆయన అన్నారు.

    ‘ఒకప్పుడు జనతా పార్టీ, బీజేపీలలో... పార్టీ, పార్లమెంటరీ పార్టీ ఎన్నికలు నిర్వహించి పదవులను భర్తీ చేసేవాళ్లం. పార్టీ రాజ్యాంగం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేది.

    నేడు బీజేపీలో ఏమైనా సరే ఎన్నికలు నిర్వహించడం లేదు. మోదీ అనుమతితోనే అన్ని పదవులను భర్తీ చేస్తున్నారు.’ అని సుబ్రమణియన్ స్వామి ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. కాబుల్‌: మసీదులో పేలుళ్లు... ‘ముగ్గురు మృతి’

    కాబుల్

    అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లో గల ఒక మసీదులో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

    సాయంత్రం ప్రార్థనలు చేసున్న సమయంలో ఈ పేలుళ్లు జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు ముగ్గురు చనిపోగా 10 మందికి పైగా గాయపడినట్లు ఎన్‌జీఓ ఎమర్జెన్సీ తెలిపింది.

    కాబుల్ నార్త్-వెస్ట్‌లోనూ పేలుళ్లు జరిగినట్లు కాబుల్‌లోని తాలిబాన్ అధికార ప్రతినిధి ఖలీద్ జద్రాన్ వెల్లడించారు.

    మసీదు ఇమామ్ సిద్దిఖీ కూడా చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

    సుమారు వారం కిందట కాబుల్‌లోనే తాలిబాన్‌కు అనుకూలంగా ఉండే మతబోధకుడు ఆత్మాహుతి దాడిలో చనిపోయారు. ఈ దాడి పని తమదేనని ఇస్లామిక్ స్టేట్ నాడు ప్రకటించుకుంది.

    కానీ ప్రస్తుతం జరిగిన దాడి వెనుక ఎవరున్నారో ఇంకా తెలియలేదు.

  5. హలో, గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.