అజిత్ డోబాల్ నివాసం వద్ద భద్రతా లోపం కేసులో అధికారులపై వేటు
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ నివాసం వద్ద సెక్యూరిటీ లోపానికి కారణమయ్యారంటూ ముగ్గురు సీఐఎస్‌ఎఫ్ కమాండోల మీద వేటు వేసినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
అలాగే ఇద్దరు సీనియర్ అధికారులను కూడా వీఐపీ సెక్యూరిటీ యూనిట్ నుంచి తొలగించారు.
77 ఏళ్ల అజిత్ డోబాల్‌కు ‘Z+’ కేటగిరి భద్రత ఇస్తున్నారు. ఆయన అధికారిక నివాసం వద్ద పారామిలిటరీ బలగాలు పహారా కాస్తుంటాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఒక వ్యక్తి కారుతో అజిత్ డోబాల్ నివాసంలోకి చొచ్చుకుని పోయేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో భద్రతా దళాల లోపం ఉన్నట్లు తేలడంతో సబంధింత అధికారులపై చర్యలు తీసుకున్నారు.