చెస్ ఒలింపియాడ్‌లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించిన హంపి, హారికల బృందం

2012లో ఇస్తాంబుల్‌లో జరిగిన ఒలింపియాడ్‌లో.. భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. అక్కడి నుంచి ఒక స్థానం పెరిగి కాంస్య పతకం గెలుచుకోవటానికి దశాబ్దం పట్టింది.

లైవ్ కవరేజీ

  1. యుక్రెయిన్ యుద్ధం క్రైమియాతోనే మొదలైంది, దాని విముక్తితోనే ఆగాలి - జెలియెన్‌స్కీ

    క్రైమియాలోని రష్యా ఎయిర్‌బేస్‌లో పొగలు

    ఫొటో సోర్స్, Reuters

    క్రైమియాలోని రష్యా ఎయిర్‌బేస్‌లో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో పౌరుల్లో ఒకరు మృతి చెందగా 8 మంది గాయపడ్డారని క్రైమియా ప్రభుత్వం తెలిపింది.

    నొవోఫెడొరివ్కాకు సమీపంలోని సాకీ సైనిక శిబిరంలో మంగళవారం పొద్దున వరుసగా పేలుళ్లు సంభవించాయి.

    సుమారు 12 సార్లు పేలుళ్ల శబ్దాలు విన్నట్లు స్థానికులు తెలిపారు.

    ఆయుధగారంలోని మందుసామాగ్రి పేలడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని రష్యా రక్షణశాఖ చెప్పింది.

    ఈ దాడి వెనుక యుక్రెయిన్ ఉందని కొందరు భావిస్తుండగా అది తమ పని కాదని యుక్రెయిన్ అధ్యక్ష సహాయకుడు స్పష్టం చేశారు.

    అయితే ఈ దాడి తరువాత మాట్లాడిన యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ...‘క్రైమియాతో యుక్రెయిన్‌లో యుద్ధం మొదలైంది. క్రైమియా విముక్తితోనే ఈ యుద్ధం ముగుస్తుంది’ అని అన్నారు.

  2. హలో, గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.