విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థికి కేసీఆర్ మద్దతు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరేట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించారు.
టీఆర్‌ఎస్ ఎంపీలు అందరూ ఆమెకు ఓటు వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
థాయ్‌లాండ్‌లోని ఒక నైట్‌క్లబ్‌లో మంటలు చెలరేగిన దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మంది వరకూ గాయపడ్డారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరేట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించారు.
టీఆర్‌ఎస్ ఎంపీలు అందరూ ఆమెకు ఓటు వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
తమ ఊరిలో పొలాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఓ ఆదివాసీ రైతు చేశారు.
సొంత డబ్బులతో పెద్ద చెక్ డ్యాం నిర్మించి ఇచ్చారు.
పూర్తి వివరాల కోసం ఈ కథనం చూడండి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొకసారి వడ్డీ రేట్లు పెంచింది.
50 బేసిస్ పాయింట్లు పెంచడంతో రెపో రేటు 5.4శాతానికి చేరింది. అగస్ట్ 2019 తరువాత వడ్డీ రేట్లు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.
అంతర్జాతీయంగా అలుముకుంటున్న ఆర్థికమాంద్యం, పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
రష్యా-యుక్రెయిన్ యుద్ధం, తైవాన్-చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు భారత ఆర్థికవ్యవస్థకు సవాలుగా మారుతున్నాయి.
ఆర్‌బీఐ అంచనాలు:
2022-23 ద్రవ్యోల్బణం: 6.7శాతం
2023-24 తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం: 5శాతం
2022-23 జీడీపీ: 7.2శాతం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొకసారి వడ్డీ రేట్లు పెంచింది.
50 బేసిస్ పాయింట్లు పెంచడంతో రెపో రేటు 5.4శాతానికి చేరింది.
రెండో రోజు కూడా తైవాన్ సంధిలోని మధ్యరేఖను చైనా షిప్పులు, విమానాలు దాటినట్లు తైవాన్ రక్షణశాఖ తెలిపింది.
చైనా, తైవాన్ మధ్య తైవాన్ సంధిలో ఉన్న అనధికారిక విభజనరేఖను మధ్యరేఖ అంటారు.
నేడు కూడా చైనా సైనిక విన్యాసాలు కొనసాగనున్నాయి. నిన్న జరిపిన విన్యాసాల్లో భాగంగా తైవాన్‌కు సమీపంలోని సముద్రజలాల్లో మిసైల్స్ లాంచ్ చేసింది చైనా.
మరొక వైపు తాను తైవాన్‌లో శాంతి ఉండాలని కోరుకుంటున్నట్లు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ అన్నారు.
గత 25 ఏళ్లలో తైవాన్‌లో అడుగు పెట్టిన ఉన్నత స్థాయి రాజకీయనేతల్లో పెలోసీ ఒకరు.
ఆమె పర్యటనకు ముందు తైవాన్‌కు రావొద్దంటూ పెలోసీని చైనా హెచ్చరించింది.
ఇరాక్‌లో ఎండలు మండిపోతుండటం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ప్రకటించారు.
ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నారు.
సుమారు 10 ప్రావిన్సులలో పనులు నిలిపివేసినట్లు కర్దిస్తాన్24 రిపోర్ట్ చేసింది.
ఇరాక్‌లో ఎండలు కొత్తకాదు కానీ ఈసారి మాత్రం బాగా మండిపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు.
పోర్టు ప్రాంతమైన బాస్రాలో నాలుగు రోజులు సెలవు ప్రకటించారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.