థాయిలాండ్ నైట్‌క్లబ్‌లో చెలరేగిన మంటలు... 14 మంది మృతి

థాయ్‌లాండ్‌లోని ఒక నైట్‌క్లబ్‌లో మంటలు చెలరేగిన దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మంది వరకూ గాయపడ్డారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యావాదాలు!

    ఈనాటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ఇక్కడితో ముగిస్తున్నాం.

    ధన్యవాదాలు.

  2. అమెరికాతో కీలక రంగాల్లో సహకారం నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన చైనా

    షి జిన్‌పింగ్

    ఫొటో సోర్స్, Getty Images

    తైవాన్ వివాదం నేపథ్యంలో.. అమెరికాతో వివిధ కీలక రంగాల్లో సహకారాన్ని చైనా నిలిపివేసింది. వాతావరణ మార్పు, సైనిక చర్యలు, అంతర్జాతీయ నేరాలపై పోరాటానికి కృషి వంటి అంశాలు వీటిలో ఉన్నాయి.

    అమెరికా కాంగ్రెస్ స్పీకర్ నాన్సీ పెలోసీ సారథ్యంలో పార్లమెంటరీ ప్రతినిధుల బృందం తైవాన్ సందర్శన నేపథ్యంలో చైనా ఈ చర్యలు చేపడుతున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ శుక్రవారం ప్రకటించింది.

    అమెరికా బృందం పర్యటన.. తైవాన్ మీద తన సార్వభౌమాధాకారానికి సవాలు వంటిదని భావిస్తున్న చైనా.. డెమొక్రటిక్ పార్టీ సీనియర్ సెనెటర్ అయిన నాన్సీ పెలోసీ మీద, ఆమె కుటుంబం మీద ఆంక్షలు విధిస్తున్నట్లు కూడా ప్రకటించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    స్వయం పాలిత తైవాన్ తనను తాను చైనా భూభాగానికి వేరైన దేశంగా పరిగణిస్తుంది. చైనా అభ్యంతరాలను పట్టించుకోకుండా నాన్సీ పెలోసీ తైవాన్‌ను సందర్శించిన నేపథ్యంలో అమెరికాతో సహకారాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

    అమెరికా, చైనా రక్షణ అధికారుల మధ్య చర్చలను రద్దు చేస్తామని ఆ ప్రకటనలో చెప్పింది. అక్రమ వలసదారులను తిప్పి పంపిచటం, వాతావరణ మార్పు, అంతర్జాతీయ నేరాల మీద దర్యాప్తులను నిలిపివేస్తామని ప్రకటించింది.

  3. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పట్లే కాంగ్రెస్ అసలు నిరసన: అమిత్ షా

    అమిత్ షా

    ఫొటో సోర్స్, Getty Images

    ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ద్రవ్యోల్బణాల పట్ల నిరసన చేస్తున్నామన్న ముసుగులో కాంగ్రెస్ పార్టీ.. నిజానికి రామ మందిరం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విమర్శించారు.

    కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం నాడు నల్ల దుస్తులు ధరించి నిరసనలు చేపట్టారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ ప్రతి రోజూ నిరసనలు చేస్తోంది. కానీ వారు ఈ రోజు మాత్రమే నల్ల దుస్తులు ధరించారు’’ అని వ్యాఖ్యానించారు.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020లో ఇదే రోజున అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ చేశారు.

    ‘‘ఈ రోజు ఆగస్టు 5వ తేదీ. రామ మందిరం నిర్మాణానికి పునాది వేసిన ఈ రోజున.. నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. రామ జన్మభూమిలో గొప్ప మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేయటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామనే సందేశాన్ని పంపించటానికి వారు ప్రయత్నిస్తున్నారు’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

    ఈ విషయాన్ని నేరుగా చెప్పే ధైర్యం వారికి లేదని ఆయన విమర్శించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. హరియాణా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. 30 ఏళ్ల పాటు పోలీసులకు దొరక్కుండా ఎలా దాక్కున్నాడు? చివరికి ఎలా చిక్కాడు?

  5. తెలుగు సినిమా: షూటింగ్స్ బంద్...యాక్షన్ ఎప్పుడు

  6. ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

  7. ఆముద: ఐదో ఏటనే కాలు కోల్పోయినా ఆత్మవిశ్వాసంతో నిలబడిన భారత అథ్లెట్

  8. థాయ్‌లాండ్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. 14 మంది మృతి

    థాయ్‌లాండ్ నైట్ క్లబ్ అగ్నిప్రమాదం

    ఫొటో సోర్స్, SAWANG ROJANATHAMMASATHAN RESCUE FOUNDATION

    థాయ్‌లాండ్‌లోని ఒక నైట్‌క్లబ్‌లో మంటలు చెలరేగిన దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది వరకూ గాయపడ్డారు.

    చోన్బురి ప్రావిన్స్‌లోని సట్టాహిప్ జిల్లాలో గల మౌంటెయిన్ బి నైట్‌క్లబ్‌లో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి 1:00 గంట సమయంలో ఈ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. ఇది బ్యాంకాక్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    ప్రమాదం నుంచి బయటపడటానికి జనం అరుపులు, కేకలతో పరుగులు తీయటం.. వారిలో కొందరి ఒంటి మీద దుస్తులకు మంటలు అంటుకుని ఉండటం కొన్ని వీడియో దృశ్యాల్లో కనిపిస్తోంది.

    నైట్‌క్లబ్‌లో మంటలు చెలరేగటానికి కారణమేమిటన్నది ఇంకా తెలియరాలేదు. క్లబ్ గోడలమీద ఉన్న మండేస్వభావం గల పదార్థాల వల్ల మంటలు తీవ్రమై ఉండవచ్చునని సహాయ సిబ్బంది చెప్తున్నారు.

    మంటలను అదుపులోకి తీసుకురావటానికి అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలకు పైగా పోరాడారని స్థానిక మీడియా పేర్కొంది.

    క్లబ్‌లో లైవ్ మ్యూజిక్ ప్రదర్శన జరుగుతున్న సమయంలో మంటలు మొదలైనట్లు కనిపిస్తోందని చెప్తున్నారు. మరణించిన వారి మృతదేహాలు ఎక్కువగా ప్రవేశద్వారం దగ్గర, బాత్‌రూంలలో, డీజే బూత్ వద్ద కనిపించాయి.

    ఈ అగ్నిప్రమాదంపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని ప్రధానమంత్రి ప్రయుత్ చాన్-ఓచా ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామన్నారు.

    థాయ్‌లాండ్ నైట్ క్లబ్ అగ్నిప్రమాదం

    ఫొటో సోర్స్, SAWANG ROJANATHAMMASATHAN RESCUE FOUNDATION

  9. కోమటిరెడ్డి రాజగోపాల్ చేరిక బీజేపీకి 'బూస్టర్ డోస్' అవుతుందా?

  10. చీరాల – పేరాల: 100 ఏళ్ళ కిందటి ఈ ఉద్యమం 11 నెలలకే ఎందుకు కుప్పకూలింది?

  11. తైవాన్‌కు అండగా ఉండండి

    తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్

    సైనిక విన్యాసాలను చైనా తీవ్రతరం చేసిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం తమకు అండగా ఉండాలంటూ తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ కోరారు.

    చైనా చేపడుతున్న సైనిక విన్యాసాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని అవసరమైతే ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. పంజాబ్: కాంగ్రెస్ కార్యకర్తలపై జలఫిరంగులు

    పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం మీద పంజాబ్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.

    చంఢీగర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు.

    దిల్లీలో నిరసనకు దిగిన రాహుల్ గాంధీతో సహా ఇతర కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. బింబిసార రివ్యూ: రాక్ష‌సుడి నుంచి రాముడిగా మారిన ఓ రాజు క‌థ‌

  14. నాన్సీ పెలోసీపై చైనా ఆంక్షలు

    నాన్సీ పెలోసీ

    ఫొటో సోర్స్, EPA

    తమ హెచ్చరికలు పట్టించుకోకుండా తైవాన్‌లో పర్యటించిన నాన్సీ పెలోసీ, ఆమె దగ్గరి బంధువులపై చైనా ఆంక్షలు విధించింది.

    ‘చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకున్నారు. చైనా సారభౌమత్వానికి, ‘ఒకే చైనా’ అనే సిద్ధాంతానికి తీవ్రమైన విఘాతం కలిగించారు. తైవాన్ సంధిలోని శాంతి, స్థిరత్వాలను ప్రమాదంలో పడేశారు’ అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఒక ప్రకటనలో తెలిపారు.

  15. పేటీఎం సేవలకు అంతరాయం

    పేటీఎం సేవలకు అంతరాయం కలిగింది.

    పేటీఎంలో నెట్‌వర్క్ సమస్యల వల్ల పేటీఎం మనీ యాప్‌తోపాటు వెబ్‌సైట్‌ను కూడా యాక్సిస్ చేయడం యూజర్లకు కష్టంగా మారింది.

    పేటీఎం మనీలో ఇలా సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల స్టాక్ మార్కెట్ ట్రేడర్లు ఇబ్బందులకు లోనయ్యారు.

    పేమెంట్స్ చేయలేక పోయినట్లు రిపోర్ట్ చేశారు.

    అయితే ఎక్స్‌టర్నల్ నెట్‌వర్క్‌లో తలెత్తిన లోపం వల్ల సమస్యలు వచ్చాయని, తమ ఇంజినీరింగ్ టీం ఆ సమస్యను పరిష్కరించినట్లు పేటీఎం ట్వీట్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించాక నిరుద్యోగం పెరిగిందా? తగ్గిందా?

  17. థాయిలాండ్ నైట్‌క్లబ్‌లో అగ్ని ప్రమాదం... 13 మంది మృతి

    థాయిలాండ్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం

    ఫొటో సోర్స్, Sawang Rojanathammasthan Rescue Foundation

    థాయిలాండ్‌లోని ఒక నైట్ క్లబ్‌లో మంటలు చెలరేగడంతో 13 మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు.

    మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది సుమారు 2 గంటలు కష్టపడ్డారు.

    అగ్నిప్రమాదం జరగడానికి కచ్చితమైన కారణం ఏమిటో ఇంకా తెలియలేదు.

    థాయిలాండ్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం

    ఫొటో సోర్స్, Sawang Rojanathammasthan Rescue Foundation

  18. తైవాన్-చైనా విభజన రేఖను దాటిన చైనా యుద్ధ విమానాలు

    చైనా యుద్ధ విమానాలు

    ఫొటో సోర్స్, Getty Images

    తైవాన్ సమీపంలో చైనా సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి.

    చైనా, తైవాన్ మధ్య ఉండే విభజన రేఖను 20 చైనా యుద్ధవిమానాలు దాటినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.

    10 యుద్ధనౌకలు కూడా విభజన రేఖను దాటి వచ్చి అక్కడే ఉన్నట్లు వెల్లడించింది.

    మిసైల్స్ లోడ్ చేసి ఉన్న చైనా విమానాలు గాలిలో ఎగురుతున్నాయి.

    చైనా యుద్ధ విమానాలు

    ఫొటో సోర్స్, Getty Images

    చైనా యుద్ధ విమానాలను చూస్తున్న పిల్లలు

    ఫొటో సోర్స్, Getty Images

  19. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై విమర్శలు ఎందుకు వస్తున్నాయి?

  20. పెరుగుతున్న ధరలపై కాంగ్రెస్ నిరసనలు

    ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిరసనలు

    ఫొటో సోర్స్, UGC

    పెరుగుతున్న ధరలు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది.

    దిల్లీలో రాహుల్ గాంధీతో సహా ఇతర ఎంపీలు నల్లని దుస్తుల్లో పార్లమెంటుకు వచ్చిన నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

    కాంగ్రెస్ ఎంపీలు ర్యాలీగా పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరారు.

    కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

    ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు దిగాయి.

    కాంగ్రెస్ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, నల్లని దుస్తుల్లో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే
    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    నల్లని దుస్తుల్లో కాంగ్రెస్ ఎంపీలు

    ఫొటో సోర్స్, ANI