ధన్యవాదాలు!
ఈనాటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ఇక్కడితో ముగిస్తున్నాం.
ధన్యవాదాలు.
కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో భారత్ మరో పతకాన్ని సాధించింది. బుధవారం భారత్‌కు చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్‌ప్రీత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
శారద మియాపురం
ఈనాటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ఇక్కడితో ముగిస్తున్నాం.
ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, ANI
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని దిగ్బంధించారని, పార్టీ ప్రధాన కార్యాలయాన్ని, పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసాన్ని, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసాన్ని దిల్లీ పోలీసులు ముట్టడించారని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ చెప్పారు.
ఆయన బుధవారం ఒక ట్వీట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘కక్షా రాజకీయాల వికృత రూపమిది. మేం తలవంచం. మా గొంతు నొక్కలేరు. అన్యాయాలకు, మోదీ సర్కారు వైఫల్యాలకు వ్యతిరేకంగా మా గొంతు వినిపిస్తూనే ఉంటాం’’ అని పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మరోవైపు కాంగ్రెస్ నేత అభిషేక్ మనూ సింఘ్వీ దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘మీరు మమ్మల్ని అణచివేయటానికి ఎంతగా అయినా ప్రయత్నించవచ్చు. మా ప్రతిఘటనను మీరు చూస్తారు. పూర్తిగా ప్రజాస్వామిక ప్రతిస్పందనను ప్రపంచం చూస్తుంది. మిమ్మల్ని మేం ఎండగడుతూనే ఉంటాం’’ అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. ‘‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆహార ఉత్పత్తుల మీద జీఎస్‌టీ. ఈ మూడు అంశాలపై రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి నివాసాల ఎదుట నిరసన చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది’’ అని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘మీరు మమ్మల్ని ఎంతగా అణచివేసినా సరే కాంగ్రెస్ పార్టీ ఈ మూడు అంశాలపై నిరసనను కొనసాగిస్తుంది’’ అని పేర్కొన్నారు.
నిరసనకారులు ఏఐసీసీ కార్యాలయం వద్ద, సోనియాగాంధీ నివాసం వద్ద నిరసనకారులు పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశం ఉందంటూ స్పెషల్ బ్రాంచ్ నుంచి అందిన సమాచారంతో బుధవారం నాడు ఆయా ప్రాంతాల్లో దిల్లీ పోలీసులు బలగాలను మోహరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, ge
తైవాన్ చుట్టూ తాము ‘మిలటరీ ఆపరేషన్’ ప్రారంభించినట్లు చైనా ప్రకటించింది.
చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లిజియాన్ ఝావో బుధవారం రాత్రి ఒక ట్వీట్ చేస్తూ.. ‘‘తైవాన్ చుట్టూ పీఎల్ఏ (చైనా సైన్యం) సంయుక్త సైనిక చర్య ప్రారంభించింది. చైనా తన సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను దృఢంగా కాపాడుకుంటుంది’’ అని పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అదే సమయంలో.. తైవాన్ గగన తలం మీదకు చైనాకు చెందిన 27 యుద్ధ విమానాలు ప్రవేశించాయని తైవాన్ చెప్పినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.
చైనా చర్య దుందుడుకు సైనిక విన్యాసమని అభివర్ణించిన జీ-7 దేశాల బృందం.. ఆ విన్యాసాలను ఏవిధంగానూ సమర్థించుకోజాలదని విమర్శించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసి మంగళవారం తైవాన్ సందర్శనకు వచ్చారు. నాన్సీ పెలోసి, ఆమెతో పాటు వచ్చిన అమెరికా ప్రతినిధి బృందం.. తైవాన్ అధ్యక్షుడు త్సాయ్ ఇంగ్వెన్‌తో బుధవారం భేటీ అయింది.
కొందరు సామాజిక కార్యకర్తలను కూడా కలిసిన నాన్సీ.. బుధవారం తైవాన్ నుంచి బయలుదేరి అమెరికా తిరిగి వెళ్లారు. ఈ పర్యటనను చైనా వ్యతిరేకిస్తోంది. దీని పర్యవసానాలను అమెరికా, తైవాన్‌లు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది.

ఫొటో సోర్స్, Twitter/Sai media
కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో భారత్ మరో పతకాన్ని సాధించింది. బుధవారం భారత్‌కు చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్‌ప్రీత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
పురుషుల 109 కేజీల విభాగంలో పోటీపడిన లవ్‌ప్రీత్ సింగ్ ఓవరాల్‌గా 355 (స్నాచ్ 163, క్లీన్ అండ్ జర్క్ 192) కేజీల బరువునెత్తి మూడో స్థానంలో నిలిచాడు.
స్నాచ్ కేటగిరీ మూడు ప్రయత్నాల్లో వరుసగా 157, 161, 163 కేజీలు విజయవంతంగా లిఫ్ట్ చేశాడు.
క్లీన్ అండ్ జర్క్ మూడు ప్రయత్నాల్లోనూ వరుసగా 185, 189, 192 కేజీలు ఎత్తి పతకాన్ని అందుకున్నాడు.
ఈ విభాగంలో పరిక్లెక్స్ ఎన్‌గజ యబెయు (కామెరూన్) విజేతగా నిలిచాడు. ఆయన మొత్తంగా 361 కేజీల బరువునెత్తాడు. సమోవాకు చెందిన జాక్ హిటిలా 358 కేజీలు లిఫ్ట్ చేసి రజతాన్ని గెలుచుకున్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ani
ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు చేసే ప్రజాకర్షక వాగ్దానాలను తీవ్రమైన అంశంగా సుప్రీం కోర్టు వాఖ్యానించింది.
ఈ విషయంలో తామేమీ చేయలేమని ఎలక్షన్ కమిషన్ (ఈసీ), ప్రభుత్వం చెప్పడం తగదని అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఎన్నికల ప్రచారం సమయంలో రాజకీయ పార్టీలు ఇలాంటి వాగ్దానాలు చేయకుండా నియంత్రించడానికి ఒక ఉన్నత స్థాయి అపెక్స్ బాడీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ఇందులో నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, ఆర్‌బీఐతో పాటు అధికార, విపక్ష పార్టీల ప్రతినిధులకు చోటు కల్పించాలని చెప్పింది.
ఈ అపెక్స్ బాడీని ఎలా ఏర్పాటు చేస్తారో ఏడు రోజుల్లో చెప్పాలంటూ కేంద్రం, ఈసీ, సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్, పిటిషనర్‌లను కోరింది.
ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు పైవ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై వచ్చేవారం మరోసారి విచారించనుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య పుట్టినరోజు వేడుకలు భారీ ట్రాఫిక్ జామ్‌కు దారి తీశాయి.
ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని వేలాది మంది గుమిగూడటంతో పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై చాలా దూరం వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.
దేవనాగిరి జిల్లాలోని రహదారిపై 6 కి.మీ మేర వాహనాలు ఆగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
తైవాన్, టిబెట్ అంశంలో భారత మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయిలను బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి సుబ్రమణ్యం స్వామి నిందించారు.
నెహ్రూ, అటల్ బిహారి వాజ్‌పేయి మూర్ఖత్వం వల్లే భారతీయులంతా తైవాన్, టిబెట్‌లను చైనాలో భాగంగా పరిగణిస్తున్నారని సుబ్రమణ్యం స్వామి ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. వాస్తవాధీన రేఖ వద్ద ఉమ్మడి ఒప్పందం ఉన్నప్పటికీ లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలను చైనా లాక్కుందని... అయితే, మోదీ మాత్రం ‘ఎవరూ మన భూభాగంలోకి అడుగు పెట్టలేదు’ అని చెబుతున్నారని వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ, తైవాన్ పర్యటనతో చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తైవాన్ తమ భూభాగమేనని చైనా చెబుతుండగా.... తైవాన్ మాత్రం తమను తాము స్వతంత్ర దేశంగా భావిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ, తైవాన్ పర్యటనను అమెరికాలోని చైనా రాయబారి చింగ్ గాంగ్ తీవ్రంగా వ్యతిరేకించారు.
పెలోసీ పర్యటన చైనా-అమెరికా సంబంధాలపై ప్రభావం చూపుతుందని అన్నారు.
‘‘చైనా వ్యతిరేకించినప్పటికీ ఈరోజు నాన్సీ పెలోసీ, తైవాన్‌లో పర్యటిస్తున్నారు. ఇది చైనా-అమెరికా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ పర్యటటనను చైనా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత నియమాలకు ఉల్లంఘనగా భావిస్తున్నాం. దీనివల్ల తైవాన్‌లో శాంతి, స్థిరత్వంపై ప్రభావం పడుతుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వన్-చైనా పాలసీని ఎప్పటికీ మార్చమని, తైవాన్ స్వాతంత్ర్యానికి మద్దతు ఇవ్వబోమని అమెరికా ఎప్పుడూ చెబుతుండేది. కానీ, ఇప్పుడు చైనాను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే నాన్సీ ఈ పర్యటనకు వెళ్లారు. అమెరికా ఎప్పుడూ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండదు. నిప్పుతో ఆడుకునే వాళ్లు తమను తామే కాల్చుకుంటారు. చైనా మీద నియంత్రణ కోసం అమెరికా, తైవాన్ కార్డును వాడటం మానేయాలి. వెంటనే చేసిన తప్పును సరిదిద్దుకోవాలి’’ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంపీలు చేస్తోన్న తిరంగ బైక్ ర్యాలీని భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించారు.
ఎర్రకోట నుంచి ఈ ర్యాలీ జరుగుతుంది.
ర్యాలీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెంకయ్య నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్ పాల్గొన్నారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
పార్లమెంట్ సమీపంలోని విజయ్ చౌక్ వరకు ర్యాలీ సాగనుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్ కంపెనీలో విష వాయువు లీక్ అయిన ఘటనలో ప్రస్తుతం మొత్తం 94 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని విశాఖపట్నం జిల్లా అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
ఇందులో 53 మందిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా, మరో 41 మందికి జిల్లాలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న 53 మంది పరిస్థితి నిలకడగా ఉందని అనకాపల్లి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ హేమంత్ చెప్పారు.
బాధితులంతా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నీరసం, వాంతులతో బాధపడుతున్నట్లు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ ఘటనపై ఆంధ్రపదేశ్ మంత్రి జి. అమర్‌నాథ్ స్పందించారు. మంగళవారం బ్రాండెక్స్ సీడ్స్‌లో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో మొత్తం 121 మంది అస్వస్థతకు గురయ్యారని అన్నారు.
రెండు నెలల కాలంలో ఈ కంపెనీలో ఇలా జరగడం ఇది రెండోసారని, దీనిపై విచారణ పూర్తయ్యేవరకు కంపెనీని మూసివేస్తున్నామని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Taiwanese State TV
తైవాన్ పట్ల అమెరికా స్పీకర్ నాన్సీ చూపుతున్న శ్రద్దకు, ఆమె అందిస్తోన్న మద్దతుకు తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ కృతజ్ఞతలు తెలిపారు.
చైనా హెచ్చరిస్తోన్న లెక్క చేయకుండా తైవాన్‌కు వెళ్లిన నాన్సీ పెలోసీ ఉదయం అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్‌తో సమావేశమయ్యారు.
అధ్యక్ష భవనంలో జరుగుతోన్న ఈ సమావేశాన్ని స్థానిక మీడియా ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఈ సందర్భంగా సాయ్ ఇంగ్ వెన్ మాట్లాడుతూ... ‘‘స్పీకర్ పెలోసీకి, తైవాన్‌తో చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. మేడమ్ స్పీకర్, మీకు నా కృతజ్ఞతలు’’ అని అన్నారు.
తైవాన్‌కు రావడం తనకు, తన ప్రతినిధి బృందానికి గర్వంగా ఉందని పెలోసీ అన్నారు. ‘‘తైవాన్ పట్ల మా నిబద్ధత కొనసాగుతుంది. తైవాన్‌ను ఎప్పుడూ వదలబోం. ఈ దేశంతో సుదీర్ఘ స్నేహం మాకు గర్వకారణం. మునుపటి కంటే ఇప్పుడు తైవాన్‌కు అమెరికా అండగా ఉండటం చాలా కీలకం. ఈ పర్యటన ద్వారా ఇదే సందేశాన్ని అందించాలని అనుకుంటున్నాం.
అమెరికాకు తైవాన్ నమ్మకమైన మిత్రుడు. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో తైవాన్‌కు సెక్యూరిటీ, సరఫరా గొలుసు అంశంలో మరింత సహకారాన్ని అందజేస్తాం. దీంతో రాబోయే రోజుల్లో అమెరికా, తైవాన్ సంబంధాలు గతంలో కంటే మరింత పటిష్టంగా మారతాయి’’ అని అన్నారు.