అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్ లీక్, 50మంది మహిళా ఉద్యోగులకు అస్వస్థత
గ్యాస్ లీక్ కారణంగా అస్వస్థతకు గురైన ఉద్యోగులలో కొందరిని ఆసుపత్రికి తరలించగా, మరికొందరికి కంపెనీ ఆవరణలోనే చికిత్స చేశారు.
లైవ్ కవరేజీ
శారద మియాపురం
ధన్యవాదాలు..
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్ లీక్, పలువురు ఉద్యోగులకు అస్వస్థత

ఫొటో క్యాప్షన్, ఓ దుస్తుల కంపెనీలో గ్యాస్ లీక్ కారణంగా అస్వస్థతకు గురైన మహిళ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్ లీకైంది. దీంతో 50 మంది మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు.
సెజ్‌లోని బ్రాండిక్స్ దుస్తుల కంపెనీకి చెందిన సీడ్స్ కంపెనీ సమీపంలో ఈ వాయవు లీకైంది.
దీనిలో పనిచేసే మహిళ ఉద్యోగులు వాంతులు, వికారంతో స్పృహతప్పి పడిపోయారు. పలువురు ఉద్యోగులను అంబులెన్స్‌లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరికొందరిని కంపెనీ ఆవరణలో ప్రాథమిక చికిత్స కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన మంత్రి అమర్‌నాథ్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు.
మరోవైపు, ఈ ప్రమాదంలో బ్రాండిక్స్ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని, ఆ సంస్థ ఇండియా పార్ట్‌నర్ దొరస్వామిని అరెస్టు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది.
రెండు నెలల కాలంలో ఇది రెండో ఘటన అని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపి సంస్థపై చర్యలు తీసుకోవాలని సీపీఎం అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.

ఫొటో క్యాప్షన్, అస్వస్థతకు గురైన మహిళా ఉద్యోగులు మానసిక వైకల్యంతో ఉన్న చిన్నారులను ఆమె అమ్మలా చూసుకుంటారు
పాము, కప్ప కలిసి ప్రపంచానికి 1.4 లక్షల కోట్ల నష్టాన్ని కలిగించాయి, ఎలాగంటే...
చైనా వార్నింగ్‌ను లెక్క చేయకుండా తైవాన్‌లో అడుగుపెట్టిన అమెరికా స్పీకర్ పెలోసీ
క్యాసినో అంటే ఏంటి, అందులో ఏం చేస్తారు... చట్టాలు ఏం చెబుతున్నాయి?
అంబానీ, అదానీ: 5జీ సేవలపై ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న భారతీయ కుబేరులు
మంకీపాక్స్ గురించి ఆందోళన వద్దు: కేంద్ర ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, మంకీపాక్స్ గురించి ఆందోళన వద్దన్న కేంద్ర ప్రభుత్వం మంకీపాక్స్ కొత్త వ్యాధి కాదని, ప్రమాదకరమైంది కూడా కాదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. ప్రజలు అనవసరమైన ఆందోళనకు గురికావద్దని మాండవియా అన్నారు.
ఈ వ్యాధిపై పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. డీప్ కాంటాక్ట్ వల్ల మాత్రమే ఈ వ్యాధి వస్తుందని, ఇప్పటికీ 70 దేశాలలో ఈ వ్యాధి ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
“ప్రపంచంలోని కొన్ని దేశాలలో ఈ కేసులు ప్రారంభమైనప్పటి నుంచి దీనిని ఎదుర్కోవడానికి సన్నాహాలు చేస్తూ వచ్చాం. భారతదేశంలో మొదటి కేసు జూలై 14న కేరళలో బయటపడింది. ఆ వెంటనే అన్ని రాష్ట్రాలకు ఆరోగ్య మార్గదర్శకాలు జారీ చేశాం’’ అని మంత్రి చెప్పారు.
ఈ వ్యాధి నివారణ పర్యవేక్షణకు సంబంధించి కాంటాక్ట్ ట్రేసింగ్, నమూనా పరీక్ష కోసం అన్ని నియమాలను మార్గదర్శకాలలో వివరించామని ఆయన చెప్పారు.
"ఒక కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి వచ్చినట్లయితే, మిగిలిన వ్యక్తులను వారికి దూరంగా ఉంచడం ద్వారా దీనిని సులభంగా నియంత్రించవచ్చు" అని ఆయన అన్నారు.
దేశవ్యాప్తంగా ఇప్పటికి 8 మంకీపాక్స్ కేసులు వచ్చాయని, అయిదు దేశాల నుంచి ఇవి దేశంలోకి ప్రవేశించాయని మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కామన్వెల్త్ గేమ్స్: 2014లో కాంస్యం, 2018లో రజతం గెలిచిన పీవీ సింధు ఈసారి బంగారు పతకం తెస్తారా?
నేషనల్ హెరాల్డ్ కేసులో పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు

ఫొటో సోర్స్, SANCHIT KHANNA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి దిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది.
దీనికంటే కొన్ని రోజుల ముందే ఈ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించింది.
ఈడీ సోదాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ వార్తా ఏజెన్సీలు పీటీఐ, ఏఎన్‌ఐలు తెలిపాయి.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సోనియా కంటే ముందు రాహుల్ గాంధీని కూడా ఈడీ పలు దఫాలుగా ప్రశ్నించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం వారిని ప్రశ్నించినట్లు ఈడీ తెలిపింది.
యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్), నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను ప్రచురిస్తుంది. ఏజేఎల్‌కు సంబంధించిన భవనాల్లో ఈడీ సోదాలు చేసినట్లు భావిస్తున్నారు.
ఇదే కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌లను కూడా ఈడీ విచారించింది.

ఫొటో సోర్స్, ANI
అల్ జవహిరి: అల్ ఖైదా నాయకుడిని అమెరికా ఎలా వెతికి వేటాడి చంపిందంటే
కేరళలో అయిదో మంకీపాక్స్ కేసు

ఫొటో సోర్స్, Getty Images
కేరళ రాష్ట్రంలో మరో మంకీ పాక్స్ కేసు నమోదైనట్లు ఆరోగ్య మంత్రి వీనా జార్జిని ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
‘‘ఈ వ్యాధి లక్షణాలతో 30 ఏళ్ల వ్యక్తి మలప్పురంలో చికిత్స పొందుతున్నారు. ఆయన జూలై 27న యూఏఈ నుంచి కోజికోడ్‌కు వచ్చారు’’ అని ఏఎన్‌ఐ పేర్కొంది.
కేరళ రాష్ట్రంలో ఇది అయిదో మంకీపాక్స్ కేసు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చదరంగంలో దక్షిణ భారత క్రీడాకారులు ముందంజలో ఉండటానికి కారణమేంటి
విశాఖపట్నం: లైట్ హౌస్‌లు ఎలా పనిచేస్తాయి, వీటిని ఎందుకు ఏర్పాటు చేశారు
దిల్లీ: జంతర్‌మంతర్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడి ధర్నా... ఎందుకంటే

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ మంగళవారం దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ నిరసన ద్వారా ఆయన పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లనున్నారు.
ఆలిండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల సమాఖ్య (ఏఐఎఫ్‌పీఎస్‌డీఎఫ్)కు ప్రహ్లాద్ మోదీ ఉపాధ్యక్షుడు.
ధర్నా కార్యక్రమం తర్వాత సమాఖ్య ప్రతినిధులు, ప్రధాని నరేంద్ర మోదీకి ఒక మెమొరండంను సమర్పించనున్నట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో కూడా వారు సమావేశం కానున్నారు.
సమాఖ్య ఇతర ప్రతినిధులతో కలిసి ప్రహ్లాద్ మోదీ, జంతర్‌మంతర్ వద్ద ధర్నాలో పాల్గొంటారు.
పంచదార, బియ్యం, గోదుమల నష్టాలకు పరిహారంతో సహా తొమ్మిది డిమాండ్లను ఈ సమాఖ్య ప్రతినిధులు లేవనెత్తుతున్నారు.
దేశవ్యాప్తంగా ‘పశ్చిమ బెంగాల్ రేషన్ మోడల్’ను అమలు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.
పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తగా ఆయన పేరు ‘అధికారికంగా’ కనిపించదు.. ఎందుకు?
CUET (PG): సెప్టెంబర్‌లో కామన్ యూనివర్సిటీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్

ఫొటో సోర్స్, Getty Images
కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-పీజీ)ను సెప్టెంబర్‌లో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ఎం. జగదీశ్ కుమార్ చెప్పారు.
సెప్టెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11 తేదీల్లో ఈ పరీక్ష జరుగనున్నట్లు వెల్లడించారు.
కంప్యూటర్ ఆధారితంగా (కంప్యూటర్ బేస్ట్ టెస్ట్) ఆన్‌లైన్‌లో పరీక్ష జరుగుతుందని, ఈ పరీక్షకు దాదాపుగా 3.57 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశముందని అన్నారు.
అడ్మిట్ కార్డు విడుదల తేదీ వివరాలను తర్వాత ప్రకటిస్తామన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కామన్వెల్త్ గేమ్స్: వెయిట్ లిఫ్టర్ హర్జీందర్ కౌర్‌కు ప్రధాని మోదీ అభినందనలు

ఫొటో సోర్స్, Getty Images
కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత వెయిట్ లిఫ్టర్ హర్జీందర్ కౌర్‌ను ఆయన అభినందించారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
71 కేజీల వెయిట్ లిఫ్టింగ్ కేజీల విభాగంలో హర్జీందర్ కౌర్ పతకాన్ని గెలిచారు.
ఆమె ఓవరాల్‌గా 212 కేజీల బరువును ఎత్తి మూడో స్థానంలో నిలిచారు. స్నాచ్ విభాగంలో 93 కేజీలు ఎత్తిన హర్జీందర్, క్లీన్ అండ్ జర్క్ కేటగిరీలో 119 కేజీలు లిఫ్ట్ చేశారు.
ఆమె సాధించిన పతకంతో భారత్ ఖాతాలోని మెడల్స్ సంఖ్య 9కి చేరింది. ఇందులో ఏడు పతకాలు వెయిట్ లిఫ్టింగ్‌లోనే రావడం విశేషం.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.
