ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉరి వేసుకుని చనిపోయారు. మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో సమాచారం అందడంతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లైవ్ కవరేజీ

శారద మియాపురం

  1. నెయ్యి తింటే కలిగే లాభాలు ఇవీ

  2. ధన్యవాదాలు..

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

  3. నేటి ముఖ్యాంశాలు

    జులై నెలలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లలో 28 శాతం పెరుగుదల కనిపించింది.

    మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీనిలో తొమ్మిది మంది మరణించారు.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    లోక్‌సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.

    బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, గన్ లైసెన్స్‌ను పొందినట్లు ముంబై పోలీసు వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

  4. ఆంధ్రప్రదేశ్: 94 ఏళ్ళ వయసులో రోజూ 130 కి.మీ. ప్రయాణించి పాఠాలు చెబుతున్న ప్రొఫెసర్

  5. జులై నెలలో 28 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. మొత్తంగా రూ.1.47 లక్షల కోట్లు

    జీఎస్టీ

    ఫొటో సోర్స్, Getty Images

    జులై నెలలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లలో 28 శాతం పెరుగుదల కనిపించింది.

    ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలతో మాట్లాడి పీటీఐ వార్తా సంస్థ దీనిపై ఒక కథనం ప్రచురించింది.

    మొత్తంగా జులై నెలలో రూ.1,48,995 కోట్లు వసూలు అయినట్లు పీటీఐ తెలిపింది. గత ఐదేళ్లలో ఇది రెండో అత్యధికం అని పేర్కొంది.

    వీటిలో ఐజీఎస్టీ రూ.79,518 కోట్లు కాగా, సీజీఎస్టీ రూ.25,751 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.32,807 కోట్లు.

    ఇప్పటివరకు ఒక నెలలో అత్యధిక జీఎస్టీ వసూళ్లు గత ఏప్రిల్‌లో (రూ 1,67,540 కోట్లు) నమోదయ్యాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. మధ్యప్రదేశ్: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

    అగ్ని ప్రమాదం

    ఫొటో సోర్స్, ani

    మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీనిలో తొమ్మిది మంది మరణించారు.

    మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు పరిహారం ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు.

    విద్యుదాఘాతం వల్లే ప్రమాదం సంభవించినట్లు జబల్‌పూర్ ఎంపీ సిద్ధార్థ బహగుణ ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.

  7. ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

    అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

    ఈ వార్త తెలియగానే చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఎన్టీఆర్‌కు 12 మంది సంతానం కాగా అందులో 8 మంది కుమారులు, నలుగురు కూతుళ్లు.

    కూతుళ్ళలో ఉమామహేశ్వరి అందరికన్నా చిన్నవారు. ఇటీవలే ఆమె తన కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

    సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమె ఇంటికి మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో చేరుకున్నారు.

    పోస్ట్‌మార్టమ్ పూర్తయినట్లు పోలీసులు 6.30 గంటల ప్రాంతంలో తెలిపారు. డాక్టర్ తాఖియొద్దీన్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం పోస్ట్‌మార్టం నిర్వహించింది. ఆ సమయంలో నటుడు బాలకృష్ణ, నారా లోకేశ్ ఉస్మానియా ఆస్పత్రి వద్దే ఉన్నారు.

    ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం కోసంబీబీసీ లైవ్ పేజిక్లిక్ చేస్తూ ఉండండి.

  8. మంకీపాక్స్ వైరస్‌తో భారత్‌లో తొలి మరణం... 20 మందికి ఐసోలేషన్‌

  9. నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత

    పార్లమెంట్

    ఫొటో సోర్స్, Getty Images

    లోక్‌సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.

    సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించినందుకు గానూ కాంగ్రెస్‌కు చెందిన మాణికం ఠాగూర్, టీఎన్ ప్రతాపన్, రమ్య హరిదాస్, ఎస్. జ్యోతిమణిలను సస్పెండ్ చేశారు.

    తాజాగా ఈ సస్పెన్షన్‌ను ఎత్తివేయడంతో ఈ నలుగురు ఎంపీలు లోక్‌సభ సమావేశాల్లో హాజరయ్యారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ ఓం బిర్లా... సభలోకి ఎవరూ ప్లకార్డులను తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేల ఎవరైనా ప్లకార్డులను ప్రదర్శిస్తే తగిన చర్యలు తీసుకుంటామని, ఇదే చివరి అవకాశమని హెచ్చరించారు.

    దీని తర్వాత లోక్‌సభలో ఆందోళనలు సద్దుమణగడంతో ద్రవ్యోల్బణంపై చర్చను ప్రారంభించారు.

    పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి జీఎస్టీ, ద్రవ్యోల్బణంపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  10. డెత్ ఐలాండ్: హిట్లర్‌ను ఓడించడానికి ఆంత్రాక్స్ ప్రయోగించడంతో ఆ ద్వీపం 50 ఏళ్ల పాటు విషంగా మారిపోయింది, అల్ముండెనా డె కాబో, బీబీసీ న్యూస్

    హిట్లర్

    ఫొటో సోర్స్, INDELIBLE TELLY

    రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మిత్రరాజ్యాలకు ఒకటే లక్ష్యం.. నాజీల జర్మనీని ఓడించాలి. అందుకు అనేక రకాల ప్రణాళికలు రచించాయి. వాటిల్లో ఒకటి ఆంత్రాక్స్ పథకం.

    జీవ ఆయుధాలను (బయొలాజికల్ వెపన్స్) ఉపయోగించి నాజీ సైన్యాన్ని మట్టుబెట్టాలనుకున్నాయి. కానీ, ఆ పథకం తిప్పికొట్టింది. స్కాట్లాండ్‌లోని ఒక ద్వీపాన్ని పూర్తిగా విషపూరితం చేసింది.

    అయిదు దశాబ్దాల పాటు ఆ దీవిలోకి ఎవరూ అడుగుపెట్టలేకపోయారు. ఒకప్పుడు పక్షులకు అభయారణ్యంగా వెలుగొందిన ఈ ద్వీపం జీవులకు శాపంగా మారింది.

    అయితే, ఈ ఆపరేషన్ ఎలా జరిగిందన్న వివరాలు చాలాకాలం రహస్యంగానే ఉండిపోయాయి .

    స్థానికంగా నేటికీ ఆ దీవిని "ఆంత్రాక్స్ ద్వీపం" అనే పిలుస్తారు. "డెత్ ఐలాండ్" అని కూడా అంటారు. అదే స్కాట్లాండ్‌లోని గ్రునాడ్ ద్వీపం. దాదాపు 50 ఏళ్ల తరువాత 1990లో ఈ దీవిని "సురక్షితం"గా ప్రకటించినప్పటికీ, అక్కడ జీవితం సాధారణ స్థితికి రాలేదు.

  11. 15 ఏళ్లుగా ట్రాక్టర్లు రిపేర్ చేస్తున్న మహిళ

  12. ఇండియా హిందూ దేశంగా మారుతోందా

  13. ఈ ఆవులను మీ బాల్కనీలోనే పెంచుకోవచ్చు

  14. సల్మాన్ ఖాన్‌కు గన్ లైసెన్స్

    సల్మాన్ ఖాన్

    ఫొటో సోర్స్, AFP

    బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, గన్ లైసెన్స్‌ను పొందినట్లు ముంబై పోలీసు వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    వ్యక్తిగత రక్షణ కోసం గన్ లైసెన్స్ కావాలంటూ ఇటీవలే సల్మాన్ ఖాన్ దరఖాస్తు చేసుకున్నారు.

    తనతో పాటు తన తండ్రి సలీమ్ ఖాన్‌ను చంపుతామంటూ బెదిరింపు లేఖ రావడంతో సల్మాన్ ఖాన్, ముంబయి పోలీసులను సంప్రదించారని ఏఎన్ఐ పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. కామన్వెల్త్ గేమ్స్: ‘అచింత శౌలికి ఇక సినిమా చూసే సమయం దొరుకుతుందని ఆశిస్తున్నా’- ప్రధాని మోదీ

    వెయిట్ లిఫ్టర్ అచింత

    ఫొటో సోర్స్, Getty Images

    కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు మూడో స్వర్ణ పతకాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ అచింత శౌలిని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

    ఈ పతకాన్ని సాధించడం కోసం అచింత చాలా కష్టపడ్డారని మోదీ అన్నారు.

    భారత బృందం కామన్వెల్త్ క్రీడల కోసం బయల్దేరే ముందు తాను అచింతతో మాట్లాడానని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా తల్లి, సోదరుని నుంచి అచింతకు లభించిన సహకారం గురించి ముచ్చటించినట్లు చెప్పారు.

    కామన్వెల్త్‌లో పతకం సాధించాడు కాబట్టి ఇక అచింతకు సినిమా చూసే సమయం దొరుకుతుందని అనుకుంటున్నానని మోదీ సరదాగా అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    భవిష్యత్‌లో అచింత మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షించారు.

    ప్రధానితో పాటు అచింతను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ఆర్మీ అభినందించింది.

    కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అచింత బంగారు పతకాన్ని సాధించారు. పురుషుల 73 కేజీల విభాగంలో పోటీపడిన అచింత ఓవరాల్‌గా 313 కేజీల బరువునెత్తి విజేతగా నిలిచాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  16. హైదరాబాద్‌లో కాల్పులు... ఒకరి మృతి

    మాదాపూర్‌లో కాల్పులు

    ఫొటో సోర్స్, Getty Images

    హైదరాబాద్‌లో తెల్లవారుజామున కాల్పులు కలకలం సృష్టించాయి.

    మాదాపూర్‌లో ఇస్మాయిల్ అనే వ్యక్తిని ముజీబ్ అనే వ్యక్తి కాల్చి చంపారు. ఈ ఘటనలో మరొకరు గాయపడ్డారు.

    స్థిరాస్తి విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య జరిగిన గొడవే ఈ కాల్పులకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

    ఇస్మాయిల్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

  17. పశ్చిమ బెంగాల్: విద్యుదాఘాతంతో కనీసం 10 మంది కన్వారియాల మృతి

    పశ్చిమ బెంగాల్

    ఫొటో సోర్స్, Amit Pal

    పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహర్ జిల్లా నుంచి జల్‌పాయిగుడీ జిల్లాలోని జల్పేష్ గుడికి పికప్ వ్యాన్‌లో వెళ్తోన్న కనీసం 10 మంది కన్వారియాలు విద్యుదాఘాతంతో చనిపోయారు.

    ఈ ఘటనలో మరో 16 మంది గాయపడ్డారు. వీరిని జల్‌పాయిగుడీలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు.

    పికప్ వ్యాన్‌లో డీజే పెట్టడం కోసం ఏర్పాటు చేసిన జనరేటర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీనిపై విచారణను ప్రారంభించారు.

    ‘‘జనరేటర్ సహాయంతో వాహనంలో డీజేను నడుపుతుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాం’’ అని కూచ్ బెహర్ జిల్లాలోని మాథాభాంగా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ వర్మ చెప్పారు.

    గాయపడిన 16 మందిని ఆసుపత్రిలో చేర్చినట్లు ఆయన తెలిపారు. ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నారు.

    ఆ వ్యాన్‌లో ఉన్న కన్వారియాలు అందరూ సీతల్‌కుచి ప్రాంతానికి చెందినవారు. ఘటన గురించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

    వ్యాన్‌లో మొత్తం 27 మంది కన్వారియాలు ఉన్నారని, చెంగ్డాబాంధాలోని ధర్లా నది బ్రిడ్జి దాటిన తర్వాత ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.

    పలువురు కన్వారియాలు అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన వ్యాన్ డ్రైవర్ వారిని చెంగ్లాబాంధాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అందులో 10 మంది మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జనరేటర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు గాయపడినవారు చెప్పారు.

  18. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.