ఈ రోజు లైవ్ పేజీలో ముఖ్యాంశాలు
* కామన్‌వెల్త్ గేమ్స్ మహిళల షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు పాకిస్తాన్ క్రీడాకారిణి మహూర్ షహ్జాద్‌పై విజయం సాధించింది.
* బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత హాకీ మహిళల జట్టు ఘనాపై 5-0 తేడాతో విజయం సాధించింది.
* ఏపీ వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి లోన్ యాప్ నిర్వాహకులు అదే పనిగా ఫోన్లు చేయడం సంచలనంగా మారింది. కాకాణితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్‌కూ రుణాలు తీర్చాలంటూ ఇలాంటి ఫోన్లు వచ్చాయి.
* అనకాపల్లి జిల్లాలోని పూడిమడక బీచ్‌కు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం దొరకగా, మరొకరిని కొనఊపిరితో కాపాడి చికిత్స కోసంతరలించారు. మరో అయిదుగురు విద్యార్థుల కోసం సముద్రంలో గాలిస్తున్నారు.
* అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గురువారం రెండు గంటలపాటు సుదీర్ఘంగా ఫోన్‌లో సంభాషించారు. తైవాన్‌పై పరస్పరం హెచ్చరించుకున్నారు.