పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్: పాకిస్తాన్ ఆటగాళ్లపై కామన్‌వెల్త్ గేమ్స్‌లో విజయం - హాకీలో ఘనాపై భారత్ విజయం

కామన్‌వెల్త్ గేమ్స్‌ మహిళల షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు పాకిస్తాన్ క్రీడాకారిణి మహూర్ షహ్జాద్‌పై విజయం సాధించింది.

లైవ్ కవరేజీ

  1. ఈ రోజు లైవ్ పేజీలో ముఖ్యాంశాలు

    * కామన్‌వెల్త్ గేమ్స్‌ మహిళల షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు పాకిస్తాన్ క్రీడాకారిణి మహూర్ షహ్జాద్‌పై విజయం సాధించింది.

    * బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత హాకీ మహిళల జట్టు ఘనాపై 5-0 తేడాతో విజయం సాధించింది.

    * ఏపీ వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి లోన్ యాప్ నిర్వాహకులు అదే పనిగా ఫోన్లు చేయడం సంచలనంగా మారింది. కాకాణితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్‌కూ రుణాలు తీర్చాలంటూ ఇలాంటి ఫోన్లు వచ్చాయి.

    * అనకాపల్లి జిల్లాలోని పూడిమడక బీచ్‌కు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం దొరకగా, మరొకరిని కొనఊపిరితో కాపాడి చికిత్స కోసంతరలించారు. మరో అయిదుగురు విద్యార్థుల కోసం సముద్రంలో గాలిస్తున్నారు.

    * అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ గురువారం రెండు గంటలపాటు సుదీర్ఘంగా ఫోన్‌లో సంభాషించారు. తైవాన్‌పై పరస్పరం హెచ్చరించుకున్నారు.

  2. పీవీ సింధు: కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాకిస్తాన్ క్రీడాకారిణిపై విజయం

    కామన్‌వెల్త్ గేమ్స్‌ మహిళల షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు పాకిస్తాన్ క్రీడాకారిణి మహూర్ షహ్జాద్‌పై విజయం సాధించింది.

    21-7, 21-6 తేడాతో రెండు వరుస సెట్లలో సింధు విజయం సాధించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    కామన్‌వెల్త్ గేమ్స్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ మ్యాచ్‌లలో భాగంగా పాకిస్తాన్‌తో భారత జట్టు 5 మ్యాచ్‌లు ఆడింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, ఎస్.రెడ్డిల జోడీ పాకిస్తాన్ జోడీపై విజయం సాధించారు.

    అలాగే మెన్స్ సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్.. మురాద్ అలీపై విజయం సాధించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ఉమెన్స్ సింగిల్స్‌లో పీవీ సింధు పాక్ కీలక క్రీడాకారిణి మహూర్ షాజాద్‌పై గెలిచారు.

    పురుషుల డబుల్స్‌లో చిరాగ్ షెట్టి, ఎస్.రెడ్డిల జోడీ కూడా విజయం సాధించింది.

    మహిళల డబుల్స్‌లో త్రిషా జాలి, గాయత్రి ప్రజాపతిల జోడీ కూడా పాక్ జోడీపై విజయం సాధించింది.

    దీంతో మొత్తం పాకిస్తాన్‌తో 5 మ్యాచ్‌లనూ భారత్ గెలుచుకున్నట్లయింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  3. కామన్‌వెల్త్ గేమ్స్: మహిళల హాకీలో 5-0 తేడాతో ఘనాపై భారత్ విజయం

    hockey

    ఫొటో సోర్స్, REUTERS/Phil Noble

    బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత హాకీ మహిళల జట్టు ఘనాపై 5-0 తేడాతో విజయం సాధించింది.

    సవిత పూనియా కెప్టెన్సీలోని భారత జట్టు ఆట ఆరంభం నుంచి దూకుడు కొనసాగించింది.

    భారత జట్టులో గుర్జీత్ కౌర్ రెండు గోల్స్ చేయగా నేహా గోయల్, సంగీతాకుమారి, సలీమా ఒక్కో గోల్ సాధించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. సవితా పూనియా: ది గ్రేట్ వాల్‌గా పేరొందిన భారత మహిళా హాకీ టీమ్ కెప్టెన్

  5. మంత్రయితే మాకేంటి?.. లోన్ యాప్ ఏజెంట్ల ఆగడాలు - ఏపీ మంత్రి, మాజీ మంత్రికి వరుస ఫోన్లు

    kakani Govardhan Reddy

    ఫొటో సోర్స్, facebook/kakaniGovardhanReddy

    లోన్ యాప్‌ల నుంచి వచ్చే ఫోన్లు ఏపీలో ఓ మంత్రి, మాజీ మంత్రిని కూడా ఇబ్బంది పెట్టాయి.

    ఏపీ వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి లోన్ యాప్ నిర్వాహకులు అదే పనిగా ఫోన్లు చేయడం సంచలనంగా మారింది.

    కాకాణితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్‌కూ రుణాలు తీర్చాలంటూ ఇలాంటి ఫోన్లు వచ్చాయి.

    కాకాణి గోవర్దన్ రెడ్డి, అనిల్ కుమార్‌ల పేర్లు, ఫోన్ నంబర్లు వాడుకుని ఇతరులు ఎవరో లోన్లు తీసుకోవడంతో ఇలా జరిగినట్లు చెబుతున్నారు.

    తనకు ఏకంగా 70 సార్లు లోన్ యాప్ నుంచి ఫోన్ వచ్చిందని కాకాణి చెప్పగా తనకు కూడా 20 సార్లు ఫోన్ చేసినట్టు అనిల్ కుమార్ చెప్పారు.

    వీరిద్దరి పేర్లు, ఫోన్ నెంబర్లు ఉపయోగించి ఎవరో రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో యాప్ ఏజెంట్లు వీరికి ఫోన్ చేశారు.

    ఇప్పటికే రాష్ట్రంలో పలువురు సామాన్యులు ఇలాంటి లోన్ యాప్స్ బారిన పడి ప్రాణాలు కూడా తీసుకోగా, మరో వైపు బ్యాంకుల రికవరీ ఏజెంట్ల వ్యవహారం కూడా నందిగామ ఘటనతో వెలుగులోకి వచ్చింది.

    ఇలాంటి తరుణంలో లోన్ యాప్ ఏజెంట్లు మంత్రులు, మాజీ మంత్రులకూ ఫోన్లు చేసి బెదిరించడం చర్చనీయమవుతోంది.

    ‘అశోక్ కుమార్ అనే వ్యక్తి లోన్ తీసుకుని నా నెంబర్ప్రత్యామ్నాయంగా ఇచ్చారనిచెప్పారు. అందుకే ఫోన్ చేస్తున్నామన్నారు. వివరాలు పోలీసులకు అందించాం. పోలీసుల వారి వివరాలు సేకరించి నలుగురిని అరెస్ట్ చేశారు. వారిని విడిపించేందుకు పది మంది ప్రముఖ లాయర్‌లు రావడం ఆశ్చర్యంగా ఉంది. లోన్ యాప్ముఠాను ట్రాప్ చేసేందుకు..మా పీఏ కూడా 25,000 రూపాయలు చెల్లించడం జరిగింది. ఎవరికైనాఇబ్బంది ఎదురైతే పోలీసులకు కానీ..నాకు కానీ చెప్పండి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చెన్నై కేంద్రంగా ముఠా దారుణాలు చేస్తోంది" అంటూ మంత్రి కాకాణి వెల్లడించారు.

    వరుసగా అన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్న తరుణంలో ఏపీ పోలీసులు కూడా దృష్టి పెడుతున్నట్టు మంత్రి తెలిపారు.

  6. అనకాపల్లి పూడిమడక బీచ్‌లో ఏడుగురు విద్యార్థులు గల్లంతు, వారిలో ఒకరు మృతి

    పూడిమడక సముద్రం వద్ద పోలీసులు, స్థానికులు

    అనకాపల్లి జిల్లాలోని పూడిమడక బీచ్‌కు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం దొరకగా, మరొకరిని కొనఊపిరితో కాపాడి చికిత్స కోసంతరలించారు. మరో అయిదుగురు విద్యార్థుల కోసం సముద్రంలో గాలిస్తున్నారు.

    గల్లంతైన విద్యార్థులంతా అనకాపల్లిలోని డైట్ ఇంజినీరింగ్ కాలేజికి చెందినవారు.

    గల్లంతైనవారిలో పవన్(19) మృతి చెందగా సూరిశెట్టి తేజ అనే మరో విద్యార్థిని స్థానికులు రక్షించారు.

    జగదీశ్, జశ్వంత్, సతీశ్, గణేశ్, చందు అనే మరో అయిదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరి కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు.

  7. ఇవి ప్రపంచంలోనే అత్యంత హానికారకమైన నత్తలు: ‘వీటిని తాకొద్దు, తినొద్దు’ - అధికారుల హెచ్చరిక

  8. నియంతలైనా దేశం దాటి పారిపోవాల్సిందేనా? అజ్ఞాతంలోకి వెళ్లాక ఏం జరుగుతుంది? 10 మంది పాలకుల కథ..

  9. రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: విధులు నిర్వ‌ర్తించ‌డంలో త‌డ‌బ‌డిన దర్శకుడు

  10. నేపాల్: పులుల సంఖ్య పెరిగితే ఓ పక్క ఆనందం.. మరోపక్క భయం

  11. రామ్‌చరణ్ తదుపరి జేమ్స్‌బాండ్ అవుతారా... హాలీవుడ్ రైటర్ ట్వీట్‌తో సోషల్ మీడియాలో హంగామా

  12. అధీర్ రంజన్ చౌదరి: ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అంటారా... సోనియాగాంధీ క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న బీజేపీ

  13. కామన్వెల్త్ క్రీడలు: బర్మింగ్‌హామ్‌లో ప్రారంభం.. పీవీ సింధు, మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలో భారత్‌

    కామన్వెల్త్ క్రీడలు

    ఫొటో సోర్స్, Getty Images

    బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో 22వ కామన్వెల్త్ క్రీడలు ప్రారంభమయ్యాయి.

    గురువారం బర్మింగ్‌హామ్‌లోని అలెగ్జాండర్ స్టేడియంలో బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ ఈ క్రీడలను ప్రారంభించారు.

    ప్రారంభ వేడుకలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని స్టేడియంలో భారత బృందానికి నాయకత్వం వహించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఈ కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ కూడా పాల్గొన్నారు. తన ప్రసంగంలో విద్య ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు.

    ఆగస్టు 8 వరకు జరిగే కామన్వెల్త్ క్రీడల్లో 72 దేశాల నుంచి 5,000 మందికి పైగా అథ్లెట్లు పాల్గొననున్నారు. ఈసారి 19 రకాల క్రీడల్లో మొత్తం 280 పతకాలు ప్రకటించారు.

  14. తైవాన్‌పై పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకున్న జో బైడెన్, షీ జిన్‌పింగ్

    బైడెన్

    ఫొటో సోర్స్, Twitter.com/POTUS

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ గురువారం రెండు గంటలపాటు సుదీర్ఘంగా ఫోన్‌లో సంభాషించారు. తైవాన్‌పై పరస్పరం హెచ్చరించుకున్నారు.

    తైవాన్ స్థితిని మార్చే ఎలాంటి ఏకపక్ష చర్యలనైనా అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని బైడెన్, జిన్‌పింగ్‌ను హెచ్చరించారు. అలాగే, తైవాన్‌పై అమెరికా విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.

    అయితే, అమెరికా 'వన్-చైనా పాలసీ'ని అంగీకరించాలని, "నిప్పుతో చెలగాడం ఆడవద్దని" జిన్‌పింగ్, బైడెన్‌ను హెచ్చరించినట్లు బీజింగ్ తెలిపింది.

    అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటిస్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో, తైవాన్ సమస్యపై ఉద్రిక్తతలు పెరిగాయి.

    అయితే, పెలోసీ తన పర్యటనకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

    కాగా, ఆమె తైవాన్ దీవిలో అడుగుపెడితే "తీవ్ర పరిణామాలు" ఎదుర్కోవలసి వస్తుందని చైనా ఇప్పటికే హెచ్చరించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    గతవారం, నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటనపై బైడెన్ స్పందిస్తూ "ఇది మంచి ఆలోచన కాదని మిలటరీ భావిస్తున్నట్టు" తెలిపారు.

    అయితే, ఈ పర్యటన గురించి చైనా ముందస్తు వ్యాఖ్యలు, హెచ్చరికలు "పనికిరానివి, అనవసరం" అని వైట్ హౌస్ అభిప్రాయపడింది.

    గురువారం జరిగిన ఫోన్ కాల్‌లో బైడెన్, జిన్‌పింగ్ ముఖాముఖి సమావేశం కావడం గురించి కూడా చర్చించారని అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

    బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు, 2015లో షీ జిన్‌పింగ్ అమెరికాలో పర్యటించారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఈ ఇద్దరు నేతలు ముఖాముఖి సమావేశం కాలేదు.

    తైవాన్‌పై సార్వభౌమాధికారం తమదేనని, ఎప్పటికైనా ఆ దీవి తమ భూభాగంలో కలవాల్సిందేనని చైనా వాదిస్తుంది.

    వన్-చైనా విధానం ప్రకారం, అమెరికా దౌత్యపరంగా తైవాన్‌ను గుర్తించదు. కానీ, తైవాన్‌ తనను తాను రక్షించుకోవడానికి అమెరికా ఆ దేశానికి ఆయుధాలను విక్రయిస్తుంది.

  15. కోవిడ్-19: చైనా వ్యాక్సీన్లను ఇస్తున్న దేశాల్లో మళ్లీ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?